ఆకస్మిక గుండెపోటు.. ఈ లక్షణాలను లైట్ తీసుకున్నారో..!
పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. అందుకే గుండెపోటు సంకేతాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి.

ఎన్సీబీఐ ప్రకారం.. గుండె జబ్బులు అంటే హృదయ సంబంధ వ్యాధులతో ఎక్కువగా బాధపడుతున్న దేశాలలో భారతదేశం ఒకటి. 1990లో గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య 2.26 మిలియన్లు కాగా 2020 నాటికి అది 4.77 మిలియన్లకు పెరిగింది. భారతదేశంలో గుండె జబ్బులు గ్రామీణ ప్రాంతాలలో 1.6 నుంచి 7.4 శాతం మందిని ప్రభావితం చేస్తాయని, పట్టణ ప్రాంతాలలో ఇది జనాభాలో 1 నుంచి 13.2 శాతం మధ్య ఉంటుందని సర్వేలు వెళ్లడిస్తున్నాయి. అందుకే మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గుండెపోటుకు ముందు మీ శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
heart attack
హార్ట్ ఎటాక్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి
బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ ప్రకారం.. యూకేలో 11 శాతం మంది పురుషులు, 9 శాతం మంది మహిళలు గుండె సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు గుండె జబ్బులకు కారణమవుతాయి. ఛాతీకి ఎడమ వైపున ఉన్న మన గుండె రోజంతా 5,000 గ్యాలన్ల రక్తాన్ని పంప్ చేయగలదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. గుండెపోటు ప్రతి సంవత్సరం 18 మిలియన్ల మందిని బలితీసుకుంటోంది.
ముఖ్యంగా నగరాల్లో పెరుగుతున్న గుండెపోటు కేసులు యువతలో ఆందోళన పెంచుతున్నాయి. వర్కౌట్లు చేసేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు, పాడుతున్నప్పుడు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. అసలు గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
శ్వాస ఆడకపోవడం
గుండెజబ్బుతో బాధపడుతున్నప్పుడు రోగికి హృదయ స్పందన రేటు పెరగడంతో పాటుగా సరిగా శ్వాస తీసుకోలేకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. పూర్తిగా శ్వాస తీసుకోలేకపోవడం వల్ల ఊపిరితిత్తుల్లో భారంగా ఉన్న భావన కలుగుతుంది. ఇలాంటి సమయంలో వీళ్లు ఫాస్ట్ గా శ్వాస తీసుకుంటారు. అయితే శ్వాస సమస్యలు కొన్నిసార్లు రక్తహీనత లేదా అలెర్జీల వల్ల కూడా వస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఊపిరితిత్తులు లేదా గుండె జబ్బులేనంటున్నారు నిపుణులు. శ్వాస ఆడకపోవడం గుండె సంబంధిత వ్యాధికి ప్రాధమిక సంకేతం.
ఛాతీ నొప్పి
బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ ప్రకారం.. ఛాతీ నొప్పి, అసౌకర్యం గుండె సమస్యల లక్షణం. గుండెపోటు వచ్చిన తర్వాత కూడా ఛాతీ బరువుగా, బిగుతుగా ఉంటుంది. ఒత్తిడికి కూడా గురవుతుంది. ఇది మీ ఛాతిపై ఏదో బరువైన వస్తువును పెట్టినట్టుగా అనిపిస్తుంది. మీరు ఫాస్ట్ గా శ్వాస తీసుకోవడం ప్రారంభించినప్పుడు బరువు పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
heart attack
ఎడమ భుజంలో తిమ్మిరి
గుండె సంబంధిత సమస్య తలెత్తినప్పుడు ఎడమ చేయి, భుజం నరాల్లో నొప్పి మొదలవుతుంది. ఇది మనకు గుండె జబ్బుల సూచనను ఇస్తుంది. ఈ కారణంగా ఎడమ చేయి లేదా భుజంలో ఎప్పుడూ నొప్పి లేదా ఒత్తిడి ఉంటుంది. నొప్పితో శ్వాస సమస్యలు ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
heart attack
కళ్ల ముందు నల్లటి మచ్చలు
చాలా సేపు ఛాతీనొప్పి, బరువుగా ఉండటం వల్ల కళ్ల ముందు నల్లని మచ్చలు వస్తాయి. చేతులు, కాళ్ల నొప్పులతో పాటు ఈ నొప్పి మెడ, దవడకు కూడా చేరుకుంటుంది.
మహిళల్లో సాధారణంగా కనిపించే సంకేతాలు
మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎసిడిటీ సమస్యలకు కారణమవుతాయి. వాయువు ఏర్పడటం, వెన్నునొప్పి సంకేతాలు కనిపిస్తాయి. అలాగే అలసట, గ్యాస్ కారణంగా వెన్నునొప్పి సమస్య ఎక్కువవుతుంది.
heart attack
గుండెపోటుకు మొదటి చికిత్స ఏంటి?
నిపుణుల ప్రకారం.. రోగికి ఈ లక్షణాలన్నీ ఉంటే.. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఈసీజీ చేయించుకోవాలి. అరగంట తర్వాత మళ్లీ ఈసీజీ చేయించుకోవాలి. ఇది సరైన ఫలితాలను ఇస్తుంది. దీని తర్వాత టోపోనిన్ ఇ, ఐ (రక్త పరీక్ష) చేయించుకోవాలి. మీ ఇల్లు హాస్పటల్ కు దూరంగా ఉంటే ఆ వ్యక్తికి వెంటనే 1/4 గ్లాసులో కరిగించిన డిస్ప్రిన్ ఇవ్వండి.