Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • సెక్స్ తో వ్యాధులు.. పురుషుల ప్రైవేట్ భాగాల్లో కనిపించే లక్షణాలు..

సెక్స్ తో వ్యాధులు.. పురుషుల ప్రైవేట్ భాగాల్లో కనిపించే లక్షణాలు..

లైంగిక కార్యకలాపాల వల్ల లైంగిక సంక్రమణ అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇవి ఒకరినుంచి ఒకరికి వ్యాపిస్తాయి. మరి ఎస్టీఐల బారిన పడితే పురుషుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..?   

Mahesh Rajamoni | Published : May 19 2023, 09:43 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

సెక్స్ తో ఎన్నో మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ సెక్స్ తో కూడా కొన్ని రకాల ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా లైంగిక సంక్రమణ వ్యాధులు. ఇవి మనిషిని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తాయి. అందుకే చాలా మంది లైంగిక సంక్రమణ అంటువ్యాధుల గురించి బయపడుతుంటారు. మనలో చాలా మంది దీని గురించి బహిరంగంగా మాట్లాడే సాహసం చేయరు. కొంతమంది హాస్పటల్ కు కూడా వెళ్లడానికి ఇష్టపడరు. దీనివల్లే చిన్న సమస్య కాస్త ప్రాణాంతకంగా మారుతుంది. ఈ ఎస్టీఐలు సంతానోత్పత్తితో సహా జీవన నాణ్యతను ప్రభావితం చేస్తాయి. ఎస్టిఐలు ఒక లైంగిక భాగస్వామి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే సెక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

28
penis

penis

లైంగిక సంక్రమణ వ్యాధులు పురుషులతో పోలిస్తే  ఆడవారికే ఎక్కువగా వస్తుంటాయి. అయితే పురుషులు వీటి బారిన పడితే వారి ప్రైవేట్ శరీర భాగాలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలను తెలుసుకుంటే ఈ సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు. ఆ సంకేతాలేంటంటే.. 

38
Asianet Image

మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట

మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట రావడం చాలా సహజం. అయితే ఇది లైంగిక సంక్రమణ వ్యాధుల వల్ల కూడా వస్తుంది. ఇది పురుషులలో కనిపించే ఎస్టీఐ ల క్లాసిక్ సంకేతం. ఆడవారికి కూడా ఇలాంటి సమస్య ఉంటే వారు కూడా ఎస్టీఐ బారిన పడినట్టే. అయితే ఎస్టీఐ బారిన పడ్డ పురుషులకు తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలుగుతుంది. అలాగే మూత్ర విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. 
 

48
Asianet Image

పురుషాంగం నుంచి ఉత్సర్గ

పురుషాంగం నుంచి ఉత్సర్గ ఎక్కువ రావడం అస్సలు మంచిది కాదు. దీనిని పురుషులు ఎప్పటికీ విస్మరించకూడని ఎస్టిఐ ల మరొక లక్షణమంటున్నారు నిపుణులు. పురుషాంగం నుంచి అసాధారణ ఉత్సర్గ వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. 
 

58
Asianet Image

దుర్వాసన ద్రవ ఉత్సర్గ 

పురుషులు లైంగిక సంక్రమణ అంటువ్యాధుల బారిన పడితే తీవ్రమైన ఉత్సర్గ రావడమే కాదు.. కొన్నిసార్లు ఈ ద్రవ ఉత్సర్గ దుర్వాసనను కలిగి ఉంటుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. 
 

68
Asianet Image

స్ఖలనం చేసేటప్పుడు ఇబ్బంది

స్ఖలనం చేసేటప్పుడు ఇబ్బంది కలగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎస్టీఐలు. అవును ఎస్టీఐలు సంభోగం సమయంలో పురుషులకు స్ఖలనం చేయడాన్ని కష్టతరం చేస్తాయి. ఇలాంటి సమస్య వస్తే ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లండి. ఈ లక్షణం వల్ల సెక్స్ చేసేటప్పుడు స్ఖలనం సమయంలో విపరీతమైన నొప్పి, అసౌకర్యం కలుగుతాయి. 
 

 

78
Asianet Image

పొత్తికడుపులో నొప్పి

పొత్తికడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే పురుషులకు దిగువ పొత్తికడుపులో భరించలేని నొప్పి రావడానికి ఎస్టీఐ లు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఇది క్లామిడియా క్లాసిక్ సంకేతం. దీనిలో వ్యక్తి మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి కలుగుతుంది. అలాగే పురుషాంగం నుంచి దుర్వాసన ఉత్సర్గ వస్తుంది. 
 

88
Asianet Image

ప్రైవేట్ ప్రాంతంలో దురద, గడ్డలు

మీ ప్రైవేట్ ప్రాంతాలలో ఎర్రటి దద్దుర్లు కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. ఆ ప్రాంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం లేదా ఆ ప్రదేశంలో సబ్బును సరిగ్గా కడగకపోవడం లేదా మురికి లోదుస్తులు ధరించడం వంటి అపరిశుభ్రమైన అలవాట్లు దీనికి కారణం కావొచ్చు.అయితే ఈ సమస్య కొన్ని రోజుల వరకు అలాగే ఉంటేఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోండి. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories