పిల్లలకు డైపర్లు వేస్తే..?
ప్రస్తుతం డైపర్ల వాడకం బాగా పెరిగిపోయింది. పుట్టినప్పటి నుంచి పిల్లలకు డైపర్లను వేస్తున్నారు. డైపర్ల వల్ల కొన్ని లాభాలు ఉన్నప్పటికీ.. ఇవి మీ పిల్లలకు ఎన్నో సమస్యలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఒకప్పుడు పసి పిల్లలకు కాటన్ క్లాత్ ను వాడేవారు. ఇప్పుడు డైపర్లను వాడుతున్నారు. డైపర్ల వల్ల తల్లిదండ్రులకు కొంతవరకు పనిభారం తగ్గుతుంది. అందులోనూ డైపర్లు చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. పిల్లలు మూత్ర విసర్జన చేసినప్పటికీ వీటిని అలాగే ఉపయోగించొచ్చు. మూత్రాన్ని ఇది లాక్ చేస్తుంది. అయితే పిల్లలు మలవిసర్జన చేస్తే మాత్రం వెంటనే డైపర్ ను మార్చాలి. డైపర్లలో మూత్రం లేదా మలంతో దీర్ఘకాలిక చర్మ సమస్యలు వస్తాయి. ఇది చికాకు కలిగిస్తుంది. డైపర్ల వల్ల పిల్లలకు అమ్మోనియాకల్ దద్దుర్లు రావొచ్చు. అంతేకాదు డైపర్లు తేమగా ఉండటం వల్ల చర్మం ఫంగల్ ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదం కూడా ఉంది.
డైపర్లను ఎందుకు మార్చాలి?
ఆస్తమా, డయాబెటిస్, ఎడిహెచ్డి వంటి దీర్ఘకాలిక వ్యాధులను కలిగించడంలో గట్ మైక్రోబయోమ్ కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నేచర్ మైక్రోబయాలజీలో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం.. శిశువు గట్ 10,000 వైరల్ జాతుల బారిన పడుతుందని నిర్ధారించింది. ఇది సగటు పిల్లలలో కనిపించే బ్యాక్టీరియా జాతుల సంఖ్య కంటే 10 రెట్లు ఎక్కువ. మలం లోని బ్యాక్టీరియా పేగుకు సులభంగా వెళుతుంది. ఇది పిల్లల్లో ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
కాండిడా వంటి శిలీంధ్రాలు తేమగా ఉన్న చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. వీటివల్ల వచ్చే దద్దుర్లకు మెడికేటెడ్ అంటే యాంటీ ఫంగల్ క్రీములు అవసరం. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మురికి డైపర్లను పిల్లలకు అలాగే ఉంచడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. మలంలో ఉండే బ్యాక్టీరియా డైపర్ల నుంచి మూత్ర మార్గంలోకి వెళ్లి యూటీఐలకు కారణమవుతుంది. అయితే ఈ యూటీఐల ప్రమాదం ఎక్కువగా అమ్మాయిలకే ఉంటుంది. ఎందుకంటే వారి మూత్రాశయం అబ్బాయిలతో పోలిస్తే చిన్నగా ఉంటుంది.
diaper change
డైపర్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కలిగే ఇతర ప్రమాదాలు
అలెర్జీ
చిన్న పిల్లల చర్మం మృదువుగా, సున్నితంగా ఉంటుంది. కఠినమైన రసాయనం వారి చర్మానికి హాని కలిగిస్తుంది. కొన్ని కంపెనీలు సింథటిక్, రంగులు లేదా ఇతర కఠినమైన రసాయన ఉత్పత్తులను ఉపయోగించి డైపర్లను తయారు చేస్తాయి. ఇవన్నీ శిశువు సున్నితమైన చర్మానికి హాని కలిగిస్తాయి. అలెర్జీలకు కారణమవుతాయి.
diaper
చర్మ దద్దుర్లు
డైపర్లను ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల దద్దుర్లు వస్తాయి. డైపర్ ను ఎక్కువ సేపు మార్చకుండా వదిలేస్తే.. వాటిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అలాగే దద్దుర్లు కూడా వస్తాయి. డైపర్ దద్దుర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి డైపర్లను క్రమం తప్పకుండా మార్చడం అలవాటు చేసుకోండి.
diaper
పైన చెప్పినట్టుగా డైపర్లను రసాయనాలు, సింథటిక్ పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. వీటిని పిల్లలకు ఎక్కువ సేపు వేస్తే డైపర్ ప్లేస్ అపరిశుభ్రంగా మారి ఆ టాక్సిన్స్ శిశువు శరీరంలోకి వెళ్లి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.