MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • ఈ లైంగిక వ్యాధి ఆడ, మగవారి ప్రైవేట్ భాగాల్లో పుండ్లను కలిగిస్తుంది.. దీన్ని ఎలా గుర్తించాలంటే?

ఈ లైంగిక వ్యాధి ఆడ, మగవారి ప్రైవేట్ భాగాల్లో పుండ్లను కలిగిస్తుంది.. దీన్ని ఎలా గుర్తించాలంటే?

జననేంద్రియ హెర్పెస్ వ్యాధి బారిన పడేవారు చాలా మందే ఉంటారు. కానీ దీని గురించి ఎవరికీ చెప్పుకోరు. నిజానికి ఇది లైంగికంగా సంక్రమిస్తుంది. మరి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే?   

Mahesh Rajamoni | Published : May 27 2023, 10:37 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

జననేంద్రియ హెర్పెస్ అనేది లైంగిక సంక్రమణ సంక్రమణ వ్యాధి. ఇది హెర్పెటిక్ పుండ్లకు దారితీస్తుంది. ఇవి విపరీతమైన నొప్పిని కలిగించే బొబ్బలు. ఈ బొబ్బలు ద్రవాలతో నిండి ఉంటాయి. ఇవి పగిలిపోతే  అందులోంచి ద్రవం కారుతుంది.ఈ ఎస్టీఐ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ వల్ల వస్తుంది. ఈ లైంగిక వ్యాధి పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ సెక్స్ సమయంలో చర్మం నుండి చర్మానికి సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది.

26
Asianet Image

జననేంద్రియ హెర్పెస్ సంకేతాలు ఎప్పుడు కనిపిస్తాయి?

సాధారణంగా ఈ వైరస్ సోకిన 4 రోజుల తర్వాత బొబ్బలు కనిపిస్తాయని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అయినప్పటికీ.. ఇది కనిపించడానికి 2 రోజులు లేదా 12 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది. వైరస్ సోకిన కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. లేదా తేలికపాటి లక్షణాలు కనిపించొచ్చు. అయినప్పటికీ లక్షణాల తీవ్రతతో సంబంధం లేకుండా వీళ్లు వైరస్ ను వ్యాప్తి చేయొచ్చు. దీని కొన్ని సాధారణ సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

పురుషాంగం ఉన్నవారికి  కనిపించే సాధారణ లక్షణాలు

36
penis

penis

వీటిలో బొబ్బలు కనిపిస్తాయి: 


పురుషాంగం
వృషణం
పిరుదులు
 పాయువు దగ్గర లేదా చుట్టుపక్కల
 

46
Asianet Image

యోని ఉన్నవారికి కనిపించే సాధారణ లక్షణాలు
వీటిలో బొబ్బలు కనిపిస్తాయి

యోని
పిరుదులు
Anus

56
Asianet Image

ఇతర లక్షణాలు

పైన పేర్కొన్న లక్షణాలతో పాటుగా..హెల్త్ లైన్ ప్రకారం.. జననేంద్రియ హెర్పెస్ ఉన్నవారిలో కనిపించే కొన్ని సంకేతాలు..

నోట్లో, పెదవులు, ముఖం, మరెక్కడైనా బొబ్బలు కనిపిస్తే జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇది జననేంద్రియ హెర్పెస్ కు లక్షణాలు. 
బొబ్బలు కనిపించడానికి ముందు సంక్రమణకు గురైన ప్రాంతంలో దురద పెడుతుంది లేదా జలదరింపు కలుగుతుంది. 
బొబ్బలు పుండ్లు గా మారొచ్చు. వాటి నుంచి ద్రవం కారొచ్చు.
ఇది వ్యాప్తి చెందిన వారం రోజుల్లోపు పుండ్లు మీద క్రస్ట్ కనిపించొచ్చు.
శరీరంలో సంక్రమణ, మంటతో పోరాడే శోషరస గ్రంథులు వాపునకు గురవుతాయి.
వైరల్ ఇన్ఫెక్షన్ తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరానికి కారణం కావొచ్చు.

66
Asianet Image

డాక్టర్ దగ్గరకు ఎప్పుడు వెళ్లాలి? 

జననేంద్రియ హెర్పెస్ లక్షణాలు మీలో కనిపిస్తే  డాక్టర్ దగ్గరకు వెళ్లడం చాలా ముఖ్యం. దీంతో సరైన రోగ నిర్ధారణ చేయొచ్చు. జననేంద్రియ హెర్పెస్ కు చికిత్స లేదు. ఇది సోకిన తర్వాత సంకేతాలు కనిపిస్తాయి. వీటిని ప్రొడ్రోమల్ లక్షణాలు అంటారు. వీటిలో జననేంద్రియ నొప్పి, కాళ్ళు, పిరుదులలో జలదరింపు లేదా నొప్పి ఉండొచ్చు. అయితే మందలు ఈ లక్షణాలను తగ్గిస్తాయి. అలాగే ఇతరులకు సోకే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. కండోమ్లను ఉపయోగించడం జననేంద్రియ హెర్పెస్ సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి సహాయపడుతుంది.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved