ఎప్పుడూ అలసిపోతున్నారా? ఇదే కారణం కావొచ్చు..
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎప్పుడూ అలసిపోతున్నారు. పగలు, రాత్రి అంటూ తేడా లేకుండా అలసటగా ఉంటారు. దీనికి ఎన్నో కారణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

మీరు ఎప్పుడూ అలసిపోతున్నారా? ఉదయం నుంచి రాత్రి వరకు రోజంతా అలసటగా అనిపిస్తోందా? అయితే మీకు కొన్ని సమస్యలు ఉన్నట్టేనంటున్నారు నిపుణులు. స్థిరమైన అలసట ఒక సాధారణ సమస్యే కావొచ్చు. కానీ ఈ అలసట వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. దీనికి అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Fatigue
డీహైడ్రేషన్
శరీరంలో తగినంత నీరు ఉంటే మీకున్న ఆరోగ్య సమస్యలు సగం నయమవుతాయి. చర్మ ఆరోగ్యం నుంచి బరువు తగ్గడం వరకు నీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే మీరు తగినంత నీటిని తాగకపోతే మీ శరీరం నిర్జలీకరణం బారిన పడడుతుంది. ఇది మీలో శక్తి స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల మీరు ఎప్పుడూ అలసిపోయినట్టుగా ఉంటారు.
Fatigue
ఆరోగ్యకరమైన ఆహారం తినకపోవడం
మీరు తినే ఆహారం కూడా మీ ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. తక్కువగా తినడం లేదా ముఖ్యమైన పోషకాలను తక్కువగా తీసుకోవడం, శుద్ధి చేసిన పిండి పదార్థాలు, శుద్ధి చేసిన నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఎక్కువ ఉప్పు లేదా చక్కెర లను తినడం వల్ల మీ శరీరంలో కేలరీలు, పోషక లోపం ఏర్పడుతుంది. ఇది అలసటకు కారణమవుతుంది.
Fatigue
పోషకాహార లోపాలు
పోషకాహార లోపాలు కూడా మిమ్మల్ని ప్రతిరోజూ అలసిపోయేలా చేస్తాయి. విటమిన్ డి, విటమిన్ బి -12, ఇనుము, మెగ్నీషియం లేదా పొటాషియం వంటి పోషకాలు తక్కువగా ఉంటే కూడా మీరు ఎప్పుడూ అలసిపోతారు. ఈ పోషక లోపాలు చాలా సాధారణం. కాబట్టి దీనివల్ల మీరు వివరించలేని అలసటను ఎదుర్కొంటుంటే టెస్టులు చేయించుకోండి.
Fatigue
విశ్రాంతి, నిద్ర రాకపోవడం
మీ మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్రపోవడం చాలా అవసరం. కానీ మనలో చాలా మంది కంటినిండా నిద్రపోవడం లేదు. ఇది కూడా అలసటకు దారితీస్తుంది. నిద్ర మీ శరీరం ముఖ్యమైన హార్మోన్లను విడుదల చేయడానికి, కణాలను మరమ్మత్తు చేయడానికి, పునరుత్పత్తికి ఎంతో సహాయపడుతుంది. నిద్రతో మీ శరీరం తిరిగి శక్తివంతంగా మారుతుంది.
అధిక ఒత్తిడి లేదా అధిక పని
ఒత్తిడికి గురైనప్పుడు మీ శరీరం బాగా అలసిపోతుంది. ఈ ఒత్తిడి కార్టిసాల్, ఆడ్రినలిన్ పెరుగుదలకు కారణమవుతుంది. ఇది మీ శరీరం బాగా అలసిపోయేలా చేస్తుంది. అందుకే ఒత్తిడి తగ్గేందుకు ద్యానం, యోగా చేయండి.