పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి చేయాల్సినవి, చేయకూడనివి ఇవే..!
పీరియడ్స్ సహజ ప్రక్రియే అయినా.. కొంతమంది ఆడవారికి ఇది నరకంలా ఉంటుంది. భరించలేని నొప్పి, ఒంటి నొప్పులు, మూడ్ స్వింగ్స్, ఒత్తిడి, మానసిక సమస్యలు వంటి వాటితో ఎంతో ఇబ్బంది పడతారు. అందుకే ఇలాంటి బాధలేమీ లేనివారు చాలా అదృష్టవంతులని చాలా మంది అంటుంటారు.

Image: Getty Images
పీరియడ్స్ సమయంలో తిమ్మిరి, కడుపు నొప్పి, ఉబ్బరం, మూడ్ స్వింగ్స్ రావడం సహజం. కానీ ఇవి ఎంతో ఇబ్బంది పెడతాయి. రోజు వారి పనులను కూడా చేసుకోనీయవు. అయితే భరించలేని నెలసరి నొప్పి వచ్చే వారు ఈ సమయంలో కొన్ని పనులను చేయాలి. కొన్ని పనులను చేయకూడదు. ఇవి పీరియడ్స్ నొప్పిని కొంతవరకు తగ్గిస్తాయి. అవేంటంటే..
పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి మీరు చేయవలసిన కొన్ని పనులు
ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, సన్నని ప్రోటీన్లను పుష్కలంగా కలిగున్న సమతుల్య ఆహారాన్ని తినండి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి 6 లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినండి. ఎందుకంటే ఇవి తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడతాయి.
హైడ్రేట్ గా ఉండండి: రోజంతా పుష్కలంగా నీటిని తాగండి. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: వాకింగ్, యోగా లేదా స్విమ్మింగ్ వంటి సాధారణ శారీరక శ్రమలో పాల్గొనండి. వ్యాయామం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇవి సహజ నొప్పి నివారణలు. ఇవి పీరియడ్స్ అసౌకర్యాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
హీట్: పొత్తి కడుపు పైన హీట్ ప్యాడ్ లేదా వేడి నీటి బాటిల్ ను పెట్టండి. వేడి కండరాలను సడలించడానికి, తిమ్మిరిని తగ్గించడానికి, నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.
నిద్ర: ఈ సమయంలో మీరు కంటినిండా నిద్రపోండి. ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకుంటే తిమ్మిరి, కడుపు నొప్పి నుంచి కొంతవరకు ఉపశమనం పొందుతారు. ఇది రుతుక్రమ అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
ఓవర్ ది కౌంటర్ నొప్పి నివారణలు: ఇబుప్రోఫెన్ లేదా నాప్రోక్సెన్ వంటి నాన్స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి, మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఏదైనా మందులు తీసుకునే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.
health periods tips
పీరియడ్స్ నొప్పి తగ్గడానికి మీరు చేయకూడని పనులు
కెఫిన్: కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ లో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే కెఫిన్ నొప్పిని పెంచుతుంది. పీరియడ్ లక్షణాలను ఎక్కువ చేస్తుంది.
ఆల్కహాల్ : ఆల్కహాల్ నిర్జలీకరణం, మంటను కలిగిస్తాయి. ఇది పీరియడ్స్ అసౌకర్యాన్ని ఎక్కువ చేస్తుంది. అందుకే పీరియడ్స్ సమయంలో ఆల్కహాల్ ను తాగకండి.
ఉప్పు: ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉంటుంది. ఉబ్బరం సమస్య కూడా వస్తుంది. ఇది రుతుక్రమ అసౌకర్యాన్ని పెంచుతుంది. అందుకే ఈ సమయంలో ఉప్పును తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించండి.
ధూమపానం: స్మోకింగ్ పీరియడ్ లక్షణాలను పెంచుతుంది. స్మోకింగ్ ను మానేయడం లేదా పొగకును ఏ విధంగానూ తీసుకోకపోతే పీరియడ్స్ నొప్పి కొంతవరకు తగ్గిపోతుంది.
భోజనాన్ని స్కిప్ చేయడం: క్రమం తప్పకుండా తినే విధానాలను పాటించండి. భోజనాన్ని స్కిప్ చేయకండి. సమతుల్య ఆహారం మీకు అవసరమైన పోషకాలను, శక్తిని అందిస్తుంది. ఇది మీ మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
periods
ప్రాసెస్ చేసిన, చక్కెర ఆహారాలు: ప్రాసెస్ చేసిన, చక్కెర ఉన్న ఆహారాలు మంట, ఉబ్బరానికి దారితీస్తాయి. ఇది అసౌకర్యాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. దీనికి బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి.