నిద్రలోనూ బరువు తగ్గొచ్చు.. ఇవిగో మార్గాలు..!
కానీ.. మనం శరీరానికి విశ్రాంతి ఇచ్చినప్పటికీ.. లోపలి అవయవాలు, అవయవ వ్యవస్థ లు మాత్రం స్విచ్ ఆఫ్ అవ్వవు. వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. ఆ సమయంలోనూ కేలరీలు కరుగుతూనే ఉంటాయి. దీంతో.. బరవులో తేడా కనిపిస్తుంది.

మీరు గమనించారో లేదో.. రాత్రి పడుకునే ముందు ఒకసారి బరువు చెక్ చేసుకొని.. మళ్లీ.. ఉదయాన్నే లేవగానే మరోసారి బరువు చెక్ చేసుకోండి. మీకే మీ బరువులో తేడా తెలుస్తుంది. రాత్రి చూసుకున్న బరువు కంటే.. ఉదయాన్నే తక్కువ బరువుతో ఉంటారు. దానికి కారణమేంటో తెలుసా..? మీరు నిద్రలోనూ బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఆ బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉండాలి అంటే.. కొన్ని ట్రిక్స్ ఫాలో కావాలట. అవేంటో ఓసారి చూద్దాం..
sleep and diet
నిద్రపోవడం అంటే.. మన శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అని అర్థం. కానీ.. మనం శరీరానికి విశ్రాంతి ఇచ్చినప్పటికీ.. లోపలి అవయవాలు, అవయవ వ్యవస్థ లు మాత్రం స్విచ్ ఆఫ్ అవ్వవు. వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. ఆ సమయంలోనూ కేలరీలు కరుగుతూనే ఉంటాయి. దీంతో.. బరవులో తేడా కనిపిస్తుంది.
fetal position sleep
బరువు తగ్గించడానికి అందరూ ఉదయం పూట మాత్రమే సరైన సమయం అని అనుకుంటూ ఉంటారు. కానీ.. రాత్రిపూట కూడా సులభంగా బరువు తగ్గొచ్చట. బరువు తగ్గించడం అంటే కేవలం కేలరీలు బర్న్ చేయడం కాదు.. శరీరంలోని నీరు తగ్గించడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు. నిద్ర సరిగా లేకపోవడం వల్ల బరువు సులభంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి.. సరైన నిద్రపోవాలి. సరిపడా నిద్రపోయినప్పుడు.. బరువు సులభంగా తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.
sleep
నిద్రను కోల్పోవడం వల్ల మీ ఆకలి హార్మోన్లకు భంగం కలిగిస్తుంది, మీరు జంక్ ఫుడ్ తినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది, ఇది బరువు పెరగడానికి, ఇతర సమస్యలకు దోహదం చేస్తుంది. కేవలం ఒక రాత్రి చెడు నిద్ర మరుసటి రోజు ఉదయం మీ జీవక్రియను నెమ్మదిస్తుంది, మీరు ఖర్చు చేసే శక్తిని 20 శాతం వరకు తగ్గిస్తుంది.
sleeping disorder
కేవలం నిద్రమాత్రమే కాకుండా.. రాత్రిపూట కొన్ని రకాల పనులు చేయడం వల్ల..నిద్రపోయిన తర్వాత కూడా సులభంగా బరువు తగ్గొచ్చు. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
weight loss diet
కేవలం నిద్రమాత్రమే కాకుండా.. రాత్రిపూట కొన్ని రకాల పనులు చేయడం వల్ల..నిద్రపోయిన తర్వాత కూడా సులభంగా బరువు తగ్గొచ్చు. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూ ఉండి ఉంటారు. ఆ సమయంలో కుర్చీకి పరిమితమై ఉంటారు కాబట్టి.. ఆ పని తర్వాత.. వెంటనే వ్యాయామం చేయడం మొదలుపెట్టాలి. వర్క్ తర్వాత డంబెల్స్ ఎత్తడం వల్ల.. జీవక్రియ రేటును దాదాపు 16గంటల వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. సాయంత్రం సమయంలోనూ వ్యాయామం చేయడం ఉత్తమం.
ఇక కాసైన్ ప్రోటీన్ షేక్ తాగాలి. ఈ ప్రోటీన్ షేక్ తాగడం వల్ల తొందరగా ఆకలి వేయదు. కాసైన్ అనేది ఒక డెయిరీ ప్రోడక్ట్. అయితే.. ఇది తొందరగా జీర్ణం కాదు. దీనిని తీసుకోవడం వల్ల .. సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఇక రాత్రిపూట.. వేడి వేడి నీరు కాకుండా.. చల్లని నీటితో స్నానం చేయాలి. ఇలా చన్నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని ఒకరకమైన కొవ్వును కరిగించే అవకాశం ఉంటుంది. రాత్రిపూట స్నానం చేసి.. పడుకోవడం వల్ల మరింత ఎక్కువగా బరువు తగ్గే అవకాశం ఉంటుందట. రాత్రి పడుకునే ముందు మాత్రం వేడి నీటితో కాకుండా చల్లని నీటితో స్నానం చేయడం మంచిదట.
weight loss
అంతేకాకుండా.. గ్రీన్ టీ తాగడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి గ్రీన్ టీ తాగడం వల్ల దాదాపు 3.5 శాతం బరువు రాత్రివేళ తగగ్డానికి సహాయం చేస్తుందట.