వర్షాకాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండే ఫుడ్స్ ఇవి
వర్షాలంలో లేని పోని రోగాలు వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియాతో పాటుగా ఎన్నో రోగాలు చుట్టుకుంటాయి. అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

Monsoons Hair Care
వర్షాకాలం చల్లని వాతావరణాన్ని తేవడమే కాదు ఎన్నో రోగాలను కూడా మూటగట్టుకుని వస్తుంది. ఈ సీజన్ లో జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, డయేరియా, డెంగ్యూ జ్వరం, మలేరియా, చికున్ గున్యా వంటి రోగాలొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
వర్షాకాలంలో నీటిని పుష్కలంగా తాగాలి. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పటికీ మన శరీరానికి తగినంత నీరు చాలా చాలా అవసరం. ఇందుకోసం ప్రతిరోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. వర్షాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తులసి
తులసిలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకున్నా.. రోజూ కొన్ని ఆకలును నమిలినా మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు తొందరగా తగ్గుతాయి.
అల్లం
అల్లంలోని ఔషదాల కారణంగా దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే అల్లం జలుబు, దగ్గు, గొంతునొప్పి మొదలైన వాటిని నివారించడానికి, శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
వెల్లుల్లి
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే వెల్లుల్లి కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబును తొందరగా తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే వానాకాలంలో మీ రోజు వారి ఆహారంలో వెల్లుల్లిని ఖచ్చితంగా చేర్చాలి.
పసుపు
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇదొక బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణం. ఇది శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. పసుపును ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.