మీ పిరుదల ఆకారం చాలు ..మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి..
కూర్చోవడం, నడవడం, నిలబడటం వంటి ఎన్నో పనులకు పిరుదులు ఎంతగానో సహాయపడతాయి. మన దినచర్యలో వీటి పాత్ర ఎక్కువగా ఉంటుంది. అయితే పిరుదులు కుంచించుకుపోవడం లేదా పెద్దగా విస్తరించడం మీ ఆరోగ్యంలో మార్పులను సూచిస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే..

మన శరీర ఆకారం, భంగిమ మన ఆరోగ్యం గురించి చెప్తాయి. మీరు నిలబడే విధానం, కూర్చునే విధానం, ఏ భంగిమలో కూర్చుంటున్నారు .. వంటివన్నీ మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలియజేస్తాయంటున్నారు నిపుణులు. అలాగే మీ పిరుదులు కూడా మీ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తాయట.
అయితే ప్రతి ఒక్కరి పిరుదుల పరిమాణం చాలా భిన్నంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్య స్థితి ఏంటో, మీరు దేనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలో చెబుతుంది. చాలాసార్లు మీ పిరుదులు మీకున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి. కానీ వీటి గురించి తెలియకపోవడం వల్ల వీటిని లైట్ తీసుకుంటారు. అసలు పిరుదులు ఎలా ఉంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కొవ్వు, గుండ్రని పిరుదులు
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబెసిటీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం. ఎక్కువ కొవ్వు కలిగిన, గుండ్రని ఆకారంలో పిరుదులు ఉన్న చాలా మందికి గుండె జబ్బులు, జీవక్రియ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువ. అలాగే ఇది మీ కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యంగా ఉన్నాయని చూపిస్తుంది. మీ పిరుదులు గుండ్రంగా, మెత్తగా ఉంటే.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీకు గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉండదు.
వాపు పిరుదులు
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబెసిటీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మీ పిరుదుల లోపలి భాగంలో వాపుతో కూడిన సిరలు ఉన్నట్టైతే మీ ఆరోగ్యం బాలేదని అర్థం. మలవిసర్జన సమయంలో రక్తం చుక్కలు పడే ప్రమాదం ఉంది. ఇది కాకుండా మీరు ఎక్కువసేపు కూర్చోలేరు. సాధారణంగా ఈ సమస్య బిడ్డ పుట్టిన తర్వాత కనిపిస్తుంది. ఇది కాకుండా మలబద్ధకం సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. మీ శరీరంలో ఫైబర్ లేదని ఇది సూచిస్తుంది. కాబట్టి మీ ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చండి. అలాగే ధాన్యాలు తినండి. పుష్కలంగా నీటిని తాగండి.
చదునైన బట్
బయోఫిజికల్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులు చదునైన, వెడల్పాటి బట్ కలిగి ఉంటారు. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవడం వల్ల హిప్ ఫ్లెక్సర్లు బిగుసుకుపోతాయి. మీ గ్లూట్స్ బలహీనపడతాయి. మీరు డెస్క్ జాబ్ చేస్తుంటే కొద్ది సేపు బ్రేక్ తీసుకుని శరీరాన్ని సాగదీయండి. కావాలనుకుంటే సింగిల్ లెగ్ స్క్వాట్స్ వంటి ఆఫీస్ ఎక్సర్ సైజులు చేయండి. సరైన భంగిమలో కూర్చుంటే ఇలాంటి సమస్య రాదు.
పూప్ పై శ్రద్ధ పెట్టడం ముఖ్యం
ప్రేగు కదలిక మీ అంతర్గత ఆరోగ్యం ఎలా ఉందో చెబుతుంది. మలం రంగు, వాసన, స్థిరత్వం అన్నీ మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి. వీటిలో ఏవైనా మార్పులు ఉంటే అది మీ ఆరోగ్యానికి రెడ్ ఫ్లాగ్ కావొచ్చు. మీ మలం లో మార్పులు వివిధ రకాల సంక్రమణకు సంకేతం కావొచ్చు. వీటితో పాటు డయేరియా, వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ వంటి సమస్యలను ఇది సూచిస్తుంది. అవసరమైతే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. లేకపోతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.