KGF 2 : ఫైట్ ఎగెనెక్ట్స్ 'కేజీఎఫ్' , కొత్త రికార్డ్ కు ఉలికిపాటు ...స్టార్స్ కు పూర్తికాని పీడకల
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ' కేజీఎఫ్ 2' 1000 కోట్ల మార్కును దాటేసింది. త్వరలో 1100 కోట్ల క్లబ్ లోకి చేరడం కూడా ఖాయమేనని అంటున్నారు. అ
kgf2
కన్నడ హీరో యశ్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ''KGF: చాప్టర్ 2'' చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు బాలీవుడ్ బెంబేలెత్తిస్తోంది. కొత్తగా ఈ సినిమా క్రియేట్ చేసిన వసూళ్లుతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
kgf2
ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్ 2' సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తూ సాగిపోతోంది. డ్రాప్ అవుతుందనుకుంటే మూడో వారంలోనూ స్ట్రాంగ్ గా నిలబడింది. గురువారానికి 397.95 కోట్లు సాధించిన ఈ సినిమా.. శుక్రవారంతో 400 కోట్ల మ్యాజికల్ మైల్ స్టోన్ మార్క్ అందుకుని షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో 'దంగల్' (387 కోట్లు) ను అధిగమించి.. 'బాహుబలి 2' (510 కోట్లు) తర్వాతి స్థానంలో నిలిచింది.
ఈ కొత్త రికార్డ్ తో బాలీవుడ్ స్టార్స్ కు కంగారుపుడుతోందని సమాచారం. తాము ఎలాంటి సినిమా చేయాలి..మాస్ లోకి తాము ఎందుకు వెళ్లలేకపోతున్నామో అనే విషయం డిస్కషన్ పెట్టుకున్నారని వినికిడి. సల్మాన్ , అక్షయ్ కుమార్ వంటి సీనియర్ స్టార్స్ , షాహిద్ వంటి యంగ్ హీరోలు సౌత్ రీమేక్ లపై ఆధారపడటమే ఈ స్దితికి తెచ్చిందని భావిస్తున్నారు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమిటనేది చూస్తున్నారు. ఫైట్ ఎగినెక్ట్స్ సౌత్ మూవీస్. కేజీఎఫ్ అని కొందరు బాలీవుడ్ అభిమానులు ట్వీట్స్ సైతం చేస్తున్నారు. తమ హిందీ హీరోలను మాస్ సినిమాలు చేసి ప్రూవ్ చేసుకోమంటున్నారు.
Ram charan about Yash KGF2 film
'కేజీఎఫ్ 2' సినిమా హిందీ వెర్షన్ నార్త్ మార్కెట్ లో 8 రోజుల ఫస్ట్ వీక్ లో ₹ 268.63 కోట్లు.. రెండో వారంలో ₹ 80.18 కోట్లు.. మూడో వారంలో ₹ 50 కోట్లకు పై వసూళ్లతో మొత్తం రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలవటం మాత్రం వారికి పెద్ద పీడకలగా మారిందని చెప్పుకుంటున్నారు.
మరో ప్రక్క భారతీయ సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మక 1000 కోట్ల క్లబ్ లో చేరిన నాలుగో సినిమాగా 'కేజీఎఫ్ 2' నిలిచింది. ‘దంగల్’ - ‘బాహుబలి 2’ - RRR సినిమాలు ఈ మాన్స్టెరస్ బ్లాక్ బస్టర్ కంటే ముందు వరుసలో ఉన్నాయి. కన్నడ పరిశ్రమలో లో వెయ్యి కోట్లు దాటిన ఫస్ట్ మూవీ 'కేజీఎఫ్ 2'. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వసూళ్ళను రాబడుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'. 2018లో విడుదలైన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హిరోయిన్‌గా నటించారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కేజీఎఫ్ 2 పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి.. ఎట్టకేలకు నిన్న (ఏప్రిల్ 14) విడుదలైంది.
రిలీజ్ కు ముందు నుంచీ కేజీఎఫ్-2 సినిమాకు దేశవ్యాప్తంగా హైప్ మామూలుగా లేదు. ఆర్ఆర్ఆర్ కర్ణాటకలో వసూలు చేసినదానికంటే ఎక్కువగా.. కేజీఎఫ్-2 తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేయబోతోందని మొదటి నుంచే లెక్కలు వేస్తున్నారు. ఇక నార్త్ ఇండియాలో ఈ సినిమాకు క్రేజ్ మామూలుగా లేదు. రిలీజ్ వారం ముందు నుంచే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి . రిలీజ్ తర్వాత అయితే చెప్పక్కర్లేదు.
కన్నడ చిత్ర పరిశ్రమకి జాతీయ స్థాయి గుర్తింపుని, పాపులారిటీని, క్రేజ్‌ని తీసుకొచ్చిన చిత్రం `కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్). నాలుగేండ్ల క్రితం విడుదలైన తొలి భాగం(కేజీఎఫ్‌ః ఛాప్టర్ 1` భారీ విజయాన్ని సాధించింది. దానికి రెండో పార్ట్ గా, భారీ అంచనాలతో వచ్చింది `కేజీఎఫ్ 2`. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సంజయ్ దత్, రవీనా టండన్, ప్రకాష్‌రాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించిన రెండో పార్ట్ గురువారం(ఏప్రిల్ 14)న విడుదలైంది. బాక్సాఫీస్‌పై కలెక్షన్ల దండయాత్ర చేస్తుంది.
నార్త్ లోనూ ఎక్కడ చూసినా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ గురించి మాట్లాడుకుంటున్నారు. హిందీ డబ్బింగ్ సినిమా తొలిరోజే సరికొత్త రికార్డు సృష్టించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ‘బాహుబలి 2’ కంటే మొదటి రోజు కలెక్షన్లు భారీగా ఉన్నాయి. సల్మాన్‌ఖాన్, హృతిక్ రోషన్, అమీర్‌ఖాన్ లాంటి బాలీవుడ్ పెద్ద స్టార్ల సినిమాలకు కూడా ‘కెజిఎఫ్ చాప్టర్ 2’కి ఇంత భారీ ఓపెనింగ్స్ రాలేదు. నిజంగానే ‘కెజిఎఫ్ 2’ బాక్సాఫీస్ దద్దరిల్లింది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు కన్నడ సూపర్ స్టార్ యష్ కొత్త పాన్-ఇండియన్ స్టార్స్ అయ్యారు. ఈ చిత్రం తెలంగాణలో అయితే ఐదవ అతిపెద్ద ఆల్ టైమ్ ఓపెనర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. కేజీయఫ్ 2 ఓపెనింగ్ రోజున ఏకంగా రూ.38-39 కోట్ల మేర వసూళ్లు రాబట్టిందని హిందీ మార్కెట్ వర్గాలు అంచనా. ఈ రేంజ్‌లో బాలీవుడ్‌లో ఇప్పటివరకు తొలిరోజు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఏ సినిమా కూడా లేకపోవడంతో, బాలీవుడ్ కా బాప్ రాఖీ భాయ్ అని అంటున్నారు కేజీయఫ్ అభిమానులు.
ఇక ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ మేరకు బాలీవుడ్ టాప్ 10 ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో కేజీయఫ్ 2 చిత్రానికి టాప్ ప్లేస్‌లో స్థానం ఇచ్చాడు. ఇక రెండో ప్లేస్‌లో బాహుబలి 2 చిత్రం నిలిచినట్లు ఆయన లెక్కలతో సహా పేర్కొన్నాడు. ప్రస్తుతం కేజీయఫ్ 2 స్పీడు చూస్తుంటే ఈ సినిమా బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లోనూ దుమ్ములేపే రికార్డ్ లు క్రియేట్ చేయటం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
kgf2
సొంత రాష్ట్రం కర్ణాటకలో ఎలాగూ కేజీఎఫ్-2 వసూళ్ల మోత మోగించడం ఖాయం. దక్షిణాదిలోని తమిళనాడు, కేరళల్లోనూ ఈ చిత్రానికి మంచి హైపే కనిపించడంతో.. కరోనా తర్వాత హిందీ మార్కెట్లో అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించబోయే సినిమాగా కేజీఎఫ్-2 నిలిచి బాలీవుడ్ కు షాక్ ఇచ్చినట్లు ట్రేడ్ పండిట్లు అంటున్నారు.