త్వరలో పెళ్లి పీటలెక్కనున్న `మహానటి`?

First Published 4, Apr 2020, 11:36 AM

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటి కీర్తీ సురేష్. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్‌ అందుకున్న ఈ భామ త్వరలో పెళ్లి పీటలెక్కనుందట. ప్రస్తుతం కెరీర్‌ పరంగా ఫుల్ ఫాంలో ఉన్న ఈ భామ పెళ్లి చేసుకుంటుందన్న వార్తలు రావటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే కీర్తి చేసుకోబోయేది ఎవరిని..? పెళ్లి ఎప్పుడూ? అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

స్టార్ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన కీర్తి సురేష్, పలు మలయాళ చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. తరువాత 2013లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి.

2016లో రిలీజ్ అయిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయం అయిన కీర్తి సురేష్ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

హీరోయిన్‌గా మలయాళ ఇండస్ట్రీలోనే ఎంట్రీ ఇచ్చినా.. తెలుగు, తమిళ భాషల్లోనే స్టార్ ఇమేజ్‌ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తున్నా గ్లామర్ షోకు మాత్రం నో చెప్పింది కీర్తి.

2018లో రిలీజ్‌ అయిన మహానటి సినిమా కీర్తి ఇమేజ్‌ను తారా స్థాయికి తీసుకెళ్లింది. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు నాగ అశ్విన్ దర్శకుడు.

ఈ సినిమాలో అలనాటి తార సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేష్‌ను జాతీయ అవార్డ్ సైతం వరించింది. ఈ సినిమాతో ఆమె సౌత్‌ టాప్‌ స్టార్స్‌ లిస్ట్‌ లో చేరిపోయింది.

ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉంది. కీర్తి నటిస్తున్న రెండు తెలుగు, రెండు తమిళ, ఒక మలయాళ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి.

త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీకి కూడా రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ సినిమా కోసమే కీర్తి సురేష్ బరువు తగ్గినట్టుగా ప్రచారం జరుగుతోంది.

తాజా కీర్తి సురేష్ పెళ్లి వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. త్వరలో ఈ భామ ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడబోతుందట.

ఈ ఏడాది చివర్లో పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కీర్తి పెళ్లి చేసుకోబోయేది ఎవర్ని అన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

loader