బాలయ్య 'డాకూ మహారాజ్' లో అఖండ ఛాయలు?
నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకూ మహారాజ్' చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయకపోయినా, రెండు షేడ్స్ లో కనిపించనున్నారు. 'అఖండ' లోని చైల్డ్ సెంటిమెంట్, కలెక్టర్ పాత్ర వంటి అంశాలు ఈ చిత్రంలోనూ ఉండనున్నాయి.
Balakrishna, Daaku Maharaaj, Akhanda
ఆశ చచ్చిపోయినప్పుడు, నమ్మకానికి చోటు లేనప్పుడు, విధ్వంస శక్తులు విరుచుకుపడినప్పుడు అఖండ వస్తాడు, కాపాడతాడు అంటూ బాలయ్య అఘోరాగా నటించిన మరో పాత్ర అఖండ .బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.'ఒక మాట నువ్వంటే అది శబ్ధం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం'', మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం, బోత్ ఆర్ నాట్ సేమ్' అని అఘోరాగా బాలయ్య గర్జించిన డైలాగులు మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి.
'విధికి, విధాతకు, విశ్వానికి సవాళ్లు విసరకూడదు' , 'అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా? పట్టిసీమ తూమా? పిల్లకాలువ' అని డైలాగ్ లతో ఈ సినిమాలో దుమ్ము రేపారు బాలయ్య. ఆ సినమా ఇప్పటికి, ఎప్పటికి అభిమానులు మర్చిపోలేరు. ఇప్పుడు ఆయన తాజా చిత్రంలో అఖండ యాంగిల్ కనపడనుందని సమాచారం. ఇండస్ట్రీలో వర్గాల నుంచి వినపిస్తున్న ఆ విశేషాలు ఏమిటో చూద్దాం.
Baby accident death
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకూ మహరాజ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 12వ తేదీన ఈ మూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. యాక్షన్ మూవీగా డాకు మహారాజ్ మూవీకి బాబీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అఖండ సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ ని కలిపారని తెలుస్తోంది.
‘అఖండ’ చిత్రంలో బాలయ్య అఘోరా, డిస్ట్రిక్ట్ కలెక్ట్ గా ద్విపాత్రల్లో కనిపిస్తారు. అలాగే ‘అఖండ’లో చైల్డ్ సెంటిమెంట్ హైలెట్ అయ్యింది. ఇప్పుడు డాకూ మహరాజ్ లో రెండు పాత్రల్లో కనపడరు కానీ రెండు షేడ్స్ లో కనిపిస్తారు. ఈ సినిమాలో కీలకమైన ఎపిసోడ్ లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా కనిపించనున్నారు. అలాగే చైల్డ్ సెంటిమెంట్ సినిమాలో హైలెట్ గా కనిపించనుంది. ప్రజ్యా జైశ్వాల్ సైతం ‘అఖండ’ తో పాటు డాకూ మహారాజ్ హీరోయిన్ గా చేయనుంది.
Suriya, venky Atluri, tollywood
జనవరి 2వ తేదీన డాకూ మహారాజ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు నిర్ణయించామని నిర్మాత నాగవంశీ తెలిపారు. ఆంధ్రలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశామని అన్నారు. “హైదరాబాద్‍లో జనవరి 2న ట్రైలర్ అనుకుంటున్నాం. జనవరి 4న అమెరికా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఓ సాంగ్ లాంచ్ చేస్తాం. జనవరి 8న ఆంధ్రలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. విజయవాడ లేదా మంగళగిరిలో ఉండొచ్చు” అని నాగవంశీ వెల్లడించారు.
డాకు మహారాజ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్నాయని నాగవంశీ చెప్పారు. బాలకృష్ణను చివరి 20,30 ఏళ్లలో ఇలాంటి విజువల్స్‌లో చూసి ఉండని అన్నారు. తాను బ్యాక్‍గ్రౌండ్ స్కోర్‌తో పాటు ఈ మూవీ చూశానని, చాలా పెద్ద సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నామని అన్నారు.
డాకు మహరాజ్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా, చాందినీ చౌదరి కీలకపాత్రలు చేశారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీతో పాటు సాయిసౌజన్య ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు.