SSMB29: మహేష్ పాత్రకు మైథలాజికల్ (పురాణ) కనెక్షన్ ? ఎలా అంటే
SSMB29: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB29 సినిమాలోని మహేష్ పాత్ర పేరు ‘రుద్ర’ అనే ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర శివుని 11 రూపాలలో ఒకటిగా, మైథలాజికల్ టచ్‌తో ఉండనుందని సమాచారం. ఇండియానా జోన్స్ తరహాలో పురాణాల మేళవింపుతో ఈ సినిమా ఉండనుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
SSMB29: ఇప్పుడు తెలుగులోనే కాకుండా దేశంలో సినిమాలో అభిమానుల దృష్టి మహేష్ బాబు – రాజమౌళి కాంబోపైనే ఉంది. ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా హాట్ టాపిక్ అయ్యిపోతోంది.
అప్పటికి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఓ చిన్న అప్డేట్ ని కూడా బయిటకు రానివ్వడం లేదు రాజమౌళి. ప్రియాంక చోప్రా కీలకమైన పాత్రలో తీసుకున్నారనే విషయం కూడా సీక్రెట్ గానే ఉంచారు. కాకపోతే.. ఇన్ సైడ్ వర్గాల ద్వారా ఒకొక్క విషయం మీడియాకు లీక్ అయ్యిపోతోంది. తాజాగా ఈ సినిమాలోని మహేష్ పాత్ర గురించిన ఓ హింట్ బయటకు వచ్చింది.
మైథలాజికల్ కనెక్షన్ – ‘రుద్ర’ అనే పేరు
మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరు ‘రుద్ర’ అనే ప్రచారం జరుగుతోంది. ‘రుద్ర’ అనేది శివుని 11 రూపాలలో ఒకటి. శివుడు భయంకరమైన స్వరూపంలో ఉన్నప్పుడే ‘రుద్ర’ అని పిలుస్తారు. ఈ పేరు సినిమాకు మైథలాజికల్ టచ్ తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఇండియానా జోన్స్ + పురాణం కలిపి ఈ కథను ఓ ఎడ్వెంచర్ గా ఈ కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ వండారని తెలుస్తోంది. అయితే, ఇందులో భారతీయ పురాణాల ప్రసక్తి కూడా ఉంటుందని కూడా అంచనా. ఈ క్రమంలో రుద్రభక్తి, శైవతత్వం, శివుని ఆగ్రహం వంటి అంశాలు కథలో భాగమవుతాయా? అనేది ఆసక్తికరంగా మారింది.
Rajamouli, mahesh babu, Priyanka chopra, SSMB29
శివుడు – వినాశనం & ఆదిమ శక్తి
మన హిందూ పురాణాల ప్రకారం శివుడు వినాశనాన్ని సూచించే దేవుడు. ఈ సినిమా కథ కూడా ప్రాచీన రహస్యాలు, నష్టపోయిన సంపదలు, ఓ శక్తివంతమైన విలన్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. మహేష్ బాబు పాత్ర ‘రుద్ర’ అయితే, అతను అపాయాన్ని ఎదుర్కొని ప్రపంచాన్ని కాపాడే యోధుడా? అనే కోణం ఆసక్తికరంగా మారింది.
అలాగే ఓ పురాతన గ్రంథం లేదా శివునికి సంబంధించిన రహస్య మంత్రం చుట్టూ కథ తిరుగుతుందా? లేదా ఓ పురాతన సమాజాన్ని కాపాడే యోధుడిగా మహేష్ బాబు పాత్ర ఉండనుందా? ఈ ప్రశ్నలకు జవాబు సినిమా విడుదలయ్యేంత వరకు తెలియదు. కానీ ‘రుద్ర’ అనే పేరు మాత్రం ఒక మైథలాజికల్ కనెక్షన్ ఇచ్చేలా ఉంది.
మొత్తం మీద ఈ చిత్రం సాహస కథ, పురాణ ఇతిహాసాలు, యాక్షన్ కలిపిన గ్రాండ్ యాడ్వెంచర్ మూవీగా ఉండే ఛాన్స్ ఉంది. రాజమౌళి తన సినిమాల్లో ఎప్పుడూ డీల్ చేయని కొత్త కథా శైలిని అందించబోతున్నట్లు తెలుస్తోంది!
రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకారం, కథలో థ్రిల్‌తో పాటు భావోద్వేగాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇక సినిమా క్లైమాక్స్‌ను ఓపెన్ ఎండ్‌గా ఉంచి, సీక్వెల్‌కు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. అంటే, ఈ చిత్రానికి కొనసాగింపు ఉండే అవకాశం ఉంది.