MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Gossips
  • RRR leak: ఓ పాప చుట్టూనే మొత్తం కథ, ఎన్టీఆర్ ని రామ్ చరణ్ అరెస్ట్ చేసే కారణం,ట్విస్ట్?

RRR leak: ఓ పాప చుట్టూనే మొత్తం కథ, ఎన్టీఆర్ ని రామ్ చరణ్ అరెస్ట్ చేసే కారణం,ట్విస్ట్?

 రెండు ప్రాంతాలు, నేపధ్యాలు కలిగిన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజులు ఎలా కలిశారు, అది ఎలా సాధ్యం అయ్యిందనే సందేహాలు అందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి.

4 Min read
Surya Prakash | Asianet News
Published : Mar 24 2022, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112


రాజమౌళి  ఓ  సినిమా తీస్తున్నారంటే టాలీవుడ్ మాత్రమే కాదు జాతీయ సినిమా మొత్తం అటువేపే ఇంట్రస్ట్ గా చూస్తుంది. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలతో చేసిన సినిమా..అదీ కొద్ది గంటల్లో రిలీజ్ అంటే ఏ రేజంలో ఆసక్తి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ సినిమా విశేషాలు ఏమైనా తెలుస్తాయేమో అని చెవులు.. కళ్ళూ అటువైపు పడేసి ఉంచుతున్నారు ఫ్యాన్స్. మీడియా అయితే, రాజమౌళి సినిమా విశేషాల కోసం విపరీతమైన ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ గురించి ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇంట్రస్టింగ్ గా ఉన్న ఈ  కథను ..రేపు రిలీజ్ అయ్యే సినిమాలో ఉందో లేదో పరిశీలించండి.

 

212


ప్రస్తుతం రాజమౌళి డైరక్ట్ చేసిన టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్. జూనియర్ ఎన్టీఅర్, రామ్ చరణ్ హీరోలుగా పీరియాడికల్ ఫిక్షన్ సినిమా తెరకెక్కించారు. ఇప్పుడు అందరి దృష్టీ ఆ సినిమా పైనే. ఇటు రాం చరణ్ అభిమానులు.. అటు ఎన్టీఅర్ అభిమానులు ఒక్క్కో అప్డేట్ కోసం నిత్యం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అవుట్ లైన్ రాజమౌళి రివీల్ చేశారు. హీరోల పాత్రల తీరుతెన్నులూ ఇలా ఉండొచ్చని హింట్ కూడా ఇచ్చేశారు.

312


ఎన్టీఅర్ తెలంగాణా యోధుడు కొమరం భీమ్ గా, రాం చరణ్ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గాను కనిపిస్తారని వెల్లడించారు. 1920 ప్రాంతంలో ఇద్దరు వీరులు కొమరం భీమ, అల్లూరి సీతారామరాజు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే కోణం లో సినిమా ఉంటుందని చెప్పేసారు దర్శకుడు రాజమౌళి .

412

ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడే కథేమిటంటే.. ఆదివాసీల హక్కుల కోసం నిజాం సైన్యంతో పోరాడిన గోండు బెబ్బులి కుమురంభీం. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు బ్రిటీష్ వాళ్లు భారతదేశాన్ని ఏలుతూంటారు. అప్పుడు తమ తండాకు వచ్చిన బ్రిటీష్ గవర్నర్..అక్కడ ఉన్న గిరిజిన చిన్న పిల్ల ఆటా ,పాటా చూసి మురుస్తాడు. ఆ పాపను తమ భవంతిలో ఉంటే బాగుంటుందని తీసుకెళ్లిపోతారు. ఎందరు ఎంత చెప్పినా, ఏడ్చినా,కాళ్లావేళ్లా పడినా  ఆ బ్రిటీష్ అధికారి వినడు. ఆ సమయంలో కొమరం భీమ్ అక్కడ ఉండడు.

512


బయిటకు వెళ్లి తన తండాకు తిరిగి వచ్చాక విషయం తెలుసుకున్న కొమరం భీమ్ ..చాలా బాధపడతాడు. ఆ పాపను బ్రిటీష్ వారి నుంచి తను తీసుకువస్తాను అంటాడు.ఎప్పుడూ అడవి దాటి వెళ్లని కొమరం భీమ్ తొలిసారిగా డిల్లీకి వస్తాడు. అక్కడ పాప కోసం వెతకటం మొదలెడతాడు. ఆ క్రమంలో బ్రిటీష్ వాళ్లపై దాడి చేస్తాడు. కానీ ఆ పాప దొరకదు. అయినా సరే పట్టుదలతో ఆ పాప కోసం వెతుకుతూనే ఉంటాడు.

612


మరో ప్రక్క అల్లూరి సీతారామరాజు..స్వాతంత్ర్య సమరంలో పాల్గొనటానికి ముందు డిల్లీ వస్తాడు. వచ్చి బ్రిటీష్ పోలీస్ డిపార్టమెంట్ లో ఉద్యోగిగా జాయిన్ అవుతాడు. అతనికి కొమరం భీమ్ ని పట్టుుకనే పని అప్పచెప్తారు అతని పై అధికారులు. దాంతో సీతారామరాజు రకరకాల ప్రయత్నాలు చేసి చివరకు ఎన్టీఆర్ ని పట్టుకోగలుగుతాడు.అదే ఇంట్రవెల్ ఎపిసోడ్. అయితే దొరికినట్లే దొరికి సీతారామరాజు తప్పించుకుంటాడు.

712

వీళ్లదరినీ ఒకరు గమనిస్తాడు. అతనే అజయ్ దేవగన్. అతను ఓ స్వతంత్ర్య సమరయోధుడు. ఇలా భారతీయులు వాళ్ల చేత్తోతో వారి కన్ను  పొడిచేలే చేస్తున్నాడని అర్దం చేసుకుని వీళ్లద్దరిని కలిపేలా చేస్తాడు. ఇద్దరికి స్వతంత్ర్యం గొప్పతనం తెలియచేస్తాడు. పోరాటం చెయ్యాల్సిన సమయం వచ్చిందని చెప్తాడు.రియలైజ్ అయిన రామారాజు ...కొమరం భీమ్ తో స్నేహం చేస్తాడు.

812

కొమరం భీమ్, రామరాజు కలిసి ముందు ఆ గిరిజిన తండా పాపను బ్రిటిష్ వారి నుంచి బయిటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో బ్రిటీష్ వారిపై యుద్దం ప్రకటించటం. బ్రిటీష్ వారు వీళ్లద్దరినీ శత్రువులుగా ప్రకటించటం జరుగుతుంది. అక్కడి నుంచి క్లైమాక్స్ దాకా జరిగే పరిణామాలే ఈ సినిమా కథ. ఈ కథలో కేటలిస్ట్ పాత్ర ఆ పాప. ఆమే భారత మాత అన్నట్లు ఇండైరక్ట్ గా ఉంటుంది.

 

912


ఇదే నిజమైతే మొత్తమ్మీద ఆర్ ఆర్ ఆర్ మూవీ స్టొరీ లైనే ఒక అద్భుతంలా కనిపిస్తోంది. మామూలు ఫిక్షన్ నే ఒక రేంజిలో చూపించి ఆడియెన్స్ కి కొత్త అనుభూతులు పంచీ, రాజమౌలి ఇలాంటి అద్భుతమైన లైన్ ఇద్దరు సూపర్ హీరోలతో తీసిన సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో ఊహించడం కష్టమే!

1012

అలాగే ఈ కథ గురించి రాజమౌళి చెప్తూ...ఆర్ ఆర్ ఆర్ అనేది ఓ ఫిక్షనల్ స్టోరీ.. వాస్తవంగా చరిత్రలో భీమ్, అల్లూరి కలిసింది లేదు. ఐతే ఉద్యమ వీరులైన ఈ ఇద్దరి జీవితాలలో కొన్ని సారూప్యతలు ఉన్నాయి. వీరిద్దరూ టీనేజ్ లో ఇంటి నుండి పారిపోవడం జరిగింది. అలాగే ఇద్దరు బ్రిటిష్ వారిపై, నవాబులపై యుద్ధం సాగించడం జరిగింది. కాబట్టి వారి జీవితంలో జరిగిన పోలికలను తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి అల్లిన కథే ఆర్ ఆర్ ఆర్. ఇద్దరు మిత్రులు 1920లో ఎలా ఉద్యమం సాగించారు అనేది ప్రధానంగా సాగుతుంది అని కథలోని అసలు మెలిక చెప్పేశాడు.

1112

రాజమౌళి కథలో హీరోలు ఇద్దరి క్యారక్టర్స్  గురించి మాట్లాడుతూ...బాహుబలి'లో బాహుబాలి - శివగామి .. ఈ రెండు పాత్రలు మంచివే. అయితే ఒకానొక సందర్భంలో ఈ రెండు పాత్రల మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అయితే ఆ సినిమాలో అది కొంతసేపు మాత్రమే చూపించాము. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విషయంలో మాత్రం కథ అంతా కూడా అలాంటి ఆర్గ్యుమెంట్ నడుస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో హీరోలు .. విలన్లు అని కాకుండా కథను బట్టి .. తమ సిద్ధాంతాలను బట్టి పాత్రలు నడుస్తుంటాయి అని రాజమోళి చెప్పారు.

 

1212

సినిమాలో చరణ్‌, తారక్‌ ప్రాణ స్నేహితులుగా కనిపిస్తారట. కానీ వారిద్దరి ఐడియాలజీ వేరని చెప్పారు. సినిమా ప్రారంభంలోనే వీరిద్దరు ఆలోచనలు పూర్తి భిన్నమైనవని తెలుస్తుందని, ఆ ఉత్తర, దక్షిన ధృవాల మధ్య ఎక్కడో ఒక్క చోట గొడవ వస్తుందని, ఆడియెన్స్ గొడవ పడకుండా ఉంటే బాగుండు అని ఫీలవుతుంటారు. కానీ ఇద్దరి మధ్య భీకరమైనపోరు జరుగుతుందని చెప్పారు. ఇద్దరూ సింహాల్లా ఫైట్‌ చేసుకుంటారని, ఇది చూసినప్పుడు తనకు ఏడుపొచ్చిందని చెప్పారు. తనలాగే థియేటర్‌లో ఆడియెన్స్ కూడా ఫీల్‌ అవుతారని తెలిపారు. 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఐ బొమ్మ క్లోజ్ అవ్వడంతో సినిమా కలెక్షన్లు పెరిగాయా? స్టార్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Recommended image2
బాలయ్య సినిమా కోసం బోయపాటి భారీ రెమ్యునరేషన్, అఖండ 2 కోసం ఎంత తీసుకున్నాడంటే?
Recommended image3
Telugu Cinema News Live : స్క్రిప్ట్ ఉంటే చాలు సినిమా పూర్తవుతుంది..మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా దిల్ రాజు ఏఐ స్టూడియో ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved