మరో సినిమా కమిటైన ప్రభాస్, జనవరిలో ఎనౌన్స్ మెంట్
‘హను-మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ త్వరలో ప్రభాస్‌ని డైరెక్ట్ చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరియు జనవరి 2025లో ప్రకటన వెలువడుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది.
Actor Prabhas starrer upcoming film update out
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి, సలార్,కల్కి వంటి సినిమాలతో ప్రభాస్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 170 కోట్ల నష్టాలు మిగల్చగా, ‘ఆదిపురుష్’ ఏకంగా రూ. 225 కోట్ల నష్టాలు మూటగట్టుకుంది.
అయితే, రీసెంట్ గా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2, సలార్ 2, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో వరస ప్రాజెక్టులు సైన్ చేస్తూ దూసుకుపోతున్నాడు.
తాజాగా ప్రభాస్ మరో ప్రాజెక్టుని ఓకే చేసినట్లు సమాచారం. ఇప్పటికే డైరక్టర్ మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ప్రభాస్, అదే సమయంలో మరో డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. అలాగే వీటితో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ సినిమా కూడా లైన్‌లో ఉంది. ఇదిలా ఉండగా ప్రభాస్ సినిమాకి సంబంధించిన కొత్త ప్రకటన జనవరిలో రానుందని సమాచారం.
‘హను-మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ త్వరలో ప్రభాస్‌ని డైరెక్ట్ చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరియు జనవరి 2025లో ప్రకటన వెలువడుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది.
వాస్తవానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ, రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అయ్యింది. దీంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ మూవీని ప్రభాస్‌తో చేసేందుకు సిద్ధమవుతున్నాడట. అందుతున్న సమాచారం మేరకు ప్రశాంత్ వర్మ పూర్తిగా ప్రభాస్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు.
ఈ సినిమా కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కానుందని వినికిడి. అన్నీ సవ్యంగా జరిగితే, 2025 చివరిలోపు ప్రభాస్ మరియు ప్రశాంత్ వర్మ సినిమా షూట్ ప్రారంభమవుతుంది. ప్రభాస్ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌లో చేరడానికి ముందే ఫౌజీ షూటింగ్‌ను పూర్తి చేస్తాడు. హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్‌తో మూడు సినిమాల ఎగ్రిమెంట్ లో భాగంగా ప్రశాంత్ వర్మ చిత్రం చేయబోతున్నారు.
prabhas sandeep reddy vanga movie spirit
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను సందీప్ పూర్తి చేయగా.. రీసెంట్ గా మ్యూజిక్ సిట్టింగ్స్ ను స్టార్ట్ చేశారు. అందుకు సంబంధించిన పిక్స్ ను సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ షేర్ చేశారు. 2025 జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు రీసెంట్ గా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 2026 ప్రారంభంలో మూవీ విడుదల చేస్తామని టీ సిరీస్ అధినేత ఇటీవల తెలిపారు. స్పిరిట్ మూవీని ప్రణయ్ వంగాతో కలిసి భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.