MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Gossips
  • Samantha:'ఊహూ అంటావా మావా' చైతు పై సమంతకు కసి అంత ఉందా?

Samantha:'ఊహూ అంటావా మావా' చైతు పై సమంతకు కసి అంత ఉందా?

సమంత-నాగ చైతన్య విడాకులు ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వీరి విడాకులకు గల కారణాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఇందులో ఎక్కువగా సమంత తప్పే ఉందని మొదట్లో అందరు ఆమెను నిందించారు.  బాలీవుడ్‌ పాపులర్‌ షో కాఫీ విత్‌ కరణ్‌ల హీరో అక్షయ్‌ కుమార్‌తో కలిసి సమంత సందడి చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఈ ప్రస్దావన వచ్చింది. అయితే ఆమె మాటల్లో ఇంకా చైతూపై కోపం ఉందని అంటున్నారు. అవేంటో చూద్దాం.

4 Min read
Surya Prakash
Published : Jul 25 2022, 02:50 PM IST| Updated : Jul 25 2022, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113


సోషల్ మీడియా రోజులివి ఇవి. ప్రతి విషయం హాట్ టాపిక్ గా మారిపోతోంది. ముఖ్యంగా సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూండటం, వారి వ్యక్తిగత జీవితాలను సైతం విశ్లేషిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఆ క్రమంలో సమంత, నాగచైతన్యల విడాకులు, ఆ తర్వాత వారి జీవితాలు ఇప్పటికి సోషల్ మీడియాలో చర్చనీయాంశాలుగానే ఉన్నాయి. ఇద్దరు యంగ్ కపుల్ కావటం, ఇద్దరూ క్రేజ్ ఉన్నవారు కావటంతో వారి ప్రతీ విషయాన్ని బూతద్దంలోంచి చూస్తున్నారు.  


తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ 7వ సీజన్‌లో సామ్‌ మాట్లాడిన మాటలను ఆమె వ్యక్తిగత జీవితంకు ముడివేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఎక్స్ హజ్బెండ్ నాగచైతన్య మ్యాటర్ తో కలిపి. అదే సమయంలో ఆమె సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ ని సైతం ప్రస్దావనకొస్తోంది. అవేంటో, ఎంతవరకూ సమంజసమో చూద్దాం..

213


పుష్ప ఎన్నో రికార్డులను తిరగరాస్తూ బాలీవుడ్‌ను షేక్‌ చేసిందీ మూవీ. సినిమానే కాదు పాటలు కూడా ప్రజలను ఓ ఊపు ఊపాయి. మరీ ముఖ్యంగా అందులో ఊ అంటావా మావా పాటకు సామాన్యులే కాదు బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా ఫిదా అయ్యారు. మొట్టమొదటిసారిగా ఐటం సాంగ్‌లో నటించిన సమంతకు ఎనలేని ప్రశంసలు దక్కాయి. తాజాగా సామ్‌ మరోసారి ఊ అంటావా సాంగ్‌కు స్టెప్పులేసింది. ఆ పాట గురించి  కాఫీ విత్‌ కరణ్‌ 7వ సీజన్‌లో మాట్లాడింది.
 

313


ముఖ్యంగా మగవాళ్ల వంకర బుద్ధి మీద సెటైర్ వేసేలా ఉన్న ఈ సాంగ్ లిరిక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అక్కినేని నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత నటించిన సాంగ్ కావడంతో ఆ లిరిక్స్ ను ఆమె వ్యక్తిగత జీవితానికి లింక్ చేస్తూ అనేక కథనాలు వచ్చాయి.  లేటెస్టుగా అసలు 'ఊ అంటావా' పాట చేయడం వెనకున్న అసలు ఉద్దేశ్యం ఏంటనేది సామ్ వెల్లడించింది.

413


  'ఊ అంటావా' పాటలో సమంతా హాట్ హాట్ గా కనిపించడం గురించి ప్రస్తావించిన కరణ్.. ఆమె పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకున్నారు. ఆ పాట చేయడానికి కారణమేమిటని సామ్ ని అడగ్గా... సమంత బదులిస్తూ సాంగ్ ట్యూన్ తనకు నచ్చిందని.. అది మగవారి చూపులపై సెటైర్ అని తెలిపింది. పురుషుడి చూపుపై వ్యంగ్యాస్త్రాలు సంధించే ఐటెం నంబర్ చేసినందుకు తనపై విమర్శలు కూడా వచ్చాయని చెప్పింది.

513


మగవారు అందరి గురించి అని సమంత అన్నా ..ఆమె ఉద్దేశ్యం..నాగచైతన్యే అంటున్నారు. పాట చేసేటప్పుడు సంగతేమో కానీ ఇప్పుడు ఆమె మాటల్లో అర్దమైంది మాత్రం చైతపై కోపం, కసి అని సోషల్ మీడియా జనం అర్దాలు లాంటి పెడర్దాలు తీస్తున్నారు.

613


"నిజానికి ఈ పాట మగ చూపులపై సెటైర్ గా ఉంటుంది. అది మగవారి చూపులపైకి వస్తుందికాబట్టి చాలా విమర్శలు ట్రోలింగ్ వచ్చింది. కానీ నాచ్ గర్ల్ గా చేస్తున్న నా లాంటి పెద్ద స్టార్ కాకపోతే మగ చూపులపై ఇంకెవరు సెటైర్ వేయగలరు?" అని సమంత చెప్పింది. "ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో రాజి పాత్ర ఒక కారణం కోసం శారీరక పోరాటంలో పాల్గొంటుంది. ఇక్కడ 'ఊ అంటావా' ఒక స్టేట్మెంట్ ఇస్తుంది" అని చెప్పుకొచ్చింది. అయితే ఆ స్టేట్మెంట్ ఎవరికు చైతూ కే కదా అంటున్నారు.

713


చైతుతో విడిపోయినా ఆమె కోపంతో ఉందని , అది ఆమె మాటల్లో వ్యక్తమవుతోందని విశ్లేషణలు చేస్తున్నారు. డైరక్ట్ గా కాకుండా ఆమె ఇలా ఇండైరక్ట్ గా చైతుకు కౌంటర్స్ ఇస్తోందని చెప్తున్నారు. అయితే అవి సమంత అభిమానులు మాత్రం ఒప్పుకోవటం లేదు. ఓ వేదికగా  ఆమె మాట్లాడిన మాటలను ఇలా వక్రీకరించటం తగదు అంటున్నారు.

813


ఇక షోలో ....''ఈ పాటలో నువ్వు చంపేసావ్. ఎంత చేయాలో అంతా చేశావ్. ఇది తిరుగుబాటు చర్యనా? వ్యూహాత్మక ఎత్తుగడనా లేదా "F*ck నేను చేస్తాను" అని మీరు భావించినందున చేసిన పాటనా?'' అని కరణ్ ప్రశ్నించగా.. సామ్ వెంటనే ''థర్డ్ ఆప్షన్. F*ck.. నేను చేస్తాను" అని బదులిచ్చింది. అయితే సమంత ..మనస్సులో అది ఇది తిరుగుబాటు చర్యగానే ఆమె భావించి చేసిందంటున్నారు. అందుకు ఆమె వేసిన స్టెప్స్ ఉదాహణ అంటున్నారు. 

913


"స్టేటమెంట్ ఇస్తున్నా.. లేదా ప్రపంచానికి నీ మిడిల్ ఫింగర్ చూపిస్తున్నా.. నువ్వు ఈ పాటలో చాలా హాట్ గా ఉన్నావ్" అని కరణ్ జోహార్ అన్నారు. ఇప్పుడు KwK షోలో సామ్ స్టేట్మెంట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం గురించి ఓ బాలీవుడ్ మీడియా రాసిన ఆర్టికల్ ను సామ్ ట్విట్టర్ లో షేర్ చేయడం గమనార్హం. అదే సమంత అంతర్గత ఆలోచనగా చెప్తున్నారు. ఇదంతా నాగచైతన్య కూడా గమనిస్తున్నాడనే విషయం ఆమెకు తెలుసు అంటున్నారు.

1013


వాస్తవానికి  సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఒక ఐటమ్ సాంగ్ చేయడమేంటని అభిమానులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందులోనూ విడాకుల ప్రకటన తర్వాత కమిటైన ప్రాజెక్ట్ కావడంతో అందరి దృష్టి పడింది. సాంగ్ రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మగబుద్ది వంకర అంటూ లిరిక్స్ రాసిన చంద్రబోస్ ను.. అందులో నటించిన సామ్ ను విపరీతంగా ట్రోల్ చేశారు. కొందరు మహిళలు పాలాభిషేకాలు కూడా చేసారు. అయితే సమంత 'ఊ అంటావా' పాట చేయడానికి ముందు చాలానే ఆలోచించినట్లు ఆమె తాజా స్టేటమెంట్ ని బట్టి అర్థం అవుతోంది.

1113


 సమంత తన ఎపిసోడ్‌లో   కరణ్‌ జోహార్‌ను ఉద్దేశించి.. 'ఎంతోమంది వివాహబంధాలు బాధాకరంగా ఉండటానికి మీరే కారణం' అని సామ్‌ అనగానే 'నేనేం చేశాను' అని కరణ్‌ అడగ్గా.. 'పెళ్లి చేసుకుంటే జీవితం కబీ ఖుషి కబీ ఘమ్‌ (K3G) సినిమాలా ఉంటుందని స్క్రీన్‌పై చూపించారు. కానీ నిజ జీవితంలో మాత్రం అది KGF మూవీలా ఉంటుంది' అని సమంత తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

1213

 
 హోస్ట్‌ కరణ్‌ జోహార్‌ తనని వ్యక్తిగతమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టను అంటూనే విడాకులపై ప్రశ్నించాడు. దీనికి సామ్‌ ‘మా విడాకులు అంత సామరస్యంగా జరగలేదు. డైవర్స్‌ తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. విడాకులు తీసుకున్న కొత్తలో చాలా బాధపడ్డాను. జీవితం చాలా కఠినంగా అనిపించింది. కానీ ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాను. మునుపటి కంటే ఇప్పుడే మరింత బలంగా మారాను. ప్రస్తుతం నా పని నేను చేసుకుంటున్నాను. అయితే విడాకుల తర్వాత ఇద్దరం ఒకరిపై ఒకరం తీవ్ర మనోవేదనకు గురయ్యాం’ అంటూ సమాధానం ఇచ్చింది. 

1313
Samantha Naga Chaitanya

Samantha Naga Chaitanya

 హోస్ట్‌ చైను భర్తగా సంభోదించగా.. వెంటనే అడ్డుపడిన సమంత.. భర్త కాదు.. మాజీ భర్త అని పిలవండి అని చురకలంటించింది. అలా సమంత ఓపెన్‌ అయిందో లేదో ఇటు నాగచైతన్య కూడా తన జీవితం ఎలా సాగుతుందనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'ఒక వ్యక్తిగా నేను చాలా మారాను. గతంలో ఇంత ఓపెన్‌గా ఉండేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఏదైనా మాట్లాడగలుగుతున్నాను. నా కుటుంబం, ఫ్రెండ్స్‌తో అనుబంధం ఇంకా పెరిగినట్లు అనిపిస్తోంది. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని పేర్కొన్నాడు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
Recommended image2
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
Recommended image3
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved