#NTR:జూ.ఎన్టీఆర్ పై కేసీఆర్ ఆగ్రహం? కావాలనే ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్? నిజం ఎంత
అమిత్ షాతో తారక్ భేటీని జీర్ణించుకోలేని టీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని రద్దు చేయించే విధంగా పోలీసుల చేత అనుమతి రద్దు చేయించి ఉంటారని టాక్ వినిపిస్తోంది.
ntr, kcr
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో దీన్ని ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదల చేయనున్న సంగతి తెలసిందే. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయడానికి నిర్మాణ సంస్థలు స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ఫ్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ భారీగా సన్నాహాలు చేస్తున్నాయి.
దక్షిణాది భాషలకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్మాతలు జరపాలనుకున్నారు. దీనికి యంగ్ టైగర్ ఎన్టీయార్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్టుగానూ ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో పర్మిషన్ లేని కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిల్మ్ సిటీ దగ్గర నుండి నగరంలోని పార్క్ హయిత్ స్టార్ హోటల్ కు మార్చారు.
కొద్దిసేపట్లో కార్యక్రమం స్టార్ట్ అవ్వాల్సి ఉందనగా.. కొన్ని అనుకోని కారణాల రీత్యా ప్రోగ్రాం రద్దయిందని మూవీ యూనిట్ ప్రకటించింది. ఆ స్థానంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఇక బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహణ కోసం ఎప్పటిలాగే చిత్ర నిర్మాతలు పోలీసుల అనుమతి తీసుకున్నారని.. కానీ చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించడం వల్లే ఈ ఈవెంట్ రద్దయిందని మీడియా వర్గాలు చెబుతున్నాయి.
కానీ అందులో నిజం లేదంటున్నారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ముందుగానే పోలీసుల అనుమతి తీసుకొన్న తర్వాతే అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు అని..ఇంత పెద్ద ఈవెంట్ కు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని కొందరు చెప్తున్నారు. భద్రత వంకతో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని రద్దు చేసుకోమని పోలీస్ శాఖ కోరిందంటే నమ్మశక్యంగా లేదని జూ.ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కేవలం ఈ కార్యక్రమానికి తమ అభిమాన హీరో జూ.ఎన్టీఆర్‌ను ముఖ్య అతిధిగా ఆహ్వానించినందునే, ఈ వంకతో అనుమతి నిరాకరించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఇటీవల అమిత్ అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు జూ.ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా హైలైట్ అయ్యింది.
బిజెపి తరపున ఎన్నికలలో ప్రచారం చేయాలని కోరేందుకే అమిత్ షా జూ.ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారనే ఊహాగానాలు వినిపించాయి. తెలంగాణ సిఎం కేసీఆర్ బిజెపిని, మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కనుక అమిత్ షాతో భేటీ అయినందుకు జూ.ఎన్టీఆర్‌పై కోపంతో ఉన్నారని అందుకే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ఈ వంకతో అనుమతించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే మరో ప్రక్క ఇంకో వెర్షన్ వినిపిస్తోంది ...ఫిల్మ్ సిటీ వెలుపల ఖాళీ స్థలంలో అభిమానుల మధ్య ‘బ్రహ్మాస్త్రం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు. అయితే అక్కడ ఉన్న సదుపాయాలు, అభిమానులను కట్టడి చేసే విషయంలోనూ పోలీసులకు, ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియాకు మధ్య నగదు లావాదేవీలలో తేడా రావడంతో పోలీసులు అనుమతి నిరాకరించినట్టు చెప్తున్నారు.
ntr, Brahmastra
అలాగే అప్పటిదాకా ఓకే చేసినా... పోలీసులు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించారు. అనధికారంగా అందిన సమాచారం మేరకు రాత్రి ఎల్.బి.నగర్ లో వినాయకుని మండపం వద్ద జరిగిన ఓ రగడ వలన పోలీసులు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం. చివరి నిమిషం వరకూ ఈవెంట్ సంస్థ ట్రై చేసినా కుదరలేదట. ఇక దీంతో ఈ వేడుకను పార్క్ హయత్ కు మార్చారని మరికొందరు చెప్తున్నారు.
బ్రహ్మాస్త్ర ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న జూ.ఎన్టీఆర్ చాలా ఆచితూచి మాట్లాడారు. “మన భద్రత కోసమే పోలీసులు పనిచేస్తుంటారు. కనుక వారికి మనం సహకరించడం అవసరం,” అని క్లుప్తంగా చెప్పారు.
ఇక లాస్ట్ మినిట్ లో ఇలా ఈవెంట్ కాన్సిల్ చేయటం వలన బ్రహ్మాస్త్ర టీమ్ కు 2.25 కోట్లు వరకూ నష్టం వచ్చినట్లు మీడియా వర్గాల ద్వారా వినిపిస్తోంది. అలాగే పార్క్ హయిత్ లో అప్పటికప్పుడు ఏర్పాటు చేయటంతో మరో పది లక్షలు దాకా ఖర్చు అయ్యినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా బాలీవుడ్ హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి. మూవీ షూటింగ్ పూర్తవ్వగానే స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ (Karan Johar) ఎస్ఎస్ రాజమౌళికి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు స్పెషల్ గా చూపించారంట. కథలో ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందా? అని కరణ్ జోహార్ అడగ్గా.. జక్కన్న కొన్ని ఛేంజేస్ చెప్పారంట. ఆ వెంటనే ఆ సీన్లను రీషూట్ కూడా చేయించారంట దర్శకనిర్మాతలు.