' పుష్ప – 2' తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కండీషన్..ఆలోచనలో పడ్డ నిర్మాతలు?
'పుష్ప 2' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ సినిమా మీద బీభత్సమైన హైప్ ఉంది.
Pushpa 2
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం అభిమానుల్లోనే కాకుండా మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమా బిజినెస్ రికార్డులు బ్రేక్ చేస్తుంది అందరూ ఊహించే విషయమే. పుష్ప మూవీ కంటే రెండితలు బిజినెస్‌ను రాబట్టాలి. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి జరుగుతున్న బిజినెస్ మాత్రం ట్రేడ్ వర్గాలకు కంగారు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా బిజినెస్ వివరాల్లోకి వెళితే..
ఈ సినిమాకు రెమ్యనరేషన్ లు పెరగటంతో బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయిందని తెలుస్తోంది. దాంతో నిర్మాతలు తెలుగు థియేటర్ రైట్స్ కు భారీ రైట్స్ చెప్పటం సహజం. అయితే డిస్ట్రిబ్యూటర్స్ ఆ స్దాయి రేట్లను అందుకోలేమని చేతులెత్తేస్తున్నారని ట్రేడ్ లో వినపడుతోంది. నాన్ రిఫండబుల్ రైట్స్ ని భారీ మొత్తం ఇచ్చి తీసుకోవటానికి ఆసక్తి చూపటం లేదని, అడ్వాన్స్ ఇచ్చి సినిమా తీసుకుంటామని చెప్తున్నారట.
Pushpa 2 Update
ఫస్ట్ పార్ట్ లో తాము భారీ ఎమౌంట్ లకు తీసుకున్నామని అయితే కొన్ని ఏరియాల్లోనే లాభాలు కనపడ్డాయని వారి వాదన. సినిమా ఎంత బాగా ఆడినా ఎక్కువ రేట్లు పెడితే రికవరీ అవ్వదని అంటున్నారట. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో థియేటర్ రేట్లు, స్పెషల్ షో ఫర్మిషన్స్ సమస్యలు కావటం, ఎగస్ట్రా షోలకు ఫర్మిషన్స్ అంత ఈజీగా దొరక్కపోవటం వంటి విషయాలు వారు ప్రస్దావిస్తున్నారట.
కానీ మైత్రీ వారు మాత్రం సినిమా అద్బుతంగా వచ్చిందని NRA బేసిస్ లో సినిమా తీసుకోమని డిస్ట్రిబ్యూటర్స్ తో బేరాలు కొనసాగిస్తున్నారట. నైజాం వంటి కొన్ని ఏరియాల్లో మైత్రీవారు తమ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ద్వారానే ముందుకు వెళ్దామని ప్లాన్ చేస్తున్నారుట. రిస్క్ అనేది వ్యాపారంలో ఎప్పుడూ ఉండేది కాబట్టి హైప్ ని బట్టి సినిమాకు కలెక్షన్స్ గట్టిగా వస్తాయని, థియేటర్స్ కళకళ్లాడతాయని ఎగ్డిబిటర్స్ భావిస్తున్నారు. ఏదైమైనా ఓ వారంలో బిజినెస్ క్లోజ్ అయ్యిపోతుందని అంటున్నారు.
మరో ప్రక్క నార్త్ ఇండియా మార్కెట్ లో కూడా పుష్ప 2 కి కనీ వినీ ఎరుగని రీతిలో బిజినెస్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఓవర్సీస్ హక్కులు కూడా సుమారు 100 కోట్లు అంటూ ఓ రూమర్ కూడా ఉంది. పుష్ప ది రూల్ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రత్యాంగిరా సినిమాస్ సొంతం చేసుకొన్నట్టు తెలిసింది. ఈ సినిమా కోసం 7.5 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 60 కోట్ల రూపాయలు చెల్లించి ఈ హక్కులను సొంతం చేసుకొన్నారనే వార్త ప్రముఖంగా వినిపిస్తున్నది.
pushpa 2 The Rule
తెలుగు సహా కన్నడ, మళయాలంలో కూడా సాలిడ్ బిజినెస్ ఈ చిత్రానికి జరిగితున్నట్లుగా టాక్ ఉంది కానీ ఒక్క తమిళ్ లో మాత్రం అనుకున్న రేంజ్ లో ఈ చిత్రానికి బిజినెస్ కానట్టే తెలుస్తుంది. జెనరల్ గా తమిళ్ ఆడియెన్స్ ఇతర భాషలు సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి కనబరచరు. రీసెంట్ గా పుష్ప ఫస్ట్ సింగిల్ నే అందుకు పెద్ద ఉదాహరణ. అన్ని భాషల్లో సాంగ్ కి ప్రేక్షకులు మాసివ్ రెస్పాన్స్ ఇస్తే ఒక్క తమిళ్ వెర్షన్ 1 మిలియన్ అందుకోడానికి చాలా సమయం తీసుకుంది. దీనితో తమిళ్ లో మాత్రం పుష్ప 2 కి లిమిటెడ్ గానే బిజినెస్ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.
'పుష్ప 2' నార్త్ ఇండియా రైట్స్ రూ. 200 కోట్లు ఇచ్చి ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ తీసుకున్నారు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్' సినిమాల కంటే హయ్యస్ట్ అమౌంట్ ఇచ్చి తీసుకున్నారు. సౌత్ స్టేట్స్ వచ్చే సరికి థియేట్రికల్ రైట్స్ ద్వారా ఆల్మోస్ట్ రూ. 270 కోట్లు వచ్చాయట. టోటల్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 550 కోట్లు వచ్చాయి.
Pushpa 2
వాస్తవానికి పుష్ప పార్ట్ 1 రిలీజ్ నాటికి ఈ క్రేజ్ లేదు..ఈ స్దాయి ఎక్సపెక్టేషన్స్ లేవు. కానీ ఇప్పుడు సీన్ వేరు. ‘పుష్ప ది రైజ్’ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది.. ఈ క్రమంలో ఇప్పుడు అంతా ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
pushpa 2
‘పుష్ప ది రూల్’ భారీగా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ ఏడాది (2024) ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. యానిమల్ తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన త్రిప్తి డిమ్రి (tripti dimri)బన్నీ తో కలిసి పుష్ప 2 కి సంబంధించిన ఐటెం సాంగ్ లో చిందులేయనుందని తెలుస్తోంది. మాస్ ఐటెం సాంగ్ దేవి ఇచ్చాడని, థియోటర్స్ ఊగిపోతాయని అంటున్నారు.
ఇక పుష్ప 2 చిత్రానికి ఎలాగో తెలుగు రాష్ట్రాల్లో భీబత్సమైన క్రేజ్ ఉంటుంది. అయితే హిందీ బెల్ట్ లలో మాత్రం ఇంకా క్రేజ్ మొదలు కాలేదు. ఫస్ట్ సాంగ్ డీసెంట్ గా రెస్పాన్స్ వచ్చిందని కానీ ఇనిస్టెంట్ ఛాట్ బస్టర్ కాలేదు. దాంతో ఇంకా అక్కడ పుష్ప 2 ఫీవర్ ప్రారంభం కాలేదు. అందుకోసం నిర్మాతలు ప్రమోషన్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఎలక్షన్స్ ఫీవర్ తగ్గింది కాబట్టి పుష్ప ఫీవర్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది.
పుష్పలో ఐకాన్‌స్టార్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న పుష్ప-2 ది రూల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దుగా అంచనాలు వున్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసారు మేకర్స్ . ఈ టీజర్ లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియస్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపించంటతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.