- Home
- Technology
- Gadgets
- Xiaomi 17 Series : ఆపిల్, శాంసంగ్ కు పోటీ.. అదిరే ఫీచర్లతో షియోమీ 17 సిరీస్ లాంచ్.. ధర, స్పెక్స్ ఇవే
Xiaomi 17 Series : ఆపిల్, శాంసంగ్ కు పోటీ.. అదిరే ఫీచర్లతో షియోమీ 17 సిరీస్ లాంచ్.. ధర, స్పెక్స్ ఇవే
Xiaomi 17 series : చైనాలో షియోమీ 17, 17 ప్రో, 17 ప్రో మాక్స్ లాంచ్ చేసింది. Snapdragon 8 Elite Gen 5, Leica కెమెరా, 7500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సహా అదరిపోయే ఫీచర్లతో శాంసంగ్, ఆపిల్ లేటెస్ట్ ప్రీమియం మోడల్స్ కు పోటీగా వచ్చింది.

అదిరిపోయే ఫీచర్లతో షియోమీ 17 సిరీస్ లాంచ్
చైనాలోని బీజింగ్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో షియోమీ వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌లో కొత్త షియోమీ 17 సిరీస్ ను అధికారికంగా ప్రకటించింది. అదిరిపోయే ఫీచర్లతో ఈ సిరీస్‌లో మూడు మోడల్స్.. షియోమీ 17, షియోమీ 17 ప్రో, షియోమీ 17 ప్రో మాక్స్ లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇవన్నీ క్వాల్కమ్ తాజా Snapdragon 8 Elite Gen 5 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ తో వచ్చాయి. ఐఫోన్ 17 సిరీస్ మార్కెట్‌లోకి వచ్చిన వారం రోజుల తర్వాతే షియోమీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లను విడుదల చేసింది.
షియోమీ 17 స్పెసిఫికేషన్లు, ధరలు ఇవే
షియోమీ 17 లో 6.3 అంగుళాల ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. కెమెరా విభాగంలో లైకా ట్యూన్ చేసిన ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ (HyperOS) 3 పై నడుస్తుంది. 16GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
చైనాలో షియోమీ 17 బేస్ మోడల్ ధర CNY 4,499 (సుమారు రూ.56,000). 12GB + 512GB వేరియంట్ ధర CNY 4,799 (రూ.60,000), 16GB + 512GB వేరియంట్ ధర CNY 4,999 (రూ.62,000). కొత్తగా 16GB + 1TB మోడల్ CNY 5,299 (రూ.65,900) కు అక్టోబర్ 5 నుంచి అమ్మకాలకు వస్తుందని తెలిపింది.
షియోమీ 17 ప్రో మాక్స్ ఫీచర్లు
షియోమీ 17 ప్రో మాక్స్ ఈ సిరీస్‌లో హై-ఎండ్ మోడల్‌గా నిలుస్తుంది. Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, 6.9 అంగుళాల 2K రిజల్యూషన్ ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లే, గరిష్టంగా 3500 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. కెమెరా మాడ్యూల్‌లో మాజిక్ బ్యాక్ స్క్రీన్ అనే రెండో డిస్‌ప్లే ఉంది. ఇది నోటిఫికేషన్లు, టైం, మ్యూజిక్ కంట్రోల్స్ చూపించడమే కాకుండా, రియర్ కెమెరాతో సెల్ఫీలు తీయడానికి వ్యూఫైండర్‌గా కూడా పనిచేస్తుంది.
ప్రో మాక్స్‌లో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 5x ఆప్టికల్ జూమ్ తో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు కెమెరా 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 7500mAh. 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది.
షియోమీ 17 ప్రో మాక్స్ ధర ఎంత?
షియోమీ 17 ప్రో మాక్స్ చైనాలో RMB 5,999 (సుమారు రూ.74,700) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. RMB 6,299 (రూ.78,500), RMB 6,999 (రూ.87,200) వరకు వేరియంట్లు ఉన్నాయి. ఈ సిరీస్ బ్లాక్, వైట్, పర్పుల్, గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. 8mm మందం ఉన్న స్లిమ్ బాడీతో వస్తుంది.
ప్రస్తుతం ఇండియాలో లాంచ్ తేదీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే షియోమీ 17 ప్రో సిరీస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో భారత మార్కెట్‌లో ప్రవేశించే అవకాశముందని కంపెనీ సంకేతాలు ఇచ్చింది.
షియోమీ 17 సిరీస్ ఇండియా లాంచ్ అప్‌డేట్
షియోమీ 17 మోడల్‌ను ఇండియాలో జరిగిన Snapdragon Summit Global Highlights ఈవెంట్‌లో ప్రదర్శించారు. షియోమీ ఇండియా సిఎమ్‌ఓ అనుజ్ శర్మ ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్లూ కలర్ వేరియంట్‌ను చూపించారు. చైనాలో ఇది బ్లాక్, పింక్, వైట్ కలర్స్‌లో కూడా లభిస్తుంది. భారత మార్కెట్లోకి రాబోయే వేరియంట్ అదే స్పెసిఫికేషన్లతో వస్తుందా అనేది ఇంకా స్పష్టత లేదు.