- Home
- Technology
- Gadgets
- మీకు ఎలాంటి స్మార్ట్ వాచ్ సరిపోతాయో తెలుసుకోవాలా? : అయితే మీరీ చిట్కాలు పాటించండి
మీకు ఎలాంటి స్మార్ట్ వాచ్ సరిపోతాయో తెలుసుకోవాలా? : అయితే మీరీ చిట్కాలు పాటించండి
మీరు స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? లేదంటే మీకు ఇష్టమైనవారికి గిప్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే తొందరపడి ఏది పడితే అది కొనేయకండి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకొండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Smartwatch
ప్రస్తుత టెక్ జమానాలో స్మార్ట్ వాచ్ అనేది నిత్యావసర వస్తువు అయిపోయింది.గతంలో సాధారణ వాచ్ లు పెట్టేవారంతా ఇప్పుడు స్మార్ట్ వాచ్ లకు మారారు. కేవలం యూత్ మాత్రమే కాదు చిన్నాపెద్దా అనే తేడాలేకుండా ప్రతిఒక్కరి చేతికి స్మార్ట్ వాచ్ ఉంటోంది.
అయితే మీరు ఇంకా స్మార్ట్ వాచ్ కొనలేదా? లేదంటే మీకు ఇష్టమైనవారు ఎవరికైనా గిప్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు వాచ్ కొనేముందు దాని ఎలా ఉపయోగించాలని అనుకుంటున్నారో నిర్దారించుకొండి. వ్యాయామం చేయడం, గుండె చప్పుడు చూడటం, నిద్ర గురించి తెలుసుకోవడం వంటి ఆరోగ్య జాగ్రత్తల కోసం కావాలా? లేదా ఫోన్లు, మెసేజ్‌లు, ఈమెయిల్‌లాంటి కబుర్ల కోసం కావాలా? నీ అవసరానికి తగ్గట్టు స్మార్ట్ వాచ్‌ని ఎంచుకోవచ్చు.
Smartwatch
ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో చూడండి
స్మార్ట్ వాచ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో (Operating System) పనిచేస్తుందో చూడు. అది నీ ఫోన్‌కు సరిపోతుందో లేదో చూసుకొండి. ఆపిల్ వాచ్ ఐఫోన్‌కు, వేరే ఓఎస్ వాచ్‌లు ఆండ్రాయిడ్ ఫోన్‌లకు బాగా పనిచేస్తాయి.
Smartwatch
డిజైన్, కంఫర్ట్ ముఖ్యం:
స్మార్ట్ వాచ్ డిజైన్, కంఫర్ట్ చాలా ముఖ్యం. చేతికి సరిపోయే సైజులో ఉండాలి. కలర్, స్క్రీన్ సైజు, బ్రైట్ నెస్ కూడా ముఖ్యం. ఎక్కువ సేపు పెట్టుకున్నా ఇబ్బందిగా ఉండకుండా సెలక్ట్ చేసుకోవాలి.
Smartwatch
బ్యాటరీ లైఫ్:
స్మార్ట్ వాచ్ బ్యాటరీ ఎంత సేపు వస్తుందో చూడండి. పదే పదే ఛార్జ్ చేస్తే చిరాకుగా ఉండొచ్చు. కనీసం రోజంతా వచ్చేలా మంచి బ్యాటరీ కలిగిన వాచ్ ను ఎంపిక చేసుకొండి.
Smartwatch
ఫీచర్లు, పనులు:
మీకు కావాల్సిన ఫీచర్లు స్మార్ట్ వాచ్‌లో ఉన్నాయో లేదో చూసుకొండి. జీపీఎస్,హార్ట్ బీట్ చూసేది, ఆక్సిజన్ సెన్సార్, నిద్రను కనిపెట్టేది, వ్యాయామ పద్ధతులు వంటివి ముఖ్యం. ఇంకా ఫోన్లు, మెసేజ్‌లు, పాటలు వినేందుకు కంట్రోల్ వంటివి కూడా ఉండేలా చూసుకొండి.
Smartwatch
ధర, బ్రాండ్:
స్మార్ట్ వాచ్ ధర నీ బడ్జెట్‌కు తగ్గట్టు ఉండాలి. పేరున్న బ్రాండ్ల స్మార్ట్ వాచ్‌లు కాస్త ఎక్కువ ధర ఉన్నా, మంచి ఫీచర్లు ఉంటాయి. కొనేముందు వాడిన వాళ్ల అభిప్రాయాలు, నిపుణుల రివ్యూలు చూస్తే మంచిది.
Smartwatch
వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్ :
స్మార్ట్ వాచ్‌కు నీళ్లు, దుమ్ము తగలకుండా చూడండి. ముఖ్యంగా ఈత కొట్టేటప్పుడు లేదా వ్యాయామం చేసేటప్పుడు నీరు తగలకుండా చూసుకోవాలి. ఇలాంటి బాాధలు ఉండకూడదంటే వాటర్ ఫ్రూఫ్ వాచ్ తీసుకొండి.
Smartwatch
ఎక్కువ ఫీచర్లు:
కొన్ని స్మార్ట్ వాచ్‌లలో ఎన్‌ఎఫ్‌సీ (NFC) ద్వారా డబ్బులు కట్టే సౌకర్యం, వాయిస్ కమాండ్స్, కెమెరా కంట్రోల్ వంటి మరింత అడ్వాన్స్ ఫీచర్లు ఉంటాయి. మీకు అవసరం అనుకుంటే ఇలాంటి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు.
Smartwatch
గ్యారెంటీ, సర్వీస్:
స్మార్ట్ వాచ్ గ్యారెంటీ లేదా వ్యారంటీ చూసుకొండి. సర్వీస్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొండి. ఏమైనా రిపేర్ వస్తే, సులువుగా చేయగలిగేలా సర్వీస్ సెంటర్లు ఉండాలి.
పైన చెప్పిన విషయాలు గుర్తు పెట్టుకుని స్మార్ట్ వాచ్ కొంటే మీకు కావాల్సిన, బడ్జెట్‌కు తగిన స్మార్ట్ వాచ్‌ని ఎంచుకోవచ్చు.