వచ్చే వారంలోనే సామ్‌సంగ్ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. ధర కూడా తక్కువే..
ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సామ్‌సంగ్ ఒక కొత్త అప్ డేట్ ఇచ్చింది. కొత్త ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 ప్రారంభ తేదీని సామ్‌సంగ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 ఫిబ్రవరి 15న భారతదేశంలో విడుదల కానుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62ని ఫ్లిప్‌కార్ట్ నుంచి నుండి కొనుగోలు చేయవచ్చు. సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 కోసం ఒక మైక్రో పేజీ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యక్షమైంది. ఫ్లిప్‌కార్ట్ పేజీలో ఈ ఫోన్ వెనుక, ముందు డిజైన్ గురించి సమాచారాన్ని కూడా అందిస్తుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 ధర
ప్రస్తుతం దీని ధర గురించి ఎలాంటి సమాచారం లేదు, కానీ ఫిబ్రవరి 15న లాంచ్ చేసేటప్పుడు అసలు ధర తెలుస్తుంది. అయితే గెలాక్సీ ఎఫ్ 62 ధర రూ.20,000-25,000 మధ్య ఉంటుందని సామ్‌సంగ్ చెప్పింది. ఇంతకుముందు ఈ ఫోన్ గురించి లీకైన నివేదికలో ఈ ఫోన్ ధర రూ .25 వేల కన్నా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్‌కు ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ తో వస్తుందని సామ్‌సంగ్ అధికారికంగా తెలిపింది. ఈ ప్రాసెసర్ గురించి ఎక్కువగా చర్చించదగిన విషయం ఏంటంటే దాని స్పీడ్. ఫ్లిప్‌కార్ట్ ప్రకారం, ఎక్సినోస్ 9825 ఏఎన్‌టియూటియూ 8 లో 452000+ మార్కులు సాధించింది. ఫోన్‌లో ఇన్ఫినిటీ ఓ డిస్ ప్లేతో రానుంది.
కొద్ది రోజుల క్రితం సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 ఒక వెబ్ సైట్‌లో మోడల్ నంబర్ SM-E625F_DSతో కనిపించింది. ఫోన్‌లో బ్లూటూత్ 5.0 కి సపోర్ట్ ఉంటుంది. గెలాక్సీ ఎఫ్ -62 సామ్‌సంగ్ ఇండియా సపోర్ట్ పేజీలో కూడా ప్రత్యక్షమైంది. ఇది కాకుండా, ఫోన్ ఫోటో ప్రకారం దీనికి క్వాడ్ కెమెరా సెటప్ ఉన్నట్లు తెలుస్తుంది. మరో నివేదిక ప్రకారం, ఫోన్‌కు 6 జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 11 అందించారు. సామ్‌సంగ్ ఇండియా చెందిన గ్రేటర్ నోయిడా ప్లాంట్లో ఈ ఫోన్ ఉత్పత్తి ప్రారంభమైంది.