MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • Samsung Galaxy M47 5G : భీభత్సమైన బ్యాటరీ, సూపర్ స్పీడ్ ప్రాసెసర్‌తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం 47 5జీ

Samsung Galaxy M47 5G : భీభత్సమైన బ్యాటరీ, సూపర్ స్పీడ్ ప్రాసెసర్‌తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం 47 5జీ

Samsung Galaxy M47 5G : 6000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్‌తో శాంసంగ్ గెలాక్సీ M47 5G జూన్ 29న ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమైన కొత్త శాంసంగ్ ఫోన్ పూర్తి వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 26 2026, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మతిపోయే ఫీచర్లతో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్.. ఆ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం
Image Credit : our own

మతిపోయే ఫీచర్లతో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్.. ఆ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం

భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌ను షేక్ చేయడానికి సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త మొబైల్‌తో సిద్ధమైంది. తన పాపులర్ గెలాక్సీ ‘ఎం’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం 47 5జీ (Samsung Galaxy M47 5G) ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

పవర్ యూజర్లు, మొబైల్ గేమర్స్‌ను టార్గెట్ చేస్తూ భారీ బ్యాటరీ, అల్టిమేట్ ఏఐ ఫీచర్లు, సూపర్ స్పీడ్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. జూన్ 29న ఈ మొబైల్ ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ బ్లేజ్ బ్లూ, రోగ్ రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Samsung Galaxy M47 5G : సాలిడ్ డిజైన్ అండ్ డిస్‌ప్లే
Image Credit : X/stufflistings

Samsung Galaxy M47 5G : సాలిడ్ డిజైన్ అండ్ డిస్‌ప్లే

డిజైన్ పరంగా చూస్తే ఈ ఫోన్ లేటెస్ట్ గెలాక్సీ 'ఏ' సిరీస్ మోడల్స్ లాగే ఫ్లాట్ రియర్ కెమెరా సెటప్, పిల్ షేప్డ్ కెమెరా మాడ్యూల్‌తో చాలా క్లాసీగా కనిపిస్తోంది. ఇందులో 6.7-ఇంచుల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల స్క్రీన్‌ స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ను ఉపయోగించారు. దీనివల్ల ఫోన్ కిందపడినా గీతలు పడకుండా, పగలకుండా గట్టి రక్షణ లభిస్తుంది. 2 మీటర్ల ఎత్తు నుంచి పడినా తట్టుకునే కెపాసిటీ దీనికి ఉందని కంపెనీ చెబుతోంది.

36
Samsung Galaxy M47 5G లో నెక్స్ట్ లెవెల్ ప్రాసెసర్ అండ్ మెమరీ
Image Credit : X/tarunvats33

Samsung Galaxy M47 5G లో నెక్స్ట్ లెవెల్ ప్రాసెసర్ అండ్ మెమరీ

ఈ శాంసంగ్ గెలాక్సీ M47 5G ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 4nm ప్రాసెస్‌పై పనిచేస్తుంది. దీనికి తోడుగా బడ్జెట్ రేంజ్‌లో ఎవరూ ఇవ్వని విధంగా అల్ట్రా ఫాస్ట్ LPDDR5x RAM, UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు.

ఈ సెగ్మెంట్‌లోని పోకో X7, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ వంటి పోటీ ఫోన్లు ఇప్పటికీ పాత LPDDR4x ర్యామ్‌తోనే వస్తుండగా, శాంసంగ్ మాత్రం అడ్వాన్స్‌డ్ ర్యామ్‌తో 20 శాతం ఎక్కువ బ్యాండ్‌విడ్త్‌ను ఆఫర్ చేస్తోంది. దీనివల్ల యాప్స్ మరింత స్పీడ్ గా ఓపెన్ అవుతాయి, మల్టీటాస్కింగ్ సూపర్ ఫాస్ట్‌గా సాగుతుంది.

46
గేమర్స్ కోసం బైపాస్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ
Image Credit : X/tarunvats33

గేమర్స్ కోసం బైపాస్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ

శాంసంగ్ గెలాక్సీ M47 5G లో ఏకంగా 6,000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే హ్యాపీగా రెండు రోజులు వస్తుంది. దీనితో పాటు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా మొబైల్ గేమర్స్ కోసం ఇందులో బైపాస్ ఛార్జింగ్ అనే క్రేజీ ఫీచర్‌ను పెట్టారు.

మనం గేమింగ్ ఆడేటప్పుడు ఛార్జింగ్ పెడితే, కరెంట్ నేరుగా బ్యాటరీకి వెళ్లకుండా ఫోన్ మదర్‌బోర్డ్‌కు అందుతుంది. దీనివల్ల ఫోన్ అస్సలు హీట్ అవ్వదు. బ్యాటరీ లైఫ్ కూడా అస్సలు పాడవదు. కాలేజ్ స్టూడెంట్స్, హెవీ యూజర్లకు ఈ ఫీచర్ ఒక బూస్ట్ లాంటిదని చెప్పొచ్చు.

56
శాంసంగ్ గెలాక్సీ M47 5G లో క్రిస్టల్ క్లియర్ కెమెరా, ఏఐ ఫీచర్స్
Image Credit : X/tarunvats33

శాంసంగ్ గెలాక్సీ M47 5G లో క్రిస్టల్ క్లియర్ కెమెరా, ఏఐ ఫీచర్స్

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో వస్తుంది. దీనివల్ల ఫోటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా చాలా క్లియర్ గా వస్తాయి. దీంతో పాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి.

సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 12 మెగాపిక్సెల్ హెచ్డీఆర్ కెమెరాను హోల్ పంచ్ కటౌట్‌లో ఇచ్చారు. ఈ ఫోన్ ద్వారా యూజర్లు 4K హై రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. అంతేకాదు, తక్కువ లైటింగ్‌లో కూడా అద్భుతమైన ఫోటోలు తీసేందుకు శాంసంగ్ నైటోగ్రఫీ సాఫ్ట్‌వేర్‌ను ఇందులో జోడించింది.

66
శాంసంగ్ గెలాక్సీ M47 5G : సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్.. ధర ఎంత ఉండొచ్చు?
Image Credit : X/tarunvats33

శాంసంగ్ గెలాక్సీ M47 5G : సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్.. ధర ఎంత ఉండొచ్చు?

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 బేస్డ్ శాంసంగ్ One UI 8.5 వెర్షన్‌తో వస్తుంది. మిడ్ రేంజ్ ఫోన్లలో ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 6 సంవత్సరాల పాటు ఓఎస్ అప్‌గ్రేడ్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని శాంసంగ్ ప్రామిస్ చేసింది. అంటే ఈ ఫోన్ కొంటే ఫ్యూచర్ ఫుల్ సెక్యూర్ అన్నమాట. ఇందులో గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్, ఏఐ వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్ వంటి అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. దాంతో పాటు నాక్స్ వాల్ట్, ఆటో బ్లాకర్ వంటి హై లెవెల్ సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ధర విషయానికి వస్తే.. శాంసంగ్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. కానీ మార్కెట్ విశ్లేషకుల ప్రకారం, ఈ ఫోన్ రూ. 20,000 నుంచి రూ. 25,000 బడ్జెట్ రేంజ్‌లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. బేస్ వేరియంట్ గనుక రూ.23,000 లోపు ఉంటే, మార్కెట్లో మిగతా బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. లాంచ్ రోజు బ్యాంక్ ఆఫర్స్ ద్వారా మరో రూ.1,500 నుంచి రూ.2,000 వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ అఫీషియల్ వెబ్‌సైట్లలో ఈ ఫోన్ సేల్‌కు రానుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
PM Modi Phone: ప్రధాని మోదీ వాడే ఫోన్ ఏదో తెలుసా? దీని ఫీచర్లు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !
Recommended image2
నీళ్లు తాగ‌మ‌ని గుర్తు చేసే వాట‌ర్ బాటిల్.. బ్లూటూత్ క‌నెక్ష‌న్‌, స్మార్ట్‌ఫోన్‌లో అల‌ర్ట్స్
Recommended image3
Vivo V80 Review: అదిరిపోయే కెమెరా, పవర్ ఫుల్ బ్యాటరీ.. కానీ రూ. 63 వేల ధరతో వీవో V80 కొనొచ్చా?
Related Stories
Recommended image1
Earthquake Alert: వెనిజులా భూకంపాన్ని ముందే హెచ్చరించిన గూగుల్.. మీ స్మార్ట్‌ఫోనే ఒక డిటెక్టర్ అని మీకు తెలుసా?
Recommended image2
Mutton Buying Tips: లేత మటన్ vs ముదురు మటన్.. ముక్కను చూడగానే కనిపెట్టేయండిలా !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved