దీపావళి ఆఫర్: 7000mAh బ్యాటరీ, 50MP AI కెమెరా ఫోన్ పై రూ.6000 తగ్గింపు
Realme Diwali Offer: దీపావళి పండగ సేల్ లో రియల్‌మీ P4 5G ఫోన్ రూ.6,000 తగ్గింపుతో లభిస్తోంది. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌తో మంచి ఫీచర్లను కలిగి ఉంది.

రియల్‌మీ P4 5G పై భారీ తగ్గింపు
రియల్‌మీ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన రియల్‌మీ పీ4 5జీ (Realme P4 5G) ఫోన్‌పై భారీ ప్రైస్ కట్ ప్రకటించింది. దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ (Big Diwali Sale) లో ఈ ఫోన్ పై బిగ్ ఆఫర్ తీసుకొచ్చింది. తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది. 7000mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.6,000 వరకు తగ్గించారు.
దీపావళి సేల్‌లో రియల్‌మీ P4 5G ప్రైస్ కట్
రియల్‌మీ P4 5G మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటి ధరలు గమనిస్తే..
• 6GB RAM + 128GB స్టోరేజ్ రూ.18,499
• 8GB RAM + 128GB స్టోరేజ్ రూ.19,499
• 8GB RAM + 256GB స్టోరేజ్ రూ.21,499
రియల్‌మీ P4 5G మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. అవి స్టీల్ గ్రే, ఇంజిన్ బ్లూ, ఫోర్జ్ రెడ్. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో ఈ ఫోన్‌ను రూ.16,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్ ద్వారా ₹2,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ.14,999కే పొందవచ్చు. రియల్‌మీ P4 5G ఫోన్ అసలు ధర రూ.20,999గా ఉండగా, ఈ ఆఫర్ ద్వారా రూ.6,000 వరకు తగ్గింపుతో లభిస్తోంది.
మీడియా టెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్ తో రియల్‌మీ P4 5G
రియల్‌మీ P4 5G ఫోన్ 6.77 ఇంచుల HyperGlow AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ P4 5G లో మీడియా టెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్ ఉపయోగించారు. 8GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ (Android 15) ఆధారిత రియల్‌మీ యూఐ 6.0 (realme UI 6.0) మీద రన్ అవుతుంది.
రియల్‌మీ P4 5G కెమెరా, వీడియో ఫీచర్లు
రియల్‌మీ P4 5G ఫోన్ వెనుక భాగంలో 50MP ఏఐ ప్రైమరీ కెమెరా (OV50D40 సెన్సార్), 8MP వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.
రియల్‌మీ P4 5G వీడియో రికార్డింగ్ సపోర్ట్
రియర్ వీడియో 4K 30fps, 1080p 60fps, 720p 120fps వరకు సపోర్టు చేస్తుంది. స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, సినిమాటిక్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 1080p వీడియో రికార్డింగ్, డ్యూయల్ వ్యూ షూట్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో EIS/OIS స్టెబిలైజేషన్, గూగుల్ లెన్స్, పనోరమా, ప్రో మోడ్, టిల్ట్-షిఫ్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
రియల్‌మీ P4 5G బ్యాటరీ, కనెక్టివిటీ సహా ఇతర ఫీచర్లు
రియల్‌మీ P4 5G ఫోన్‌లో 7000mAh టైటాన్ బ్యాటరీ ఉంది. ఇది 80W అల్ట్రా ఛార్జ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. USB Type-C పోర్ట్ ఉంది.
కనెక్టివిటీ:
- 5G + 5G డ్యూయల్ సిమ్ సపోర్ట్
- Wi-Fi 5 / Wi-Fi 6, Bluetooth 5.4
- GPS, GLONASS, Galileo నావిగేషన్ సపోర్ట్
- డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉన్నాయి.
సెన్సార్లు: ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సెలరామీటర్, జైరోస్కోప్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.
దీపావళి సేల్‌లో రియల్‌మీ ఫోన్ హాట్ డీల్
రియల్‌మీ P4 5G ఫోన్‌ను బాక్స్‌లోనే 80W చార్జర్, ప్రొటెక్టివ్ కేస్, USB Type-C కేబుల్, క్విక్ గైడ్ ను అందిస్తున్నారు. భారీ బ్యాటరీ, వేగవంతమైన చార్జింగ్, 144Hz డిస్ప్లేతో ఈ ఫోన్ ఈ దీపావళిలో అత్యంత ఆకర్షణీయ ఆఫర్‌గా నిలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ లో సేల్ కు ఉంది.