సూపర్ ఫీచర్లతో OnePlus 13, 13R ఇండియాలో లాంచ్.. ధర ఎంతంటే?
OnePlus 13 and 13R: వన్ ప్లస్ వింటర్ ఈవెంట్‌లో కంపెనీ OnePlus 13, OnePlus 13R లను ఇండియాలో లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, వాటర్ ప్రూఫింగ్, కొత్త డిజైన్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మెరుగైన కెమెరాలు వంటి అప్‌గ్రేడ్‌లతో OnePlus 13 and 13R ఫోన్లు వస్తున్నాయి.
అద్భుతమైన ఫీచర్లతో వన్ ప్లస్ కంపెనీ తన OnePlus 13, OnePlus 13R ను ఇండియాలో లాంచ్ చేసింది. వన్ ప్లస్ నుంచి వచ్చిన ఈ కొత్త సిరీస్ ఫోన్లు సూపర్ పెర్ఫార్మెన్స్, యూజర్లకు సరికొత్త అనుభూతిని పంచడానికి కొన్ని ఆధునిక ఫీచర్లను జోడించింది. OnePlus 13 లో Snapdragon 8 Elite చిప్‌సెట్ ఉండగా, OnePlus 13R లో Snapdragon 8 Gen 3 ఉంటుంది.
కొత్త OnePlus 13 సిరీస్ ఫోన్లు ఔట్ ఆఫ్ ది బ్యాక్స్ OxygenOS 15 తో వస్తున్నాయి. ఇందులో కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. స్లీక్ డిజైన్, ఫ్లాగ్‌షిప్ అనుభవంతో పాటు OnePlus 13 సీరీస్ ఫోన్లలో అనేక AI ఫీచర్లను కూడా అందిస్తుంది. OxygenOS 15 అద్భుతమైన యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందించడంతో పాటు డివైస్ స్టోరేజ్ ఆప్టిమైజ్ మరింత మెరుగ్గా ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
OnePlus 13, OnePlus 13R: డిజైన్ - డిస్‌ప్లే వివరాలు:
OnePlus 13 మోడల్ 6.82-అంగుళాల AMOLED స్క్రీన్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. OnePlus 13 లో క్వాడ్-కర్బ్ డిస్‌ప్లే ఉంది. డిస్ల్పే Ceramic Glass ప్రొటెక్షన్ తో వస్తుంది.
OnePlus 13R లో 6.78-అంగుళాల AMOLED స్క్రీన్, LTPO 4.1 టెక్నాలజీతో 4,500 నిట్స్ మెక్సిమం బ్రైట్‌నెస్‌తో ఉంది. క్వాడ్ కర్బ్ డిస్‌ప్లే, ముందు-వెనుక భాగాలు Corning Gorilla Glass 7i ప్రోటక్షన్ తో వస్తున్నాయి.
OnePlus 13, OnePlus 13R: ప్రాసెసర్ వివరాలు:
Qualcomm లెటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ తో వన్ ప్లస్ 13 వస్తోంది. 3nm ప్రాసెస్ చిప్. దీంతో ఇది అద్భుతమైన పనితీరును చూపిస్తుంది. మల్టీ టాస్కింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మీకు ఫెర్ఫామన్స్ ఇస్తుంది. చిప్‌సెట్ LPDDR5X RAM, UFS 4.0 తో వస్తుంది. OnePlus 13 నాలుగు సంవత్సరాల మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, ఐదేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందుకుంటుంది.
వన్ ప్లస్ 13 శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 12GB RAMతో వస్తుంది. అలాగే, ఇండియాలో 24 జీబీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. గేమింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్లాట్‌ఫారమ్ 40% మెరుగైన అడ్రినో GPU పనితీరును, 44% మెరుగైన ఓరియన్ CPU, 45% వేగవంతమైన AI ఇంజిన్‌ను అందిస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా 27% పెంచుతుందని కంపెనీ పేర్కొంది.
ఇక OnePlus 13R Qualcomm Snapdragon 8 Gen 3 SoCని కలిగి ఉంది. గత సంవత్సరం ప్రారంభించిన OnePlus 12లో ఇదే ప్రాసెసర్ ఉంది. ఇది 12/16GB LPDDR5x RAM, 256GB/512GB UFS 4.0 స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
13 సిరీస్ లో వన్ ప్లస్ AI
AI OnePlus 13 సిరీస్ లో కొత్త ఫీచర్లతో వస్తోంది. ఇది రోజువారీ కార్యకలాపాలను మరింత మెరుగ్గా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
OnePlus 13, 13R కెమెరా ఫీచర్లు
OnePlus 13 సిరీస్ క్లియర్ బర్స్ట్, యాక్షన్ మోడ్, స్నాప్‌షాట్ వంటి కెమెరా ఫీచర్లతో వస్తుంది. AI ఎరేజర్ టూల్ కూడా ఉంది. OnePlus 13 టెలిఫోటో మరియు అల్ట్రావైడ్ సెన్సార్‌లను ఒక్కొక్కటి 50-మెగాపిక్సెల్‌లకు అప్‌గ్రేడ్ చేస్తున్నప్పుడు OnePlus 12 నుండి 50-మెగాపిక్సెల్ LYT-808 ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఇది 4K/60fps డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ మరియు 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. OnePlus 13 యొక్క మా వివరణాత్మక సమీక్ష ముగిసింది మరియు మీరు ఇక్కడ కెమెరా నమూనాలను చూడవచ్చు. వెనుక ప్రధాన కెమెరాతో 8K, ముందు కెమెరాలతో 4K వరకు వీడియో రికార్డు చేసుకోవచ్చు.
వన్ ప్లస్ 13R లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడాంగిల్ కెమెరా, 50 ఎంపీ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. 2x అప్టికల్ జూమ్, 4x అప్టికల్ క్వాలిటీ జూమ్ సపోర్టు ఉంటుంది. ఫ్రంట్ 16 ఎంపీ కెమెరా ఉంది. బ్యాక్ కెమెరాతో 4కే వరకు వీడియో రికార్డు చేయవచ్చు. ఫ్రంట్ కెమెరాను ఉపయోగించి 1080పీ వరకు వీడియో రికార్డు చేయవచ్చు.
OnePlus 13, 13R బ్యాటరీ, ఇతర ఫీచర్లు
OnePlus 13 సిరీస్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. IP68, IP69 రేటింగ్‌లు, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. MagSafe ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. వన్ ప్లస్ 13లో 6000 mAh (Dual-cell 3,000 mAh), 100 వాట్స్ సూపర్ వుక్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే, 50 వాట్స్ ఎయిర్ వుక్ చార్జింగ్ సపోర్టు కూడా ఉంటుంది.
వన్ ప్లస్ 13R లో 6,000 mAh సింగిల్ సెల్ బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ సూపర్ వుక్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది.
వన్ ప్లస్ 13, 13R కనెక్టివిటీ:
వన్ ప్లస్ 13, వన్ ప్లస్ 13R రెండూ 5జీ సపోర్టుతో వస్తున్నాయి. అలాగే, 2జీ, 3జీ, 4జీ, 4జీ LTE సపోర్టు కూడ ఉంది. వైఫై 7,6,5, WLAN Display, WLAN tethering సపోర్టు కూడా ఉంది. బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సీతో పాటు దాదాపు అన్ని సెన్సర్లు ఉన్నాయి. డాల్బీ విజన్, హెచ్డీఆర్ సపోర్టు కూడా ఉంది.
వన్ ప్లస్ 13, 13R ధర:
OnePlus 13 12GB RAM, 256GB స్టోరేజ్‌తో ప్రారంభ ధర రూ.69,999. 16GB + 512GB వేరియంట్ ధర రూ. 76999. అలాగే, 24GB RAM + 1TB వేరియంట్ ధర రూ. 89,999. జనవరి 10న అమెజాన్ సేల్ తో పాటు ఇతర ఆన్‌లైన్, ఫిజికల్ రీటైలర్ స్టోర్ లలో విక్రయించనున్నారు. ICICI బ్యాంక్ కార్డ్ డీల్‌ల తగ్గింపు ధరలు కూడా ఉన్నాయి. OnePlus 13R ప్రారంభ ధర రూ. 42,999 (12GB RAM + 256GB ROM).
బాక్సులో ఏమేమి ఉంటాయి?
ఫోన్
సూపర్ వుక్ పవర్ అడప్టర్
ప్రొటెక్టిప్ కేస్
క్విక్ స్టార్ట్ గైడ్
టైప్ ఏ టూ సీ కేబుల్