MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • Jio Offer ఏప్రిల్ 15వరకు ఫ్రీ ఫ్రీ.. జియో అదిరిపోయే ఆఫర్!

Jio Offer ఏప్రిల్ 15వరకు ఫ్రీ ఫ్రీ.. జియో అదిరిపోయే ఆఫర్!

జియో ఉచితంగా అందిస్తోన్న ఐపీఎల్ ఫ్రీ ఆఫర్ ను ఏప్రిల్ 15వరకు పొడిగించింది. ఈ ఆఫర్ని ఇప్పటికే ఎంజాయ్ చేస్తున్న వినియోగదారులు ఈ సంతోషాన్ని మరి కొన్నాళ్లు పొడిగించుకోవచ్చు. ₹299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్‌ చేసినవారు జియో హాట్‌స్టార్‌లో ఉచితంగా ఐపీఎళ్ క్రికెట్ మ్యాచ్‌లు చూడొచ్చు. ఈ ఆఫర్‌లో 90 రోజుల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 4K క్వాలిటీతో వస్తుంది. ఇంకా జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ఉచిత ట్రయల్ కూడా ఉంది.

1 Min read
Author : Anuradha B
Published : Apr 03 2025, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
15రోజులు పొడిగింపు

15రోజులు పొడిగింపు

క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. జియో తన ప్రత్యేక క్రికెట్ ఆఫర్‌ను ప్రస్తుత, కొత్త కస్టమర్ల కోసం ఏప్రిల్ 15, 2025 వరకు పొడిగించారు. ఇంతకుముందు ఈ ఆఫర్ మార్చి 31తో ముగియాల్సి ఉంది. కానీ ఇది బాగా హిట్ కావడంతో మరో 15రోజులు పొడిగించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
రిలయన్స్ జియో

రిలయన్స్ జియో

ఈ ఆఫర్ కింద, ₹299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో కొత్త జియో సిమ్ కనెక్షన్ తీసుకున్న లేదా కనీసం ₹299తో రీఛార్జ్ చేసుకున్న జియో కస్టమర్లు జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా చూడొచ్చు. ఇప్పటికే రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు కూడా ₹100తో యాడ్-ఆన్ ప్యాక్ తీసుకుని ఈ ఆఫర్‌ను పొందవచ్చు. దీని ద్వారా రిలయన్స్ జియో కస్టమర్లు ఐపీఎల్ సీజన్‌ను పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఈ అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్‌తో, కస్టమర్లకు టీవీ/మొబైల్‌లో 90 రోజుల పాటు ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

33
ఐపీఎల్ ఫ్రీ

ఐపీఎల్ ఫ్రీ

ఈ ఆఫర్ కారణంగా 4K క్వాలిటీలో మ్యాచ్ లను వీక్షించవచ్చు. దీనివల్ల కస్టమర్లు ఐపీఎల్ క్రికెట్ సీజన్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. జియో హాట్‌స్టార్ ప్యాక్ మార్చి 22, 2025 నుంచి 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. దీంతో పాటు జియో ఇళ్లకు జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ఉచిత ట్రయల్ కనెక్షన్‌ను కూడా అందిస్తోంది. ఈ ఉచిత ట్రయల్ కనెక్షన్ 50 రోజుల వరకు ఉచితంగా ఉంటుంది. కస్టమర్లు 4Kలో క్రికెట్ చూసే ఉత్తమ అనుభవంతో ఇంటి వద్దనే మంచి వినోదాన్ని పొందవచ్చు. జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ఉచిత ట్రయల్ కనెక్షన్‌లో 800+ టీవీ ఛానెళ్లు, 11+ ఓటీటీ అప్లికేషన్‌లు, అన్‌లిమిటెడ్ వై-ఫై కూడా ఉన్నాయి. 

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారతీయ టెలికాం

Latest Videos
Recommended Stories
Recommended image1
Robot Vacuum: ఉన్నోల్లే కాదండోయ్‌.. మ‌నం కూడా రోబో వ్యాక్యూమ్ కొనుక్కోవ‌చ్చు. త‌క్కువ ధ‌ర‌లోనే
Recommended image2
Amazon Great Summer Sale : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. ఐక్యూ, వివో ఫోన్లపై రూ. 40 వేల వరకు డిస్కౌంట్!
Recommended image3
Oppo Reno 16: త‌క్కువ ధ‌ర‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. చూడ్డానికి అచ్చం ఐఫోన్‌లాగే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved