MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Technology
  • Gadgets
  • ఐఫోన్ 16 నుండి మోటో రేజర్ 50 వరకు: సెప్టెంబర్ 2024లో విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్‌లు

ఐఫోన్ 16 నుండి మోటో రేజర్ 50 వరకు: సెప్టెంబర్ 2024లో విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్‌లు

ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ నుండి వివో V40e, మోటో రేజర్ 50 వరకు... సెప్టెంబర్ 2024 నెలలో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్లు ఏవంటే... 

2 Min read
Arun Kumar P
Published : Aug 31 2024, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
సెప్టెంబర్ 2024 లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్లు...

సెప్టెంబర్ 2024 లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్లు...

సెప్టెంబర్ 2024 టెక్ ప్రియులకు ఖుషీ చేయనుంది  వినియోగదారుల అభిరుచి, ఆసక్తికి తగినట్లుగా రూపొందించిన తమ ప్రాడక్ట్స్ ను ప్రముఖ మొబైల్ తయారీ కంపనీలు విడుదలకు సిద్దం చేసాయి. ఇలా మొబైల్స్ తయారీ దిగ్గజం యాపిల్ నుండి ఐపోన్ 16 సీరిస్ నుండి శామ్సంగ్, వివో, రెడ్‌మీ వంటి ప్రముఖ తయారీదారుల పలు ఫోన్లలో మార్కెట్ లోకి వదిలేందుకు సిద్దమయ్యాయి. సరికొత్త ఫీచర్లు, ఆకట్టుకునే డిజైైన్ తో కూడిన కొత్త శ్రేణి ఫోన్లు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. ఇలా సెప్టెంబర్ 2024లో విడుదలకానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే.   

26
ఐఫోన్ 16 ప్రో

ఐఫోన్ 16 ప్రో

టెక్ దిగ్గజం ఆపిల్ నుండి ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్ లోకి రానుంది. సెప్టెంబర్ 9 న లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. కొత్త ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మరియు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లను ఆపిల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే ఆపిల్ ఎయిర్ పాడ్స్, వాచ్ 10 సీరిస్ ను కూడా ఆవిష్కరించనున్నారు. 

 

36
మోటో రేజర్ 50

మోటో రేజర్ 50

మోటోరోలా భారతదేశంలో మోటో రేజర్ 50 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో మోటో రేజర్ 50 ఎక్స్‌ట్రీమ్‌తో విడుదలైంది. అయితే, మోటరోలా ఈ ఏడాది జూలైలో భారతదేశంలో కోటో రేజర్ 50 అల్ట్రాను మాత్రమే ప్రవేశపెట్టింది. ఇటీవల సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ Xలో మోటో రేజర్ 50 విడుదలపై క్లారిటీ ఇచ్చింది. 

ఈ స్మార్ట్‌ఫోన్ HDR10+ సపోర్ట్‌తో 6.9-అంగుళాల LTPO AMOLED మెయిన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 50MP వైడ్ లెన్స్,13MP అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెప్టెంబర్ 9న LTPO AMOLED మోటో Razr 50 భారతదేశంలో విడుదల అవుతుందని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ప్రకటించింది.

46
శామ్సంగ్ గెలాక్సీ S24 FE

శామ్సంగ్ గెలాక్సీ S24 FE

గత ఏడాది ప్రారంభమైన శామ్సంగ్ యొక్క గెలాక్సీ S23 FE సిరీస్ లో భాగంగా S24 FE విడుదలకు సిద్దంగా వుంది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే అంటే సెప్టెంబర్ లోనే ప్రపంచ మార్కెట్లలో విడుదల కావచ్చనే ప్రచారం జరుగుతోంది.  శామ్సంగ్ గెలాక్సీ S24 FE ఎక్సినోస్ 2400e CPUని,  6.7-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

56
ఇన్ఫినిక్స్ హాట్ 50 సిరీస్

ఇన్ఫినిక్స్ హాట్ 50 సిరీస్

ఇన్ఫినిక్స్ రాబోయే వారాల్లో దేశంలో హాట్ 50 సిరీస్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.  ఈ కొత్త సిరీస్‌లో ఐదు మోడల్‌లు ఉండవచ్చు: ఇన్ఫినిక్స్ హాట్ 50, హాట్ 50 5G, హాట్ 50 ప్రో, హాట్ 50 ప్రో+, హాట్ 50i. అధికారిక తేదీ ప్రకటించనప్పటికీ  ఇన్ఫినిక్స్ హాట్ 50 మోడల్స్ తర్వలోనే మార్కెట్ లోకి రానున్నాయి. 

66
వివో V40e

వివో V40e

వివో V40, V40 ప్రోల విజయవంతమైన లాంచ్ తర్వాత V40e అనే కొత్త ఫోన్‌ను మార్కెట్ లోకి తీసుకువచ్చేందుకు సిద్దమయ్యింది వివో. ప్రస్తుతానికి ఈ ఫోన్ గురించి ఎలాంటి వివరాలు లేకున్నా రాబోయే కొన్ని వారాల్లో ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని ప్రకటనలు సూచిస్తున్నాయి.

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved