MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • iPhone 16: రూ. 27 వేలకే ఐఫోన్‌ 16 సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?

iPhone 16: రూ. 27 వేలకే ఐఫోన్‌ 16 సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?

ఐఫోన్‌ కొనుగోలు చేయాలని చాలా మంది ఆశిస్తుంటారు. అయితే దీని ధర కారణంగా వెనుకడుగు వేస్తుంటారు. తక్కువలో తక్కువ ఐఫోన్‌ కొనుగోలు చేయాలంటే రూ. 70 వేలు చెల్లించాల్సిందే. అయితే ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 16పై మంచి డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కేవలం రూ. 27 వేలకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 06 2025, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
iPhone 16

iPhone 16

యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్‌ 16ని లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై మంచి డీల్ లభిస్తోంది. అత్యాధునిక ఏఐ ఆధారిత ఫీచర్లు, ఆపిల్ లేటెస్ట్ A18 చిప్‌సెట్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్‌ లభించనుందంటే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఐఫోన్‌ 16, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 79,900కాగా ప్రస్తుతం 6 శాతం డిస్కౌంట్‌తో రూ. 74,990కి లభిస్తోంది. దీంతో పాటు ఫ్లిప్‌ కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2500 డిస్కౌంట్‌ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్లు ఇక్కడితో ఆగిపోలేదు మీ పాత ఫోన్‌ను ఎక్సేంఛ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 49,950 డిస్కౌంట్‌ పొందొచ్చు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ నాన్-EMI, క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 4వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇలా అన్ని ఆఫర్లతో ఈ ఫోన్‌ను సుమారు రూ. 27 వేలకే పొందొచ్చు. 
 

34
iPhone 16

iPhone 16

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.? 

ఐఫోన్‌ 16 స్మార్ట్‌ ఫోన్‌లో 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్‌+12 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్‌ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌ ఏ18 చిప్‌, 6 కోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 
 

44

ఇక ఈ ఫోన్‌లో బిల్ట్‌ ఇన్‌ స్టీరియో స్పీకర్లను అందించారు. ఈ ఫోన్‌ స్క్రీన్‌ 2556 x 1179 పిక్సెల్‌ రిజల్యూషన్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఓ ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఈ ఫోన్ సొంతం. రెయిర్‌ కెమెరాతో 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లతో అద్భుతమైన విజువల్స్‌ను ఈ స్క్రీన్‌ అందిస్తుంది. తక్కువ ధరలో ఐఫోన్‌ 16ని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్‌ డీల్‌గా చెప్పొచ్చు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
Honor Win Turbo: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు పక్కా.. 10,000mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే !
Recommended image2
Wireless Charging: వైర్‌లెస్ ఛార్జింగ్ ఎలా ప‌నిచేస్తుంది.? దీనివ‌ల్ల ఫోన్ బ్యాట‌రీపై ప్ర‌భావం ప‌డుతుందా.?
Recommended image3
Portronics Vayu: పాకెట్‌లో ప‌ట్టే ఈ ప్రొడ‌క్ట్‌ ఉంటే చాలు.. ఎక్క‌డికైనా బిందాస్‌గా వెళ్లొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved