ఫెస్టివల్ సేల్ : స్టూడెంట్స్ కోసం బెస్ట్ టాప్-10 టాబ్లెట్లు
10 Best Tablets for Students: ప్రస్తుతం భారత్ లో అదిరిపోయే ఆఫర్లతో అమెజాన్, ఫ్లిక్ కార్ట్ సహా పలు ఈ కామర్స్ సైట్లు ఫెస్టివల్ సేల్ తీసుకొచ్చాయి. 2025లో స్కూల్, కాలేజ్ విద్యార్థుల కోసం బెస్ట్ టాప్-10 టాబ్లెట్లు కూడా ఈ సేల్ లో అందుబాటులో ఉన్నాయి.

స్టూడెంట్స్ కోసం బెస్ట్ టాబ్లెట్లు
10 Best Tablets for Students: 2025లో స్కూల్, ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల కోసం మార్కెట్లో కొన్ని అద్భుతమైన ఫీచర్లు, సరసమైన ధరలో టాబ్లెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి నోట్స్ తీసుకోవడం, రీసెర్చ్ చేయడం, టాస్క్‌లను మేనేజ్ చేయడం, ఆన్‌లైన్ క్లాసులకు హాజరు కావడం వంటి అవసరాలకు అనువైనవిగా ఉన్నాయి. అలాగే, అసైన్‌మెంట్లు, లెక్చర్స్, డిజిటల్ రిసోర్సుల సమన్వయం వంటి సవాళ్లను ఎదుర్కొనే విద్యార్థులకు టాబ్లెట్ సరైన పరిష్కారంగా చెప్పవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ టాప్ 10 టాబ్లెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శాంసంగ్ గెలక్సీ ట్యాబ్ ఎస్11 (Samsung Galaxy Tab S11)
• డిస్ప్లే: 27.8 సెంటీమీటర్లు (11 అంగుళాలు) Dynamic AMOLED 2X
• ర్యామ్, స్టోరేజ్: 12GB ర్యామ్ + 128GB స్టోరేజ్
• అసలు ధర ₹91,999 కాగా, ప్రస్తుతం ఆఫర్లతో ₹69,999 (24% తగ్గింపు) అందుబాటులో ఉంది.
• ప్రత్యేకతలు: ఎస్ పెన్ ఇన్-బాక్స్, వేగవంతమైన వైఫై , నోట్స్, స్కెచ్‌లకు అనువైనది.
• డిస్ప్లే క్వాలిటీ, నోట్స్ తీసుకోవడంలో సౌలభ్యం, ఇతర అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
2. ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ 13” (Apple iPad Air 13″ M3 చిప్)
• డిస్ప్లే: 13 ఇంచెస్ లిక్విడ్ రెటినా
• స్టోరేజ్: 128GB
• కెమెరా: 12MP ముందు/వెనుక
• ధర: ₹79,900 కాగా, ప్రస్తుతం సేల్ లో ₹65,999 (17% తగ్గింపు) అందుబాటులో ఉంది.
• ప్రత్యేకతలు: ఆపిల్ ఇంటెలిజెన్స్, టచ్ ఐడి, ఆల్ డే బ్యాటరీ.
• మంచి ప్రాసెసర్, ఆపిల్ డివైజ్‌లతో కనెక్టివిటీతో పాటు మంచి ఫీచర్లు ఉన్నాయి.
3. లెనోవో ఐడియా ట్యాబ్ (Lenovo Idea Tab Mediatek Dimensity 6300)
• డిస్ప్లే: 11 అంగుళాలు, 2.5K, 500 నిట్స్ బ్రైట్నెస్
• ర్యామ్, స్టోరేజ్: 8GB + 256GB (2TB వరకు పెంచుకోవచ్చు)
• ధర: ₹25,000 కాగా, ప్రస్తుత సేల్ లో ₹20,999 (24% తగ్గింపు) ధరలో అందుబాటులో ఉంది.
• ఆండ్రాయిడ్ 15 తో వస్తోంది. డాల్బీ సౌండ్ స్పీకర్లు సహా మంచి ఫీచర్లు ఉన్నాయి.
• మంచి బ్రైట్నెస్ క్వాలిటీ డిస్ప్లే, డైలీ టాస్క్‌లలో స్మూత్ పనితీరును అందిస్తుంది.
4. వన్ ప్లస్ ప్యాడ్ 3 (OnePlus Pad 3 AI Tablet 2025)
• డిస్ప్లే: 13.2 అంగుళాలు, 3.4K, 144Hz
• ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్
• ర్యామ్, స్టోరేజ్: 16జీబీ ర్యామ్, 512జీబీ
• ధర: ₹54,999 కాగా, ప్రస్తుతం ₹52,999 (4% తగ్గింపు)
• ప్రత్యేకతలు: 8 స్పీకర్లు, OnePlus AI, 12140 mAh బ్యాటరీ.
• బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ బ్యాటరీ లైఫ్.
5. శాంసంగ్ గెలక్సీ ట్యబ్ ఎస్10 లైట్ (Samsung Galaxy Tab S10 Lite)
• డిస్ప్లే: 10.9 అంగుళాల TFT LCD
• ర్యామ్, స్టోరేజ్ : 6GB + 128GB
• ధర: ₹36,999 కాగా, ప్రస్తుతం ₹29,499 (20% తగ్గింపు)
• ప్రత్యేకతలు: S Pen ఇన్-బాక్స్, తేలికైన డిజైన్ తో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
• రోజువారీ స్టడీ సెషన్స్‌కు బెస్ట్ టాబ్లెట్ ఇది.
6. లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో (Lenovo Idea Tab Pro 3K Display)
• డిస్ప్లే: 12.7 అంగుళాల 3K, 144Hz
• ర్యామ్, స్టోరేజ్ : 12GB + 256GB
• ధర: ₹48,999 కాగా, ప్రస్తుతం ₹30,999 (47% తగ్గింపు)
• ప్రత్యేకతలు: ఏఐ, జేబీఎల్ స్పీకర్లు, 10200 mAh బ్యాటరీ.
• స్క్రీన్ నాణ్యత, మల్టీటాస్కింగ్ సామర్థ్యం, బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
7.వన్ ప్లస్ ప్యాడ్ 3 (OnePlus Pad 3 Snapdragon Edition)
• డిస్ప్లే: 13.2 అంగుళాలు, 3.4K, 144Hz
• ర్యామ్, స్టోరేజీ: 12GB + 256GB
• ధర: ₹49,999 కాగా, ప్రస్తుతం ₹47,999 (4% తగ్గింపు)
• ప్రత్యేకతలు: స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 12140 mAh బ్యాటరీ.
• పవర్ ఫుల్ ఫాస్ట్ ప్రాసెసర్, అద్భుతమైన ఆడియో సిస్టమ్, బిగ్ బ్యాటరీ వంటి స్పెక్స్ ఉన్నాయి.
8. ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ 11” (Apple iPad Air 11″ M3 చిప్)
• డిస్ప్లే: 11 అంగుళాల లిక్విడ్ రెటినా
• స్టోరేజ్: 128GB
• ధర: ₹59,900 కాగా, ప్రస్తుతం ₹57,549 (23% తగ్గింపు)
• ప్రత్యేకతలు: వైఫై 6ఈ, టచ్ ఐడీ, 12MP కెమెరా సెటప్ ఉంది.
• ప్రొడక్టివిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ కు బెస్ట్ టాబ్లెట్
9. శాంసంగ్ గెలక్సీ ట్యాప్ ఎస్9 ఎఫ్ఈ ప్లస్ (Samsung Galaxy Tab S9 FE+)
• డిస్ప్లే: 12.4 అంగుళాలు
• ర్యామ్, స్టోరేజ్ : 8GB + 128GB (మరింత పెంచుకోవచ్చు)
• ధర: ₹55,999 కాగా, ప్రస్తుతం ₹31,870 (39% తగ్గింపు)
• ప్రత్యేకతలు: IP68 రేటింగ్, ఇన్-బాక్స్ లో ఎస్ పెన్ కూడా ఉంటుంది. బెస్ట్ బిగ్ డిస్ప్లే.
• సూపర్ డిస్ప్లే మీకు మంచి అనుభూతి పంచుతుంది. ఎస్ పెన్ మీ వర్క్ ను మరింత సులభం చేస్తుంది.
10. రెడ్మీ ప్యాడ్ ప్రో (Redmi Pad Pro)
• డిస్ప్లే: 12.1 అంగుళాలు, 120Hz
• ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2
• ధర: ₹24,999 కాగా, ప్రస్తుతం ₹18,999 (24% తగ్గింపు)
• బ్యాటరీ: 10,000 mAh (33+ రోజులు స్టాండ్బై టైమ్ ఉంటుంది)
• ప్రత్యేకతలు: వైఫై 6, హైపర్ ఓఎస్, క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి.
• మంచి బ్యాటరీ లైఫ్, స్టడీ & ఎంటర్‌టైన్‌మెంట్ బెస్ట్ టాబ్లెట్.
విద్యార్థులు టాబ్లెట్ కొనేటప్పుడు చూడాల్సిన అంశాలు ఏంటి?
• డిస్ప్లే: 10 అంగుళాల కంటే పెద్దగా, హై రెజల్యూషన్ ఉండాలి.
• ప్రాసెసర్: ఫాస్ట్ చిప్ (ఎం3, స్నాప్ డ్రాగన్, మీడియా టెక్ లేటెస్ట్ ప్రాసెసర్లు)
• ర్యామ్, స్టోరేజ్ : కనీసం 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉండాలి.
• బ్యాటరీ: కనీసం 8 గంటలు వచ్చేలా ఉండాలి.
• స్టైలస్ సపోర్ట్: ఆపిల్ పెన్సిల్ లేదా ఎస్ పెన్ సపోర్టు ఉండే ట్యాబ్ లతో పనిని మరింత సులభంగా చేసుకోవచ్చు.
• కనెక్టివిటీ: వైఫై 6, 5జీ ఆప్షన్లు ఉంటే ఉత్తమం.
ఈ టాప్ 10 టాబ్లెట్లు 2025లో హైస్కూల్, కాలేజ్ విద్యార్థులకు చదువులో, మల్టీటాస్కింగ్‌లో, ఎంటర్‌టైన్‌మెంట్‌లో బెస్ట్ ఫీచర్లతో ముందువరుసలో ఉన్నాయి.