MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లాంచ్ టైమ్‌లైన్ వచ్చేసింది.. ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఎప్పుడు వస్తోందంటే?

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లాంచ్ టైమ్‌లైన్ వచ్చేసింది.. ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఎప్పుడు వస్తోందంటే?

iPhone 18 Pro Launch: ఆపిల్ లవర్స్ అదిరిపోయే గుడ్ న్యూస్. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో లాంచ్ టైమ్‌లైన్ లీకైంది. సెప్టెంబర్ 9న మెగా ఈవెంట్, కొత్త ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా కూడా రాబోతోంది. పూర్తి వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 14 2026, 10:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆపిల్ లవర్స్‌కు పూనకాలే.. ఐఫోన్ 18 ప్రో సేల్స్ ఎప్పటినుంచో తెలుసా?
Image Credit : ChatGPT

ఆపిల్ లవర్స్‌కు పూనకాలే.. ఐఫోన్ 18 ప్రో సేల్స్ ఎప్పటినుంచో తెలుసా?

ఆపిల్ లవర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) లాంచ్ టైమ్‌లైన్ క్లియర్‌గా వచ్చేసింది. కొత్త ఐఫోన్‌తో పాటు సరికొత్త సాఫ్ట్‌వేర్ ఐఓఎస్ 27 డెవలపర్ బీటాలు కూడా పక్కా ప్లానింగ్ ప్రకారం సాగుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఫస్ట్ పబ్లిక్ బీటా కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిబట్టి చూస్తే ఈసారి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ చాలా స్మూత్‌గా సాగుతున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ నెలలో జరిగే ఆపిల్ స్పెషల్ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్‌లతో పాటు సరికొత్త ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా కూడా లాంచ్ కానుంది. ఈ మోస్ట్ అవేటెడ్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 9, బుధవారం ఉదయం 10 గంటలకు జరగనుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అలాగే సెప్టెంబర్ 11, శుక్రవారం నుంచి ఈ కొత్త డివైజ్‌ల ప్రీ-ఆర్డర్స్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 14, సోమవారం నాడు ఐఓఎస్ 27 జనరల్ రిలీజ్ అవుతుంది. చివరిగా సెప్టెంబర్ 18, శుక్రవారం నాడు ఐఫోన్ 18 ప్రో, ఇతర మోడల్స్ డైరెక్ట్‌గా మార్కెట్లోకి సేల్స్ కోసం రానున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆపిల్ ఐఓఎస్ 27 బీటా అప్‌డేట్
Image Credit : Gemini

ఆపిల్ ఐఓఎస్ 27 బీటా అప్‌డేట్

ఐఫోన్ 18 ప్రోతో పాటు ఐఫోన్ 11 సిరీస్ వరకు ఉన్న పాత మోడల్స్‌లో రన్ అయ్యే ఐఓఎస్ 27 సాఫ్ట్‌వేర్ ప్రస్తుతం డెవలపర్ బీటా స్టేజ్‌లో ఉంది. జూలై 6న బీటా సక్సెస్‌ఫుల్‌గా రిలీజ్ అయింది. ఇది ఆపిల్ పాత రికార్డుల టైమింగ్స్‌తో పక్కాగా మ్యాచ్ అవుతోంది. 

బ్లూమ్‌బెర్గ్ ఎక్స్‌పర్ట్ మార్క్ గుర్మాన్ లాంటి వాళ్లు కూడా ఈసారి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ చాలా స్మూత్‌గా సాగుతోందని చెప్తున్నారు. గత ఏడాది లిక్విడ్ గ్లాస్ డిజైన్ వల్ల పబ్లిక్ బీటా లేట్ అయింది కానీ, ఈసారి జూలై 14న పబ్లిక్ బీటా రావడం పక్కా అని టాక్ నడుస్తోంది.

35
సెప్టెంబర్ 9న ఆపిల్ మెగా ఈవెంట్
Image Credit : AI

సెప్టెంబర్ 9న ఆపిల్ మెగా ఈవెంట్

ఆపిల్ సెప్టెంబర్ కీనోట్ ఈవెంట్ డేట్‌పై ఇండస్ట్రీలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మార్క్ గుర్మాన్ లాంటి వాళ్లు సెప్టెంబర్ 8న ఈవెంట్ ఉంటుందని చెప్తున్నారు. కానీ ఆ రోజు అమెరికాలో లేబర్ డే సెలవు తర్వాత వచ్చే మొదటి వర్కింగ్ డే. ఆపిల్ సాధారణంగా పబ్లిక్ హాలిడేస్ వెంటనే ఈవెంట్స్ పెట్టదు. 

అందుకే సెప్టెంబర్ 9, బుధవారం ఉదయం 10 గంటలకే ఈ మెగా లాంచ్ ఈవెంట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఈవెంట్‌లో కొత్త సీఈఓ జాన్ టెర్నస్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్, ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రాను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. వీటితో పాటు రెండు కొత్త ఆపిల్ వాచెస్ కూడా రాబోతున్నాయి.

45
ప్రీ-ఆర్డర్స్ ఎప్పటి నుంచి అంటే?
Image Credit : Apple

ప్రీ-ఆర్డర్స్ ఎప్పటి నుంచి అంటే?

సెప్టెంబర్ 9న జరిగే కీనోట్ ఈవెంట్‌లో ప్రొడక్ట్స్‌తో పాటు ప్రీ-ఆర్డర్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. ఒకవేళ సెప్టెంబర్ 9న ఈవెంట్ జరిగితే, దానికి తగ్గట్టే సెప్టెంబర్ 11 నుండి ప్రీ-ఆర్డర్స్ ఓపెన్ అవుతాయి. కాలిఫోర్నియా టైమింగ్స్ ప్రకారం ఉదయం 5 గంటలకే బుకింగ్స్ లైవ్ అవుతాయి. మీకు నచ్చిన కలర్, నచ్చిన స్టోరేజ్ వేరియంట్ కావాలంటే మాత్రం ఫాస్ట్‌గా బుక్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆపిల్ కొత్త మోడల్స్ స్టాక్ చాలా వేగంగా సేల్ అయిపోతుంది.

సెప్టెంబర్ 14న ఐఓఎస్ 27 జనరల్ రిలీజ్ కానుంది. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా సెప్టెంబర్ 15 నాటికి యూజర్స్ అందరికీ ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చేస్తుంది.

55
ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా
Image Credit : Apple Hub

ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా

ఈసారి లాంచ్‌లో అందరి కళ్ళు ఆపిల్ తీసుకురాబోతున్న ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ అల్ట్రా' పైనే ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 9 ఈవెంట్‌లో దీనిని అనౌన్స్ చేసినప్పటికీ, వెంటనే మార్కెట్లోకి వస్తుందా లేదా అనేది సస్పెన్స్. గతంలో ఐఫోన్ ఎక్స్ లాంచ్ చేసినప్పుడు కూడా ఆపిల్ దాన్ని నవంబర్ వరకు హోల్డ్‌లో పెట్టింది. 

కొత్త కేటగిరీ ఫోన్ కాబట్టి ఈ ఫోల్డబుల్ ఫోన్ సేల్స్ కొంచెం ఆలస్యం కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ లేట్‌గా వస్తే దీని రివ్యూలు కూడా సేల్స్ డేట్‌కు రెండు మూడు రోజుల ముందే వస్తాయి. కానీ ఐఫోన్ 18 ప్రో మాత్రం అనుకున్నట్లే సెప్టెంబర్ 18 నుంచే డైరెక్ట్‌గా స్టోర్స్‌లో సేల్‌కు రానుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
PM Modi Phone: ప్రధాని మోదీ వాడే ఫోన్ ఏదో తెలుసా? దీని ఫీచర్లు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !
Recommended image2
నీళ్లు తాగ‌మ‌ని గుర్తు చేసే వాట‌ర్ బాటిల్.. బ్లూటూత్ క‌నెక్ష‌న్‌, స్మార్ట్‌ఫోన్‌లో అల‌ర్ట్స్
Recommended image3
Vivo V80 Review: అదిరిపోయే కెమెరా, పవర్ ఫుల్ బ్యాటరీ.. కానీ రూ. 63 వేల ధరతో వీవో V80 కొనొచ్చా?
Related Stories
Recommended image1
Top 5 Low Calorie Beers in India: ఇండియాలో దొరికే టాప్ 5 లో-క్యాలరీ బీర్లు ఏవో తెలుసా? సూపర్ టేస్ట్ !
Recommended image2
Andhra Kashmir: బాబోయ్ ఏపీలో మంచు కురిసే ప్లేస్ ఉందా? ఆంధ్రా కాశ్మీర్ పూర్తి వివరాలు మీకోసం !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved