weight loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ ఫ్రూట్స్ ట్రై చేయండి!
ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. సరైన వ్యాయామం లేకపోవడం, గజిబిజి లైఫ్ స్టైల్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇందుకు కారణం. అయితే మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకోవడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు.

బరువు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. అధిక బరువు వల్ల చాలా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మితంగా తీసుకుంటూ సహజంగా బరువు తగ్గే ప్రయత్నం చేయడం ఉత్తమం. మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకోవడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అనాస పండు
పైనాపిల్ ను అందరూ ఇష్టంగా తింటారు. పండుగా కంటే కూడా జ్యూస్ గా తాగుతుంటారు. పైనాపిల్ బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది. ఇది. 86% నీటిని కలిగి ఉంటుంది. బరువు తగ్గడానికి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం మంచిది.
కివి ఫ్రూట్
కివి ఫ్రూట్ లో విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. రుచి కాస్త తక్కువగా ఉన్నా ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో కివి ప్రూట్ ముందు వరుసలో ఉంటుంది.
అవకాడో
అవకాడో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. మనం రోజూ తినే ఆహారంలో అవకాడో చేర్చుకోవడం ద్వారా బరువు సులువుగా తగ్గొచ్చు.
జామకాయ
జామకాయ బరువు తగ్గడానికి చక్కగా పనిచేస్తుంది. ఒక పండులో 37 క్యాలరీలు ఉంటాయి. ఈ పండు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు కూడా జామకాయ తినడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
సీతాఫలం
సీతాఫలం శరీరానికి అవసరమైన ఫైబర్ కి సహజ మూలం. బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. వీటిని రోజూ వారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరగడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుందని చెబుతున్నారు నిపుణులు.