రోజూ ఒక అరటిపండును తింటే ఇన్ని లాభాలున్నాయా?
అరటిపండ్లు కాలాలతో సంబంధం లేకుండా మార్కెట్ లో దొరుకుతాయి. వీటి ధర కూడా ఎక్కువగా ఏం ఉండదు. అయితే ఈ పండును రోజూ ఒకటి తింటే మీరు ఎన్ని లాభాలను పొందుతారో తెలుసా?
అరటిపండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా వీటిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత చాలా మంది తింటుంటారు. నిజానికి మీరు రోజూ ఒక అరటిపండును తిన్నారంటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. అవును ఒక్క అరటిపండు మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అరటిపండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
అరటిపండ్లలో ఫ్రక్టోజ్, కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్, సుక్రోజ్ వంటి చక్కెరలు మెండుగా ఇవి మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అరటిపండ్లలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది. అరటిపండ్లలో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని హెల్తీగా ఉంచుతాయి.
అరటిపండును తింటే రక్తపోటు పెరుగుతుందన్న భయం కూడా ఉండదు. ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ పండులో ఉండే పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండులోని ఫైబర్ కంటెంట్ కడుపు పూతలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
అరటి పండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది మన ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి. అరటి పండ్లను తింటే మన మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును తొందరగా నింపుతుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. జీవక్రియను పెంచి మీరు హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అరటి పండ్లను తింటే ఎముకలు బలంగా అవుతాయి. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండ్లను రెగ్యులర్ గా తింటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. బలంగా ఉంటాయి. అరటిపండ్లలో విటమిన్ సి, బి6 కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి.