ఒక్క హిట్టు కోసం ఎదురు చూస్తున్న కుర్ర హీరోలు.. ఈ ఏడాదైనా కలిసొస్తుందా..?
టాలీవుడ్(Tollywood) లో యంగ్ స్టార్స్ అంతా నిరాశలో ఉన్నారు. చాలామంది కుర్ర హీరోలకు ఇప్పుడు హిట్ సినిమా లేదు. కొంత మంది హీరోలకు తప్పా.. మేజర్ యంగ్ స్టార్స్.. హిట్ కోసం పాకులాడుతున్నారు. మరి ఈ ఏడాది అయినా వారి ఖాతాలో హిట్ సినిమా పడుతుందా..?
చాలా మంది టాలీవుడ్ యంగ్ హీరోల పరిస్థితి చాలా ధారుణంగా ఉంది. ఒక హిట్టు.. ఒకే ఒక్క హిట్టు.. కావాలంటూ.. యంగ్ స్టార్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని ప్రయోగాలు చేసినా.. సక్సెస్ కు దగ్గర కాలేకపోతున్నారు. ఈ2022 అయినా కలిసొస్తుందన్న ఆశతో ఉన్నారు స్టార్స్. ఈ సారి ఎలాగైనా సాధిస్తాం అంటున్నారు.
హిట్ కోసం పాకులాడుతున్న యంగ్ టాలీవుడ్ హీరోలలో శర్వానంద్(Sharwanand) ముందు వరుసలో ఉన్నాడు. పాపం యంగ్ హీరో.. వరుసగా ప్లాప్ లు మూట కట్టుకుంటున్నాడు. ఎన్నో ఆశలతో రీసెంట్ గా రిలీజ్ అయిన మహాసముద్రం కూడా శర్వాను తీవ్రంగా నిరాశపరిచింది. ఒక రకంగా చెప్పాలంటే మహానుభావుడు సినిమా తరువాత శర్వానంద్ కు హిట్ సినిమా లేదు. ఆ సినిమా తరువాత దాదాపు ఆరు సినిమాలు వచ్చినా.. ఏ సినిమా యంగ్ హీరోకు హిట్ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఒకే ఒక జీవితం సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. పిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది. దీనితో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు శర్వా.. ఈ ఏడాది అయినా హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.
భీష్మ తరువాత నితిన్(Nithin) చేసిన వరుస సినిమాలు ప్లాప్ ల లిస్ట్ లోకి వెళ్ళి పోయాయి. కరోనా టైమ్ లో కూడా భీష్మతో హిట్ కొట్టిన నితిన్.. ఆతరువాత వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కించాడు. కాని సక్సెస్ కాలేకపోయాడు. భీష్మ తరువాత వచ్చిన చెక్,రంగ్ దే , మాస్ట్రో సినిమాలు హ్యాట్రిక్ ప్లాన్ లను నితిన్(Nithin) కు అందించాయి. మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టిన నితిన్...ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసారి సక్సెస్ మిస్ అవ్వను అంటున్నాడు.
ఇక టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య(Naga shaurya) పరిస్థితి అయితే మరీ ధారుణం. ఎప్పుడ్ ఛలో సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టిన యంగ్ స్టార్ హీరో.. ఆతరువాత వరుసగా ఆరు ప్లాప్ లు అందుకున్నాడు. కాకపోతే మధ్యలో సమంత (Samantha) లీడ్ రోల్ చేసిన ఓబేబీ లో ఇంపార్టెంట్ రోలో చేశాడు శౌర్య. ఈ సినిమా హిట్ కొంచెం ఊరట ఇచ్చినా.. హీరోగా తనకు హిట్ లేకపోవడంతో బాగా డిస్సపాయింట్ అయ్యారు. రీసెంట్ గా వచ్చిన వరుడు కావలెను, లక్ష్య సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ముఖ్యంగా తాను ఎంతో కష్టపడి సిక్స్ ప్యాక్ చేసి మరీ లక్ష్య సినిమా చేస్తే.. ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ప్రస్తుతం పోలీసువారి హెచ్చరిక, పలానా అమ్మాయి.. పలానా అబ్బాయి, లాంటి మరో నాలుగు సినిమాలు శౌర్య లిస్ట్ లో ఉన్నాయి. మరి వాటితో అన్నా హిట్ సాధిస్తాడో లేదో చూడాలి.
టాలీవుడ్ లో సిక్స్ ఫీట్.. సిక్స్ ప్యాక్ హీరో అంటే వెంటనే కార్తికేయా(Karthikeya)నే గుర్తుకు వస్తాడు. ఆర్ ఎక్స్ 100 తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కార్తికేయకు.. ఆరేంజ్ హిట్ పడలేదింకా.ఈ సినిమా తరువాత వరుసగా ఆరు సినిమాలు చేస్తే.. అందులో నానీ(Nani) హీరోగా కార్తికేయ విలన్ గా చేసిన గ్యాంగ్ లీడర్ మంచి సక్సెస్ సాధించింది. కొన్ని మటుకు యావరేజ్ అనిపించుకున్నాయి. రీసెంట్ గా వచ్చిన చవుకబురు చల్లగా సినిమా బాగానే ఉన్నా.. కార్తికేయకు మాత్రం మంచి హిట లభించలేదు. ఈసినిమా తరువాత వచ్చిన రాజా విక్రమార్క మాత్ర డిజాస్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు తమిళంలో స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వాలిమైలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు కార్తికేయా (Karthikeya).. ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు. 2022 కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Tej) ను వరుస ప్లాప్ ల తరువాత ఆదుకుంది చిత్రలహరి సినిమా.. ఆ తరువాత వచ్చిన ప్రతీరోజు పండగే సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో దిల్ ఖుష్ అయ్యాడు సాయి తేజ్. కాని ప్రతీరోజు పండగే సినిమా తరువాత మెగా హీరో ఖాతాలో హిట్ లేదు. తరువాత వచ్చి రెండు సినిమాలు ప్లాప్ లిస్ట్ లోకి వెళ్లిపోయాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సాయి ధరమ్ తేజ్ చేసిన సోలో బ్రతుకే సో బెటరు. రిపబ్లిక్ సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. 2021 సాయి తేజ్ కు కలిసి రాలేదు. సినిమాలు ప్లాన్ అవ్వడం.. యాక్సిడెంట్ లో చావు వరకూ వెళ్లి రావడంతో.. ఈ ఏడాది కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్(Sai Tej). రీసెంట్ గా కోలుకున్న తేజు.. తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు.
యంగ్ స్టార్ రాజ్ తరుణ్(Raj Tarun ) కెరీర్ లో ఉయ్యాల జంపాల, కుమారీ 21 ఎఫ్ లాంటి హిట్లు మళ్ళీ పడలేదు. ఈ సినిమాల తరువాత దాదాపు డజను సినిమాలు చేశాడు రాజ్ తరుణ్. కాని ఏ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది లేదు. కొన్ని యావరేజ్ అనిపించుకున్నా.. మరికొన్ని మాత్రం డిజాస్టర్స్ అయ్యయి. కథల ఎంపిక, కెరీర్ పై సరిగా దృష్టి పెట్టకపోవడంతో సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోతున్నాడు రాజ్ తరుణ్ (Raj Tarun). రీసెంట్ గా వచ్చిన అనుభవించు రాజా కూడ నిరాశపరిచింది. దాంతో నెక్ట్స్ చేస్తున్న స్టాండ్ అప్ రాహుల్ తో అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు రాజ్ తరుణ్.
అటు సదీప్ కిషన్(Nikhil, Sandeep Kishan).నిఖిల్ లాంటి హీరోల పరిస్థితి కూడా అలానే ఉంది. నిఖిల్ కు అప్పుడప్పుడు కొన్ని హిట్స్ పరుతున్నాయి.. కాని సందీప్ కిషన్(Sandeep Kishan). పరిస్థితి మాత్రం మరీ దారుణంగా ఉంది. హీరోగా చేసిన ప్రతీ సినిమా ప్లాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోతోంది. రీసెంట్ గా నిను వీడని నీడను నేనే సినిమా పర్వాలేదు అనిపించింది. మళ్ళీ ఆతరువాత వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ కాలేకపోయాయి. రీసెంట్ గా వచ్చిన గల్లీ రౌడీ తీవ్రంగా నిరాశపరిచింది సందీప్ ను. అందుకే తన లక్ ను తమిళంలో పరీక్షించుకుంటున్నాడు సందీప్. అక్కర రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
అటు నిఖిల్(Nikhil) కూడా సీక్వెల్స్ ఫార్ములాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. తనకు మంచి సక్సెస్ ఇచ్చిన కార్తికేయ సినిమా ను సీక్వెల్ చేస్తున్నాడు నిఖిల్. దాని తరువాత తన కెరీర్ కు ఊపునిచ్చిన స్వామిరారా కు కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. మరీ డిజాస్టర్స్ లిస్ట్ లో లేకపోయినా.. నిఖిల్ సినిమాలు పర్వాలేదు అనిపించుకుంటన్నాయి. కాని కెరీర్ ను టర్న్ చేసే సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు నిఖిల్(Nikhil). ఇలా మరికొంత మంది యంగ్ హీరోస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు.