- Home
- Entertainment
- స్టార్ హీరో అయ్యే వరకు తన కొడుకని చెప్పుకోలేదు..హరికృష్ణ, నందమూరి ఫ్యామిలీపై ఎన్టీఆర్ ఒపీనియన్ ఇదే
స్టార్ హీరో అయ్యే వరకు తన కొడుకని చెప్పుకోలేదు..హరికృష్ణ, నందమూరి ఫ్యామిలీపై ఎన్టీఆర్ ఒపీనియన్ ఇదే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ స్థాయి మారిపోయింది. ప్రస్తుతం తారక్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు.

NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ స్థాయి మారిపోయింది. ప్రస్తుతం తారక్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. దేవర, వార్ 2 చిత్రాలతో ఎన్టీఆర్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
NTR
ఎన్టీఆర్ నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో గుర్తింపు లభించింది. ఆది, సింహాద్రి చిత్రాలు ఎన్టీఆర్ స్థాయినే మార్చేశాయి. ఒక్కసారిగా టాలీవుడ్ లో తారక్ టాప్ లీగ్ లో చేరిపోయాడు. అయితే తారక్ కి నందమూరి ఫ్యామిలీకి మధ్య ఏదో తెలియని గీత ఉందని తరచుగా రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి.
ఓ ఇంటర్వ్యూలో తారక్ ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఓపెన్ గా అన్ని విషయాలు చెప్పాడు. యాంకర్ ప్రశ్నిస్తూ.. మీకు స్టార్ డమ్ వచ్చేంతవరకు హరికృష్ణ మిమల్ని కొడుకుగా ప్రకటించలేదు కదా.. ఆ విషయంలో మీకు కోపం లేదా అని అడిగారు. దీనికి ఎన్టీఆర్ చాలా కూల్ గా సమాధానం ఇచ్చాడు.
బహుశా సందర్భం రాలేదేమో.. దీనిని ఇలా పాజిటివ్ గా కూడా ఆలోచించొచ్చు కదా అని తారక్ అన్నాడు. తన తండ్రిపై ఎలాంటి కోపం లేదు అని తారక్ తెలిపాడు. నా తండ్రి అంటే నాకు పిచ్చ ఇష్టం. ఎలాంటి కోపం లేదు. నా కుటుంబంపై నాకు ఎలాంటి కోపం లేదు. ఇది పరిస్థితుల ప్రభావం మాత్రమే అని తారక్ తెలిపాడు. బాలకృష్ణ బాబాయ్ నాతో ఎంత బావుంటారో నాకు మాత్రమే తెలుసు అని తారక్ తెలిపాడు.
తండ్రి విషయాన్ని పక్కన పెడితే.. ఎన్టీఆర్ స్టార్ కాకపోయి ఉంటే నందమూరి ఫ్యామిలీ పట్టించుకునేవాళ్ళా అని యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కూడా తారక్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. సరే అండీ.. నేను హీరో కాదు.. ఏదైనా బిజినెస్ లో సక్సెస్ అయినా నన్ను పలకరించే వాళ్ళు కదా.. పోనీ బిజినెస్ కూడా కాదు.. నేను అసలేమీ కాదు అనుకుందాం.
మా తాతగారు ఎన్టీఆర్ నన్ను పలకరించడానికి 11 ఏళ్ళు పట్టింది. మా బాబాయ్ లు, మేనత్తలకు 20 ఏళ్ళు పట్టేదేమో. ఎప్పటికైనా కుటుంబం కలవాల్సిందే కదా అని జూ. ఎన్టీఆర్ అన్నాడు. ఆ విషయంలో తనకి ఎలాంటి బాధ లేదని తారక్ తెలిపాడు. పాజిటివ్ గా తీసుకుంటే ఎలాంటి బాధలు ఉండవని తెలిపాడు.
తన తండ్రి తరుపున నందమూరి ఫ్యామిలీ మొత్తం 11 మంది అయితే.. మా అమ్మ సైడు మొత్తం 9 మంది ఉన్నారు అని ఎన్టీఆర్ తెలిపాడు. నాకు అటు అయినా ఇటు అయినా పెద్ద కుటుంబమే అని తారక్ నవ్వుతూ తెలిపాడు.