MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మిస్ యూనివర్స్ ఇండియా 2024గా రియా సింఘా, ఎవరీ యంగ్ లేడీ?

మిస్ యూనివర్స్ ఇండియా 2024గా రియా సింఘా, ఎవరీ యంగ్ లేడీ?

మిస్ యూనివర్స్ 2024 ఇండియా టైటిల్ రియా సింఘా కైవసం చేసుకుంది. ఇంతకీ ఎవరీ యంగ్ బ్యూటీ? ఆమె వివరాలు చూద్దాం...  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 24 2024, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రాజస్థాన్‌లోని జైపూర్‌ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ రియా సింఘా సొంతం చేసుకుంది. పోటీలో 51 మంది ఫైనలిస్టులను వెనక్కి నెట్టి, గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024గా నిలిచింది.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

36వ కంటెస్టెంట్‌గా పాల్గొన్న రియా గ్రాండ్ ఫినాలేలో తన అందం, ప్రతిభతో న్యాయనిర్ణేతలు, ప్రేక్షకులను అలరించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో ఆమెకు ప్రతిష్టాత్మకమైన బిరుదుతో పాటు ఈ ఏడాది చివర్లో మెక్సికోలో జరగనున్న మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది.

తాను మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, తన కష్టానికి, అంకితభావానికి ఇది నిదర్శనమని రియా మీడియాతో తెలియజేసింది.
 

35

ఇక ప్రాంజల్ ప్రియా నుండి రియా సింఘాకి గట్టి పోటీ ఎదురైంది. ప్రాంజల్ పియా మొదటి రన్నరప్‌గా నిలిచింది. చావి వెర్గ్ రెండవ రన్నరప్‌గా నిలిచారు. సుష్మితా రాయ్, రూప్‌ఫుజానో విసో వరుసగా మూడవ, నాల్గవ స్థానాల్లో నిలిచారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రతి కంటెస్టెంట్ ప్రత్యేకతను చాటుకున్నారు.

రియా విజయం సాధించిన నేపథ్యంలో అభిమానుల, ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2015 విజేత, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించారు. మిస్ యూనివర్స్ పోటీలో భారత్ విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 

45

జైపూర్‌లో ఆదివారం ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఇండియన్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. అంతర్జాతీయ స్థాయి అందాల పోటీకి రియా సిద్ధమవుతుండగా, ఆమె ప్రయాణం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. తన దేశం మద్దతుతో, మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో రియా సింఘా ముందుకు వెళుతుంది. 

రియా సింఘా ఫాదర్ బ్రిజేష్ సింఘా వ్యాపారవేత్త. ఆయన ఈస్టోర్ ఫ్యాక్టరీ పేరుతో ఆన్లైన్ బిజినెస్ నడుపుతున్నారు. రియా సింఘా తల్లి పేరు రీటా సింఘా. మోడలింగ్, యాక్టింగ్ అనే రియా సింఘాకు మొదటి నుండి ఇష్టం. రియా సింఘా అభిరుచిని తల్లి రీటా సింఘా ప్రోత్సహించింది. రియా సింఘా సక్సెస్ లో తల్లి పాత్ర ఎంతగానో ఉంది. 

 

55

రియా సింఘా ఒక ప్రక్క చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ చేస్తుంది. మిస్ యూనివర్స్ 2024 ఇండియా టైటిల్ గెలవడం ద్వారా అరుదైన మైలురాయికి చేరుకుంది. మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున పాల్గొనే అవకాశం దక్కించుకుంది. 

 

బిగ్ బాస్ హౌజ్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Sapna Choudhary: ఫోటోలు, వీడియోలతో భర్తపై కోర్టుకెక్కిన సింగర్..ఇద్దరి డేటింగ్, పెళ్లి గురించి తెలుసా
Recommended image2
Bharathiraja Telugu Films: అలీకి వాచిపోయేలా చెంపదెబ్బలు, చిరంజీవి అంటే పిచ్చి..భారతీరాజా తెలుగు సినిమాలు
Recommended image3
Rajasekhar: బాలయ్య కోసం కెరీర్‌ని రిస్క్ లో పెడుతున్న రాజశేఖర్‌.. లైఫ్‌లో మొదటిసారి డేరింగ్‌ స్టెప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved