కరోనా నుంచి స్పీడుగా కోలుకునేందుకు 'కెవ్వు కేక' భామ అద్బుత చిట్కా
‘‘కరోనా నుంచి, క్వారంటైన్ గదిలో నుంచి బయటకు వచ్చేశాను’’ అని ఆనందంగా చెప్పుకొచ్చింది బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈ నెల మొదట్లో మలైకా అరోరా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. 13 రోజుల క్వారంటైన్ తర్వాత నెగటివ్‌గా బయటకు వచ్చారు. ‘‘ఎక్కువ బాధ పడకుండా, ఇబ్బందిపడకుండా ఈ వైరస్ నుంచి కోలుకున్నాను. అందరి ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు మలైకా అరోరా. అయితే అదే సమయంలో ఆమె తను ఇంత కూల్ గా, కరోనా నుంచి బయిటపడటానికి కారణాలను విశ్లేషించుకున్నానంది. ఆ విషయమై ఆమె మీడియాతో మాట్లాడింది. ఆమె చెప్పినదాంట్లో చాలా ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. ఆమె ఏమి చెప్పిందో చూద్దాం.
‘చయ్య చయ్య’ వంటి ఐటెంసాంగ్స్‌తో అటు బాలీవుడ్‌కు, కెవ్వుకేక అంటూ ఇటు టాలీవుడ్‌కు పరిచయం చేయాల్సిన పనిలేని పేరు మలైకా అరోరా.
వయస్సుతో పాటే అందం పెరుగుతూ వస్తోంది ఈమెకు. లేటు వయసులోనూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఫొటోషూట్‌లతో అభిమానులను మురిపిస్తూ ఉంటుంది.
అయితే అంత ఫిటెనెస్ గా ఉండే ఆమె కరోనా బారిన పడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అఫ్ కోర్స్ ఆమెను కూడా అదే షాక్ కు గురి చేసింది.
ఈనెల 7వ తారీకున కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందంటూ ప్రకటించిన ఐటెం బాంబ్ మలైకా అరోరా ప్రకటించింది. అప్పటి నుండి పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యినట్లుగా చెప్పింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫీలింగ్స్ ను షేర్ చేస్తూ వచ్చిన ఈ అమ్మడు తాజాగా తనకు నెగటివ్ వచ్చిందనే విషయాన్ని తెలియజేసింది.
జూన్ 11వ తారీకున మలైక అరోరా ఉంటున్న బిల్డింగ్ లో ఒక వ్యక్తికి వైరస్ పాజిటివ్ అని వెళ్లడయ్యింది. దాంతో అప్పటి నుండి కూడా మలైక ఇంటికే పరిమితం అయ్యింది. పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి పిల్లలతో మరియు తన పెంపుడు కుక్కతో టైంను స్పెండ్ చేస్తున్నట్లుగా పేర్కొంది.
నేను ఎప్పుడైతే కరోనా అని తెలుసుకున్నానో అప్పుడే నా మైండ్ లో మా కుటుంబం మెదిలింది. వాళ్లు సేఫ్ గా ఉండాలని నేను రకరకాల జాగ్రత్తలు తీసుకున్నాను. నా రూమ్ కే నేను పరిమితం అయ్యాను.
ఆ పరిస్దితుల్లో నేను ప్రత్యేకమైన ఫెసిలిటీలు ఏమీ కోరుకోలేదు. నన్ను నేనే బాగు పరుచుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు మొదట వచ్చిన లక్షణాలు ..కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, కొద్దిగా దగ్గు. దాంతో నేను అర్దం చేసుకున్నాను.
నేను షూటింగ్ వెళ్లాను..అక్కడ కొద్ది మందికి పాజిటివ్ వచ్చింది. ఆ లిస్ట్ లో నేను ఉన్నాను అని అర్దం చేసుకున్నాను. మొదట్లో కాస్తంత విసుగ్గా ఉంది.
ఆ షాక్ నుంచి కోరుకోవటానికి టైమ్ పట్టింది. ఎందుకంటే నేను దానికి ప్రిపేర్ గా లేను. దానికి తోడు స్ట్రాంగ్ మెడిసన్స్ వాడటం వల్ల వీక్ అయ్యాను. రోజుకు 18 గంటలు నిద్రపోయేదాన్ని.
భోజనానికి మాత్రమే లేచేదాన్ని. ఆ తర్వాత కాస్త నడిచేదాన్ని. మా డాక్టర్స్ చెప్పింది ఒకటే..పూర్తి రెస్ట్. అలాగే నీళ్లు తాగమని.
మా వాళ్లు నా గుమ్మం బయిట ఫుడ్ పెట్టేవారు. అంతా డిస్పోజబుల్ దాంట్లో ఇచ్చేవారు. దాంతో భయపడాల్సిన అవసరం లేకపోయింది.
చాలా కాలంగా నేను వెజిటేరియన్. ఆ అలవాట్లు మార్చుకోవాల్సి వచ్చింది. మా డాక్టర్ ...చికెన్ సూప్, కొంచెం డైరీ ప్రొడక్ట్స్ తీసుకోమన్నారు.
అలాగే ఆన్ లైన్ మెడిసన్స్, సలహాలు పై నేను ఆధారపడలేదు. కేవలం మా ఫ్యామిలీ డాక్టర్ సూచనలు మేరకే నేను ట్రీట్మెంట్ తీసుకున్నారు. అందుకే కోలుకున్నా.
రోజూ వర్కవుట్స్, యోగా చేసే నేనే తట్టుకోలేకపోయాను. అంటే అర్దం చేసుకోండి..మీరు ఇలాంటి మహమ్మారి నుంచి బయిటపడాలంటే మన శరీరాన్ని స్ట్రాంగ్ గా చేసుకోవాలి అని చెప్పుకొచ్చింది.
ఇక పర్శనల్ విషయాలకి వస్తే.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ తమ్ముడు అర్భాజ్‌ఖాన్‌తో వివాహబంధానికి మలైకా కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే గత కొంతకాలంగా మలైకా.. తనకంటే చిన్నవాడైన అర్జున్‌కపూర్‌తో రెండో పెళ్లికి సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది.
ఫార్టీ ప్లస్ వయసులోనూ మలైకా టీనేజీ మిసమిసలపై బోయ్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. తనకంటే వయసులో ఎంతో చిన్న వాడైన అర్జున్ కపూర్ ని బుట్టలో వేసేంతగా మలైకా తన రూపాన్ని మార్చేసుకుంది.
ఇలా అందాలు పెంచటం కోసం ఈ అమ్మడు ఏ రేంజులో శ్రమిస్తోందో చూస్తేనే షాకిస్తోంది. మలైకా నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తుంది.
అలాగే యోగ ధ్యానం విషయంలో కఠోరంగా నియమాలు పాటిస్తుంది. అందుకే తన దేహ అందాల్ని ఆ రేంజులో మెయింటెయిన్ చేయగలుగుతోందన్నది అభిమానులు అంటూంటారు.
ఈ లేటు వయసు ఘాటు భామ రెగ్యులర్ గా యోగ సాధన చేస్తూ ఆ రూపాన్ని కాపాడుకుంటుంది. అప్పుడప్పుడూ యోగ ప్రాక్టీస్ చేస్తూ సోషల్ మీడియాలతో ప్రత్యక్షమవుతుంది.
ఇలా యోగ చేయడమే కాదు.. అవసరం మేర ఆహార నియమాల్ని పాటిస్తానని మలైకా చెబుతోంది. సమయం దాటాక తిండి తినను. సాయంత్రాలు 7.30 తర్వాత అస్సలు ఆహారం జోలికి వెళ్లనని మలైకా క్లియర్ కట్ గా చెప్పేసింది.
తినే పదార్థాల్లో నూనెల శాతం సున్నా.. అవసరం మేర నెయ్యిని మాత్రమే ఉపయోగిస్తానని తెలిపింది. ఇంకా ఈ లేటు వయసు నాటీ తన అందానికి సంబంధించిన రహస్యాలు లీక్ చేస్తుందేమో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
చాలా కాలంగా తన అందచందాలతో, ఆటపాటలతో సినీ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతూ కెరీర్ ని మలుచుకుంటూ వెను తిరిగి చూడకుండా దూసుకుపోతోంది మలైకా అరోరా.
తెలుగులో పవన్ కళ్యాణ్‌తో ‘‘కెవ్వు కేక’’ లాంటి సూపర్ డూపర్ సాంగ్‌లో చిందులేసి కుర్రకారుకు మతిపోగోట్టిన ఈమె సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడూ హల్ చల్ చేస్తూంటుంది.
తన అందచందాల ఆరబోత పోగ్రాం పెట్టుకుని మగాళ్ల మతిపోగొడుతూంటుది. ఆమె తాజా ఫొటో షూట్ నుంచి కొన్ని హాట్ ఫొటోలు, ఆమె విశేషాలతో ఎప్పుడూ ఫ్యాన్స్ కు పండగే.
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్భజ్ ఖాన్‌తో మలైకా మొదటి భర్త కాగా కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు.
ఇక ప్రస్తుతం ఆమె ప్రేమిస్తున్న అర్జున్ కపూర్..ఆమె కన్నా 12 సంవత్సరాలు చిన్నవాడు కావటం గమనార్హం. మొత్తానికి వీరిద్దరూ త్వరలోనే వివాహానికి సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.
అర్జున్‌కపూర్, మలైకా అరోరాలు గతకొంతకాలంగా డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట ఇప్పటినుంచే పెళ్లి ప్రణాళికలు సిద్ధం చేసుకుని పెట్టుకుంది.
అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో ఉన్నారని వారి సాన్నిహిత్యం చూస్తే అర్థం అవుతుంది. కానీ, ఆ విషయాన్ని ఎప్పుడూ ప్రకటించలేదు ఈ ఇద్దరూ. ప్రతి సందర్భంలో ఒకరి మీద మరొకరికి ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటున్నారు.
‘ఛయ్యా ఛయ్యా’ పాటతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు నటి మలైకా అరోరా. ఈ ఒక్క పాటతో ఆమె కెరీర్ దూసుకెళ్లిపోయింది. అయితే ఈ పాటను షూట్ సమయంలో ఆమె చాలా తీవ్రంగా గాయపడ్డారట. ఈ విషయాన్ని ఓ రియాల్టీ షోలో వెల్లడించారు.
నాలుగున్నర పదుల వయసైనా కుర్ర హీరోయిన్స్‌తో గ్లామర్ విషయంలో పోటీ పడుతూండటం మలైకా అరోరా స్పెషాలిటీ... అదే గ్లామర్‌తో అర్జున్ కపూర్‌ని కట్టిపడేసిందేమో అంటారు ఆమె ఫ్యాన్స్.