- Home
- Entertainment
- Yashoda Movie Review: యశోద ప్రీమియర్ టాక్... సోలోగా దున్నేసిన సమంత మరో ఓ బేబీ అవుతుందా!
Yashoda Movie Review: యశోద ప్రీమియర్ టాక్... సోలోగా దున్నేసిన సమంత మరో ఓ బేబీ అవుతుందా!
స్టార్ లేడీ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం యశోద. దర్శక ద్వయం హరి-హరీష్ రూపొందించిన యశోద నేడు గ్రాండ్ గా విడుదలైంది. యశోద మూవీ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకోగా మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ప్రీమియర్స్ ప్రదర్శన ముగిసిన నేపథ్యంలో యశోద అంచనాలు అందుకుందా లేదా చూద్దాం

Yashoda Movie Review
లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సమంతకు మంచి ట్రాక్ ఉంది. ఆమె నటించిన యూ టర్న్, ఓ బేబీ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ఓ బేబీ భారీ వసూళ్లతో సమంత కెరీర్ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సమంతకు ఉన్న స్టార్డమ్ రీత్యా మంచి కథ పడితే సోలోగా సిల్వర్ స్క్రీన్ ని దున్నేయగల సత్తా ఉన్న హీరోయిన్.
Yashoda Movie Review
అందుకే ఆమెతో భారీ బడ్జెట్ తో యశోద ప్లాన్ చేశారు. ఒక హీరోయిన్ ప్రధాన చిత్రాన్ని ఇంత పెద్ద స్థాయిలో నిర్మించడం, పాన్ ఇండియా మూవీగా విడుదల చేయడం గొప్ప విషయం. యశోద బడ్జెట్, ప్రీ రిలీజ్ రూ. 50 కోట్లకు పైమాటే అని ట్రేడ్ వర్గాల అంచనా. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మినహా ఆ స్థాయి వసూళ్లు సాధించడం కష్టం. ప్రీమియర్స్ ప్రదర్శన ముగియడంతో యశోద టాక్ బయటకు వచ్చింది.
Yashoda Movie Review
కథ
పేద అమ్మాయిల అవసరాలను క్యాష్ చేసుకొని వాళ్లకు డబ్బు ఆశ చూపి సరోగసీ మదర్స్ గా మారుస్తూ ఉంటారు. ధనవంతుల పిల్లల్ని గర్భంలో మోసే యంత్రాలు చేస్తారు. అయితే అది అంతటితో ఆగదు. దానికి వెనుక పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లు చేతులు కలిపిన మాఫియా ఉంటుంది. ఆ మాఫియాకు బలైన యువతుల్లో యశోద కూడా ఒకరు. అసలు సరోగసీ పేరుతో అక్కడ జరుగుతున్న వ్యాపారం ఏమిటీ? తల్లులుగా మారిన యువతులను ఏం చేస్తున్నారు? యశోదకు తెలిసిన నిజం ఏమిటీ? అంత పెద్ద మాఫియాను యశోద ఒంటరిగా ఎలా ఎదిరించింది? అనేది మిగతా కథ..
Yashoda Movie Review
యశోద చిత్రానికి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. మెజారిటీ ఆడియన్స్ మూవీ బాగుందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. యశోద కథ, సమంత పెర్ఫార్మన్స్, మణిశర్మ మ్యూజిక్, నిర్మాణ విలువలు , కెమెరా వర్క్ వంటి మేజర్ అంశాలు ఆకట్టుకున్నాయనేది ప్రీమియర్స్ ద్వారా వస్తున్న రిపోర్ట్.
Yashoda Movie Review
ఓ క్రైమ్ యాక్షన్ స్టోరీకి ఎమోషన్స్ జోడించి దర్శకులు హరి-హరీష్ ఆకర్షణీయంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా సాగుతుంది. కథనం, సన్నివేశాలు ఏం జరగబోతుందన్న ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మరో ఆకర్షణ. ఇంటర్వెల్ కి ముందు 20 నిమిషాలు సెకండ్ హాఫ్ మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ కలిగేలా గ్రిప్పింగ్ గా నడిపించారు.
యశోద మూవీలో అందరూ ప్రధానంగా మాట్లాడుతున్న అంశం సమంత పెర్ఫార్మన్స్. యాక్షన్ సన్నివేశాల్లో సమంత ఎనర్జీ, మెరుపు కదలికలు గూస్ బంప్స్ కలిగిస్తున్నాయి. ఎమోషనల్, థ్రిల్లింగ్ సన్నివేశాల్లో సమంత అద్భుతంగా నటించారు. యశోదగా సమంత మరో మంచి పాత్ర తన ఖాతాలో వేసుకుందన్న మాట వినిపిస్తోంది.
ఇక సెకండ్ హాఫ్ ని యాక్షన్ తో పాటు ఎమోషనల్ అంశాలతో నడిపించారు. మాతృత్వం గొప్పతనం, అది వ్యాపారంగా మారిన వైనం. సరోగసీకి బలవుతున్న అమాయకపు మహిళలు... ఇలా అనేక కోణాలు టచ్ చేశారు. యశోద ఆలోచింపజేసే చిత్రంగా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుందన్న అభిప్రాయాలు వెల్లడవుతోంది.
మణిశర్మ బీజీఎం సినిమాకు మరో అసెట్. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మెప్పిస్తాయి. ఇతర కీలక రోల్స్ చేసిన వరలక్ష్మీ, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ తమ నటనతో సినిమాను ఇంట్రెస్టింగ్ గా మలిచారు. క్యాస్ట్ విషయంలో కూడా పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మొత్తంగా యశోద చిత్రంతో సమంత మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది అంటున్నారు. సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కమర్షియల్ గా ఎంత మేరకు ఆడుతుందనేది చూడాలి. వరల్డ్ వైడ్ యశోద 5 భాషల్లో విడుదల చేశారు.