MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సోనియాకు ఇచ్చిపడేసిన యష్మి...దద్దోజనంలా మారిన పృధ్వి, బిగ్ బాస్ లో చీఫ్ పాలిటిక్స్

సోనియాకు ఇచ్చిపడేసిన యష్మి...దద్దోజనంలా మారిన పృధ్వి, బిగ్ బాస్ లో చీఫ్ పాలిటిక్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాలుగో వారం కరెక్ట్ గా కిక్కెక్కిస్తోంది. కంటెస్టెట్ల బుర్రకు పదును పెడుతూ.. కాస్త చిరాకు పెడుతూ.. వారి సత్తా ఏంటో పరీక్షస్తున్నాడు బిగ్ బాస్.  

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 24 2024, 11:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ ఎపిసోడ్ కు రచ్చ రచ్చ అవుతోంది. ఆడియన్స్ కు ఎక్కడ లేని కిక్కు ఇస్తోంది. ఎప్పుడు  ఎం జరుగుతుందా అని ఉత్కంఠను రేపుతోంది. ఈక్రమంలోనే హౌస్ లో జరిగే గోడవలు.. కంటెస్టెంట్స్ పెర్పామెన్స్.. అందులోను పాలిటాక్స్ బిగ్ బాస్ హౌస్ ను రసవత్తరంగా మార్చుతున్నాయి. 

26

ఈక్రమంలో నాలుగో వారంలోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. కంటెస్టెంట్స్ కు మరిన్ని అగ్ని పరీక్షలు సిద్ధం చేస్తున్నాయి. ఈక్రమంలోన బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఆడుతున్న రాంగ్ గేమ్ తో పాటు.. ఆమె పెత్తనం.. పృధ్వి, నిఖిల్ లను తన చెప్పు చేతల్లో పెట్టుకోవడం.. ఇవన్నీ ఆడియన్స్ గమనిస్తూనే ఉన్నారు. 

ఇక తాజాగ ఎపిసోడ్ లో కాంతార కొత్త చీఫ్ గా సీత ఎన్నిక అయ్యింది. ఇందుకోసం జరిగిన టాస్క్ లో హోరా హోరీ నడిచింది. ఎవరిక వారు  ఎక్కడా తక్కుండా తమ పెర్ఫామన్స్ చూపించారు. సీత కాస్త  తెలివిగా అందరి నుంచి తప్పించుకుని.. చీఫ్ గా ఎన్నికయయింది. ఈ క్రమంలోనే చాలా విషయాలు హౌస్ లో జరిగాయి. 

36

ఇక నామినేషన్స్ అయిపోయిన తరువాత సోనియా ‌- యష్మి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సోనియాను హౌస్ లో అడ్డుకునే వారు లేరు అని అనుకుంటున్న టైమ్ లో .. ఆమెకు సరైన సమాధానం చెపుతూ.. గట్టిగా ఇచ్చిపడేసింది యష్మి. హౌస్ లో ఫిజికల్ గా గట్టిగా ఉన్న  పృధ్వి, నిఖిల్ లను తన బాడీ గార్డ్ లుగా మార్చుకుంది సోనియా. 

ఇక హౌస్ లో ఎవరు సోనియాను ఏమన్నా.. వీరిద్దరు వారిపై మాటల దాడి చేసే విధంగా ప్లాన్ చేసుకుంది. అందులో నిఖిల్ కాస్త ఆలోచించి అడుగు బేస్తున్నాడు కాని.. పృధ్వి అయితే.. మరీ.. కన్ను మిన్ను కానకుండా.. సోనియాను ఎవరైనా ఏమననా అంటే వారిని టార్గెట్ చేసే విధంగా గేమ్ ఆడుతున్నాడు. 

46

అంత సత్తా ఉంచుకుని.. ఫిజికల్, మెంటల్ స్ట్రెంత్ ఉంచుకుని.. పృధ్వి చీఫ్ గేమ్ ఆడుతున్నాడు. తనకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను వదిలేసి.. మణికంఠ లాంటివారిపై తన బలం చూపిస్తున్నాడు. ఇక సోనియాతో అసలు గేమ్ ఆడటంలేదు. ఆమెను నామినేట్ చేయడం తరువాత సంగతి.. సోనియాను నామినేట్ చేసిన వారిపై కూడా అక్కసు వెళ్లగగ్గుతున్నాడు.

ఈక్రమంలో బిగ్ బాస్ నామినేషన్స్ సందర్భంలో.. సోనియాను యష్మి నామినేట్ చేసింది. తన టీమ్ లో ఉండకుండా.. పృధ్వి, నిఖిల్ లతో కలిసి ఉంటూ.. తన క్లైమ్ కు అన్యాయం చేసిందంటూ.. యష్మి ఆరోపణలు చేసింది. అయితే ఈ విషయంలో సోనియా గట్టిగా డిఫెన్స్ చేసుకోవడంతో పాటు.. పృధ్వి, నిఖిల్ ను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. 

56

ఇలా చేస్తే ఎవరు తన జోలికి రారు అనకుందేమో కాని.. యష్మి ఈ విషయంలో సోనియా కు గట్టిగా ఇచ్చిపడేసింది. ఒక రకంగా అంత స్ట్రాంగా ఉన్న పృధ్వికి , సోనియాకు ఇద్దరికి చుక్కులు చూపించింది. పాయింట్ టు పాయింట్ వివరిస్తూ.. కడిగిపడేసింది. ఆతరువాత ఎమోషనల్ అయ్యి.. ఏడ్చేసింది. 

ఈక్రమంలో అభయ్ వెళ్ళిపోవడంతో.. సెకండ్ చీఫ్ కు బిగ్ బాస్ ఓటింగ్ పెట్టారు. ఎవరైతే చీఫ్ గా అర్హుుల కారో... వారి బొమ్మలను పగలగొట్టాలి అని గేమ్ పెట్టారు బిగ్ బాస్. ఇక సోనియా తన అక్కసు వెళ్ళగగ్గుతూ.. నబిల్ పేరును చెప్పగా.. పృధ్వి.. చాలా చీఫ్ గేమ్ ఆడుతూ.. ఇఫ్పుడిప్పుడేు స్ట్రాంగ్ అవుతున్న మణికంఠ చీఫ్ అవ్వకుండా ఆపాడు. టీమ్ ను నడపలేవు అని విమర్శించాడు. 

66
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

ఇక సీత ప్రేరణ, యష్మిలను చీఫ్ అవ్వకుండా నామినేట్ చేయగా.. నైనిక.. విష్ణు ప్రియను నామినేట్ చేసింది.ఇక పృధ్వి మణికంఠను చీఫ్ అవ్వకుండా నామినేట్ చేయగా.. నిఖిల్ రెండు సార్లు హ్యామర్ను సాధించి.. సోనియాకు ఫేవర్ గా ఉన్నటే ఉంటూ..డబుల్ గేమ్ ఆడారు.

 ఇలా బిగ్ బాస్ హౌస్ లో చిల్లర గేమ్ లు ఆడుతూ.. ముఖ్యంగా సోనియా టీమ్ చేస్తున్న రచ్చ మరీ దారుణంగా మారింది. ఇక నిఖిల్, పృధ్వీలను దద్దమ్మలుగా ఆడియన్స్ చూస్తున్నారు. సోనియా కు బంట్లుగా మారారంటూ విమర్శిస్తున్నారు. యష్మి గేమ్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు.

ఇక మణింకంఠ ఎంత ఎదగాలని చూస్తున్నా.. అంత తొక్కేస్తున్నారని ఆడియన్స్ మండిపడుతున్నారు.  చూడాలి.. ఈ నాలుగో వారం ఏకంటెస్టెంట్ వ్యవహారం.. ఇబ్బందులు తెస్తుంది.. ఎలిమినేషన్ కు దారి తీస్తుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు ఇవిగో.. ఆమె ఆనందం చూశారా, ఇద్దరినీ ఇలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు
Recommended image2
Rajini Kamal Movie: నాగార్జున అయిపొయింది, రజినీకాంత్ కి విలన్ గా మరో స్టార్ హీరో..ఇది కూడా బెడిసికొడుతుందా ?
Recommended image3
విజయ్ దేవరకొండకి రష్మిక ఇచ్చిన ఫస్ట్ వార్నింగ్ ఇదే, అల్లు అరవింద్ ఫోన్ చేసి మరీ..భయంతో ఏం చేశాడో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved