- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: మాజీ భార్యకి తల తిరిగిపోయే సమాధానం ఇచ్చిన యష్.. మాళవిక ని రెచ్చగొడుతున్న అభి!
Ennenno Janmala Bandham: మాజీ భార్యకి తల తిరిగిపోయే సమాధానం ఇచ్చిన యష్.. మాళవిక ని రెచ్చగొడుతున్న అభి!
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. తన కాపురం లో ఎన్ని అపార్ధాలు చోటు చేసుకున్నా బంధాన్ని విడిపోకుండా కాపాడుకుంటూ వస్తున్న ఒక స్త్రీమూర్తి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో డ్రైవర్ డ్యూటీ తమరు చేస్తున్నారేంటి కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసే తీరిక కూడా లేదా నీ మధ్య భార్యకి అంటూ వేళాకోళంగా మాట్లాడుతుంది మాళవిక. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటాడు యష్. ఇట్స్ మై బిజినెస్ నువ్వు దొంగ పెళ్లి చేసుకున్నావని ఎవరికి తెలియదు తొందరలోనే అది పెటాకులు అయిపోతుందని కూడా ఎవరికి తెలియదు.నీ జాతకం ఏంటో కానీ మాజీ భర్త అనే బిరుదు నిన్ను వదలనుంటుంది పూర్ యశోదర్ అని వెటకారంగా నవ్వుతుంది మాళవిక. నిన్ను చూస్తే జాలేస్తుంది.
నీ మాటలతో నన్ను హర్ట్ చేయాలని చూస్తున్నావు కానీ నీ వల్ల కావడం లేదు నిజానికి పట్టవలసింది నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయి నువ్వు సుఖపడింది ఏముంది? పెళ్లి లేదు తాళిలేకుండా పరాయి మగవాడి పంచన చేరావు. నీ సొంత తమ్ముడు,నీ సొంత కూతురు కూడా నిన్ను చీకొడుతున్నారు అసలు ఏం బతుకు నీది నువ్వు ఒక పెద్ద సున్నా అంటూ మాళవిక తల తిరిగిపోయేలాగా సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు యష్. మరోవైపు ఆలోచనలో పడ్డ మాళవిక ఏదో జరిగింది లేకపోతే వేద స్కూల్ కి కాకుండా ఉండదు యష్ అంత చిరాకుగా ఉండడు అనుకుంటుంది.
ఏం జరిగింది? ఎందుకంత మూడీగా ఉన్నావు అంటాడు అభి. యష్ దగ్గరికి వెళ్ళాను అంటుంది మాళవిక. ఏం మళ్ళీ అతని మీదకి గాలి మళ్ళిందా అంటాడు అభి. కాదు అంటూ జరిగిందంతా చెప్తుంది మాళవిక. మన ప్లాన్ వర్క్ అవుట్ అయింది తను వేదకు దూరం అవడమే కాకుండా ఖుషి ని కూడా దూరం చేస్తున్నాడు అనుకుంటాడు అభి. వాళ్ళిద్దరికీ ఏదో చెడినట్లుగా ఉంది అంటుంది మాళవిక.అదంతా మనకెందుకు కానీ ఖుషిని నువ్వు తెచ్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనిపిస్తుంది అంటాడు అభి. ఎలా అంటుంది మాళవిక. ఎన్నాళ్ళు అంటే వేద ఉండేది ఖుషి ని తల్లిలా చూసుకునేది కాబట్టి అక్కడ ఉండనిచ్చాము.
ఇప్పుడు యష్ చూసుకుంటున్నాడు అంటే అతని వల్ల ఏమవుతుంది నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా నీ బిడ్డని తెచ్చుకునే ప్రయత్నం చెయ్యు అంటాడు అభి.ఖుషి నాతో రావటానికి ఒప్పుకుంటుందా అంటూ అనుమాన పడుతుంది మాళవిక. నీ వెంట వచ్చేలాగా నువ్వే చేసుకోవాలి నువ్వు తన తల్లి వే కదా ఖుషిని అక్కడే వదిలేస్తే వేద పట్టించుకోకపోతే పిచ్చిది అయిపోతుంది. తనని ఇక్కడికి తెచ్చుకో మనమంతా ఒక ఫ్యామిలీ అంటాడు అభి. ఇప్పుడు ఖుషి అక్కడ ఉండడం కరెక్ట్ కాదు ఎలా అయినా తెచ్చుకోవాలి అంటుంది మాళవిక.
తొందర్లోనే నువ్వు పిచ్చివాడివి అయిపోయి ఫుట్పాత్ మీదికి వచ్చేలాగా చేస్తాను అనుకుంటాడు అభి. మరోవైపు మన యష్ సౌత్ ఇండియా బిజినెస్ ఛాంబర్ కి ప్రెసిడెంట్ అయ్యాడు అంటూ అందరికీ ఆనందంగా చెప్తాడు వసంత్. అందరూ ఎంతో సంతోషిస్తారు యష్ కి కంగ్రాట్స్ చెప్తారు. సాయంత్రం ఫంక్షన్ కి మనం అందరం వెళ్ళాలి అంటూ ఆనంద పడిపోతుంది మాలిని.అక్కడికి చాలామంది వస్తారు అందుకే గ్రాండ్ గా రావాలి అని వేదకి చెప్తాడు వసంత్. ఆయన గారి స్టేటస్ కి ఏ మాత్రం తగ్గకుండా గ్రాండ్ గా ఉండాలి కదా అంటుంది వేద. మన ఇద్దరికీ మ్యాచింగ్ డ్రెస్ ఉండాలా, ఇద్దరూ చేతులు పట్టుకొని నడవాలా అంటూ ఏవేవో ప్రశ్నలు వేస్తుంది.
నీ ఓవరేక్షన్ ఆపు ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చింది నాకు దీంట్లో నీకు ఎలాంటి సంబంధం లేదు అంటూ భార్యని కసురుకుంటాడు యష్.అసలు నిన్ననాలి పొద్దున్నే ఇంట్లో పంచాయతీ పెట్టావు అంటూ వసంత్ ని కూడా కసురుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అని బాధపడతారు రత్నం దంపతులు. ఆయన సంగతి తెలిసిందే కదా వదిలేయండి అంటూ భర్తని వెనకేసుకొస్తుంది వేద. గదిలోకి వచ్చిన యష్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటుందట నాకా, ఆ వివిన్ గాడికా మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటుంది అనుకుంటాడు.
నా కెరియర్లో ఎంత ఎత్తు ఎదిగినా ఈ బాధ పోవటం లేదు అప్పుడు మాళవిక ఇప్పుడు ఈ వేద. అయినా ఎందుకు నేనే బాధపడాలి నన్ను బాధ పెట్టిన అందరికీ ఒక గుణపాఠం చెప్పాలి అనుకుంటాడు. నా లైఫ్ లో ఎవరు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నేను లైఫ్ లో కృంగిపోను అని రుజువు చేయాలి అనుకుంటాడు. మరోవైపు రెడీ అయిన యష్ పదండి వెళ్దాము అని రత్నం వాళ్లతో అంటాడు.వేద పార్లర్ కి వెళ్ళింది వచ్చాక అందరం కలిసి వెళ్దాము అంటుంది మాలిని. మీరు తర్వాత రండి తొందర ఏమీ లేదు నేను వసంత్ బయలుదేరుతాను అంటాడు యష్.
వదినకి నీతో రావాలని ఉంటుంది కదా కాసేపు వెయిట్ చేద్దాం అంటాడు వసంత్. నోరు మూసుకో ఈ మధ్య సలహాలు ఎక్కువైపోయాయి అంటూ వసంత మీద కోప్పడతాడు యష్. వేరే దారి లేక యష్ తో బయలుదేరుతాడు వసంత్. వాళ్లు వెళ్లిన వెంటనే వస్తుంది వేద. ఆమెని చూసిన మాలిని బంగారు తల్లి లాగా ఉన్నావు అంటుంది మాలిని. పార్టీకి టైం అవుతుంది అంటూ భర్తని పిలుస్తుంది వేద. యష్ వెళ్ళిపోయాడని చెప్తుంది మాలిని. తరువాయి భాగంలో యష్ కి బలవంతంగా బ్రేస్లెట్ పెడుతుంది వేద. అక్కడ ఉన్న వాళ్ళందరూ నైస్ గిఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ వైఫ్ అంటూ అప్రిషియేట్ చేస్తారు.