Ennenno Janmala Bandham: బయటపడ్డ షాకింగ్ నిజం.. ఖుషిని దూరంగా పడేసిన యష్!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janamala Bandam) సీరియల్ ప్రేమ యొక్క గొప్పతనం అనే నేపథ్యంలో కొనసాగుతోంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో తెలుసుకుందాం.

మాళవిక ఫ్రెండ్స్ యశోదర్ (Yashodhar) పక్కన ఉండగా వీరిద్దరి ప్రేమాయణం గురించి ఫన్నీగా మాట్లాడుకుంటారు. దాంతో యశోదర్ ఇప్పుడు అంత సీన్ లేదు. ఆమె అంటే నాకు అసహ్యం అని ఇన్ డైరెక్టుగా చెబుతాడు. దాంతో మాళవిక (Malavika) సేమ్ ఫీలింగ్ అంటుంది. దాంతో యశోదర్ ఇంకొక్క క్షణం కూడా ఈ పార్టీలో ఉండనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత అభిమన్యు (Abhimanyu) నీతో కాసేపు పర్సనల్ గా మాట్లాడాలి అని యశోదర్ ను ఒక చోటికి తీసుకు వెళతాడు. ఇక అభిమన్యు నా కూతురు నా నుంచి లాకున్నావ్ అని అంటాడు. దాంతో యశోదర్ (Yashodhar) నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటాడు.
దాంతో అభిమన్యు (Abhimanyu) నిజం నిప్పు లాంటిది అని అంటాడు. అదే క్రమంలో నువ్వు కలవరించే ఖుషి నా కూతురు నా రక్తం పంచుకుని పుట్టిన కూతురు అని అంటాడు. దాంతో యశోదర్ ఒక్కసారిగా స్టన్ అవుతాడు. దాంతో యశోదర్ (Yashodhar) నీ మాటలు ఏ మాత్రం నమ్మను అని అంటాడు.
ఇక అభిమన్యు (Abhimanyu) నువ్వు అనుకుంటున్నట్టు ఖుషి పుట్టిన తర్వాత మాళవిక తో నాకు ఎఫైర్ నడవలేదు. ఖుషి పుట్టక ముందు నుంచి ఆ ఎఫైర్ నడిచింది అని చెబుతాడు. దాంతో ఒక్కసారిగా యశోదర్ కు (Yashodhar) గుండె బద్దలయినంత పని అవుతుంది.
అంతేకాకుండా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి షాపింగ్ కి వెళ్తున్నా అని చెప్పి మాళవిక (Malavika) నన్ను కలవడానికి వచ్చేది అని అభిమన్యు చెబుతాడు. ఆ మాట తెలిసి ఇంటికి వచ్చిన యశోదర్ (Yashodhar) ఎంతో చిరాకు పడుతూ.. ఖుషి దగ్గరకు రాగ నెట్టి పడేస్తాడు.
ఇక యష్ (Yash) ప్రవర్తన చూసిన వేద నీ అంత దుర్మార్గుడు లేడని అనరాని మాటలు అంటుంది. కానీ యష్ అవేమి పట్టించుకోకుండా అయోమయం లో ఉంటాడు. ఆ తర్వాత వేద (Vedha) కదలడం లేదు మెదలడం లేదు ఉన్నట్టుండి ఏమైంది అని ఆలోచిస్తుంది.
ఆ తర్వాత వేద (Vedha) కు బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చే విషయం తెలుస్తుంది. ఆ విషయాన్ని యశోదర్ కి నవ్వుతూ చెబుతుంది. దాంతో యశోదర్ (Yashodhar) నువ్వు పిచ్చి దానివి నీకు ఎవరు ఇస్తారు అని అంటాడు.