- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: ఖుషి పేరు మీద అభిమన్యు కంపెనీ.. మాళవికను కత్తితో పొడవటానికి వెళ్లిన యష్!
Ennenno Janmala Bandham: ఖుషి పేరు మీద అభిమన్యు కంపెనీ.. మాళవికను కత్తితో పొడవటానికి వెళ్లిన యష్!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala bandam) సీరియల్ తండ్రి కూతుర్ల అనుబంధం మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక తాగి ఇంటికి వచ్చిన యష్ (Yash) ను ఖుషి పట్ల మీరు దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి అని వేద (Vedha) నిలదీస్తుంది. కనీసం నీ మనసులో బాధ ఏమిటో మీకు నచ్చిన వారితో అయినా షేర్ చేసుకోండి అని అంటుంది. ఇక యష్ ఆ మాటలు పట్టించుకోకుండా నువ్వు నా మీద జాలి చూపించక్కర్లేదు అని అంటాడు.
ఆ తర్వాత వేద (Khushi) ఖుషి ను కారులో స్కూల్ కి తీసుకొని వెళుతుండగా ఖుషి దిగులుగా ఉంటుంది. ఇక వేద మీ నాన్నకు తలనొప్పి రావడం వల్లే అలా ప్రవర్తించాడు. అంతేకాకుండా నామీద మీ నానమ్మ మీద కూడా కోపడ్డాడు అని వేద (Vedha) కవర్ చేస్తుంది.
మరోవైపు అభిమన్యు (Abhimanyu) కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాడు. అంతే కాకుండా దానికి ఖుషి ఇండస్ట్రీస్ అని పేరు పెడతాడు. దాంతో యష్ కి అది నచ్చక చంపేస్తాను వాడిని అని కోప్పడుతూ ఉంటాడు. ఈ లోపు ఖుషి యష్ (Yash) కి ఫోన్ చేసి సారీ డాడీ అని చెబుతుంది. దాంతో ఒక్క సరిగా ఎమోషనల్ అవుతాడు.
ఇక ఆ తర్వాత వేద (Vedha) యష్ ను అర్జెంట్ పని ఒక చోటికి రమ్మని చెబుతుంది. ఇక యష్ వేద వాళ్ళ దగ్గరకు వస్తాడు. ఖుషి (Khushi) బెలూన్ లతో వచ్చి హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని చెబుతోంది. అంతేకాకుండా నేను ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే నన్ను క్షమించండి డాడీ అని కౌగిలించుకుంటుంది.
ఇక ఆ క్రమంలో వేద (Vedha) ఒక మగాడికి మంచి తండ్రి అవడం కన్నా ఇంకొక ఆనందం లేదని అంటుంది. ఖుషి యష్ కోసం ఒక కేకు ను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక యష్ (Yash) సారీ అమ్మ అని ఖుషి ను హాగ్ చేసుకుంటాడు.