- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: వేదకు విడాకులు ఇవ్వబోతున్న యష్.. జరుగబోయేదాని గురించి అయోమయంలో వసంత్!
Ennenno Janmala Bandham: వేదకు విడాకులు ఇవ్వబోతున్న యష్.. జరుగబోయేదాని గురించి అయోమయంలో వసంత్!
Ennenno Janmala Bandham: ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడుతున్న భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో బ్రహ్మముడిని ఎందుకు విప్పేస్తారు అలాగే ఉంచేయొచ్చు కదా నేను నా భర్త ఆ బ్రహ్మముడిలాగే ముడి పడిపోవాలి అనుకుంటుంది వేద. నాకు ఎలా దగ్గరవ్వాలని నువ్వు, నీకు ఎలా దూరం అవ్వాలి అని నేను ఇద్దరం పెయిన్ ఫీల్ అవుతున్నాం. కానీ ఏం చేయటం నీ సంతోషం కోసం ఇలా చేయక తప్పడం లేదు ఐ యాం హెల్ప్లెస్ అనుకుంటాడు యష్.
యష్ ఇంకా రాలేదు అని అతనికి ఫోన్ చేస్తుంది వేద. ఆఫీసులో పని ఎక్కువగా ఉంది అందుకే రాలేకపోయాను అంటాడు యష్. సరే త్వరగా వచ్చేయండి మీకు ఇష్టమైన వంటకాలు అన్ని వండి మీ భార్య మీ కోసం ఎదురుచూస్తుంది అంటుంది వేద. ఇప్పుడే బయలుదేరుతాను అని ఫోన్ పెట్టేస్తాడు యష్. నేను ఇచ్చే సర్ప్రైజ్ కోసం రెక్కలు కట్టుకొని వస్తూ ఉంటారు అని ఆనంద పడిపోతుంది వేద. కారు దిగిన యష్ ఇంటికి వెళ్లకుండా బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు.
లేట్ నైట్ అయినా కూడా గదిలో లైట్ ఆగకపోవటం చూసి పాపం వేద ఇంకా పడుకోలేనట్లుగా ఉంది నాకోసం వెయిట్ చేస్తున్నట్లుగా ఉంది అనుకుంటూ లోపలికి వెళ్తాడు. యష్ వచ్చేటప్పటికి నిద్రలోకి జారుకుంటుంది వేద. డెకరేట్ చేసిన రూమ్ ని, వేదని చూసి బాధపడతాడు యష్. నువ్వు నా నుంచి దూరమైతేనే నీ లైఫ్ ఇంకా బాగుంటుంది అందుకే ఒక డెసిషన్ తీసుకున్నాను అనుకుంటాడు యష్. మరోవైపు తెల్లవారుతూనే ఆఫీస్ కి బయలుదేరుతాడు యష్.
నాన్న ఏరి అని తల్లిని అడుగుతాడు. వాకింగ్ కి వెళ్లినట్లున్నారు ఏమైనా చెప్పమంటావా, అయినా ఇంత తొందరగా ఆఫీసుకు బయలుదేరావేమీ అని అడుగుతుంది మాలిని. కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పిన యష్ నేను రేపు అమెరికా వెళ్ళిపోతున్నాను అంటూ షాక్ ఇస్తాడు. ఒక్కసారిగా కంగారుపడిన మాలిని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు అప్పుడే అమెరికా ప్రయాణం ఏంటి? అదీ ఇంత సడన్గా అంటుంది. వేదని తీసుకు వెళ్తున్నావా అని కూడా అడుగుతుంది.
లేదు పది రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అంటాడు యష్. పది రోజులేనా అయితే పర్వాలేదులే వేద ని కూడా ఒప్పిద్దాము అంటుంది. యష్ వెళ్ళిపోయిన తర్వాత వేదకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుంటుంది మాలిని. మరోవైపు మెలకువ వచ్చిన వేద గదిలో జస్ట్ లేకపోవడం చూసి రాత్రి రాలేదేమో అనుకుంటుంది. అదే విషయం మాలినిని అడిగితే పొద్దున్నే పని ఉందని ఆఫీస్ కి వెళ్ళిపోయాడు టిఫిన్ కూడా చేయలేదు అంటుంది.
అలా ఎంప్టీ స్టమక్ తో వెళ్ళకూడదు అత్తయ్య టిఫిన్ చేసిన తర్వాత టాబ్లెట్ కూడా వేసుకోవాలి లేకపోతే ప్రాబ్లం అవుతుంది అంటుంది వేద. నేను చెప్పానా వేదా లేకపోతే యష్ కి ఒక్క పూట కూడా గడవదు.. అమ్మ వేద అర్జెంటుగా పాస్పోర్టు రెడీ చేసుకో అంటాడు రత్నం. పాస్పోర్ట్ ఏంటి అని ఆయామేయంగా అడుగుతుంది వేద. జరిగిందంతా చెప్తాడు రత్నం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో యష్ ని ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదు మీరిద్దరూ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి అంటాడు రత్నం. తన గదిలోకి వెళ్లిన వేద సడన్గా ఈ అమెరికా ప్రయాణం ఏంటి మళ్లీ కొత్త పరీక్షా? అని బాధగా అనుకుంటుంది. మరోవైపు వసంత్ ని కొన్ని పేపర్స్ మీద సైన్ చేయమంటాడు యష్. ఏంటివి అని అడుగుతాడు వసంత్. చెప్తే గాని చేయవా అంటాడు యష్.
అలాంటిదేమీ లేదు అంటూ సైన్ చేసేస్తాడు వసంత్. వసంత్ కి కంగ్రాట్స్ చెప్తాడు యష్. నాకెందుకు కంగ్రాట్స్ అని అయోమయంగా అడుగుతాడు వసంత్. ఇప్పుడు ఈ కంపెనీ నీదే నా పోస్ట్ ని నీకు ఇస్తున్నాను నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. ఇంట్లో వాళ్లకి పది రోజుల్లోనే చెప్పాను కానీ శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు యష్. ఏంటి జోక్ చేస్తున్నావా అంటూ కోప్పడతాడు వసంత్. అంతలోనే లాయర్ వచ్చి డైవర్స్ పేపర్ కి ఇచ్చి వెళ్ళిపోతాడు.
డైవర్స్ పేపర్స్ ఎందుకు అంటాడు వసంత్. నాకు, మీ వేద వదినకి అంటాడు యష్. నీకేమైనా పిచ్చి పట్టిందా ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అంటూ కోపంతో రగిలిపోతాడు వసంత్. ఇంతలోనే వేద ఫోన్ చేసి అమెరికా వెళ్తున్నారా నాకు కనీసం చెప్పలేదు అని అడుగుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.