- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: వేదకి నిజం చెప్పాలనుకున్న యాష్.. మాళవికతో యష్ మాట్లాడిన మాటలు వేద వినిందా?
Ennenno Janmala Bandham: వేదకి నిజం చెప్పాలనుకున్న యాష్.. మాళవికతో యష్ మాట్లాడిన మాటలు వేద వినిందా?
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 22వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. ఖుషి వేదతో కథ చెప్తూ, అమ్మ అక్కడ ఒక విలన్ ఉన్నాడు విలన్ పెద్ద తప్పు చేశాడు అది హీరోకి తెలుస్తుంది అని అంటుంది. అప్పుడు వేద,ఇక్కడి నుంచి కథ నేను చెప్తాను అప్పుడు ఆ హీరోకి తప్పు తెలిసినప్పుడు విలన్ కి పనిష్మెంట్ ఇస్తాడు కదా అని అనగా, కాదమ్మా హీరో వీళ్ళని కాపాడుతాడు పైగా వీళ్ళని కాపాడిన విషయం హీరోయిన్ కి చెప్పడు హీరోయిన్ చాలా మంచిదమ్మా హీరో అంటే చాలా ఇష్టం కానీ హీరో చెప్పకపోవడం తప్పు కదా హీరో బ్యాడ్ కదా అని అనగా, యష్ కోపం తో, ఖుషి చదువుకోవాల్సిన సమయంలో ఏంటి ఈ కథలు.లోపలికి వెళ్ళు అని అరుస్తాడు. ఖుషి బాధగా ఉంటుంది. వెళ్ళమన్నాను కదా అని మళ్ళీ అరుస్తాడు యష్.ఇంక ఖుషి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వేద, యష్ దగ్గరికి వచ్చి, చిన్న పిల్లలతో అలాగే ఎందుకు మాట్లాడుతున్నారు మీకు టెన్షన్స్ ఉన్నాయని తెలుసు కావాలంటే నా మీద అరండి చిన్న పాప మీద కాదు అని అనగా ఇదంతా నీ వల్లే వచ్చింది
దాన్ని అలా తయారు చేస్తున్నావు అని యష్ అంటాడు. అసలు ఇప్పుడేమైందని? మీరు ఏమైనా అనండి కానీ మాట ఖుషి వరకు వెళ్తే నేను ఊరుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద. అప్పుడు వేద ఖుషి దగ్గరికి వెళ్లి ఎందుకమ్మా అలా ఉన్నావు రా వెళ్లి పడుకుందాము అని అనగా, ఇప్పుడు నాన్న ఎందుకు అంత కోపంగా ఉన్నారు నేనేమీ అనలేదు కదా అని అంటుంది. దానికి వేద, నాన్న పని చేసుకుంటున్నారు కదా అక్కడకి వెళ్లి మనం కథలు చెప్పుకుంటున్నామని అలాగున్నారు అంతే కానీ నీ మీద కోపం కాదు సరేనా అని అంటుంది. దానికి ఖుషి అవునా సరే అని అంటుంది. ఇంక వెళ్లి పడుకుందామా అని వేదా అనగా, నాన్న లేకపోతే నేను పడుకోను కదా నాకు నిద్ర రాదు అని అంటుంది. దానికి వేదా, నాకు కూడా నిద్ర రాదు అని అంటుంది.
అప్పుడు ఖుషి, నిజంగా నీకు రాదా అమ్మా అని అనగా ఇట్స్ ఏ గర్ల్ సీక్రెట్ అని వేదా అంటుంది. ఆ తర్వాత యష్ జరిగిన విషయం అంతా ఆలోచిస్తూ అనవసరంగా ఖుషిని తిట్టినట్టున్నాను. ఈ మధ్య నాకు ఏమవుతుంది ఎప్పుడు ఖుషి నీ ఒక్క మాట కూడా అనలేదు పాపం బాధపడి ఉంటుంది. వేదా కూడా బాధపడే ఉంటుంది మరి ఖుషి తల్లి కదా అని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు ఖుషి వేదతో, అయితే నువ్వు వెళ్లి నాన్నని పిలమ్మ అని అనగా నువ్వు వెళ్లి పిలు నేను బయట వెళ్లి పరిస్థితి ఎలా ఉన్నాదో చూసి నీకు చెప్తాను అప్పుడు రా అని అంటుంది.అప్పుడు వేద బయటకు వచ్చి యష్ ని చూస్తూ, పాపం ఆక్సిడెంట్ ఎవరు చేశారో తెలియక అతన్ని పట్టుకోడానికి చాలా కష్టపడుతున్నట్టు ఉన్నారు. ఖుషి డిస్టర్బ్ చేసేసరికి అరిచినట్టున్నారు. ఖుషి ని అన్నందుకు నేను అరిచేసాను పాపం సారీ అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
అప్పుడు యష్ వేద వైపు చూస్తాడు. అప్పుడు వేద యష్ నుంచి కళ్ళు తిప్పుతూ మంచినీళ్లు తాగుతుంది. ఇంతలో ఖుషి అక్కడికి వచ్చి మమ్మీ వెళ్ళనా అని అనగా వెళ్ళు అని అంటుంది వేద. అప్పుడు ఖుషి యష్ దగ్గరికి వెళ్లి హద్దుకుంటూ, డాడీ సారీ మీరు ఏదో వర్క్ లో ఉన్నారట తెలియక కథలు చెబుతూ నిన్ను విసిగించాను.మమ్మీ చెప్పింది నువ్వు టెన్షన్ లో ఉన్నావని నన్ను క్షమించు అని అనగా, సారీ అమ్మ నేనే నేను క్షమాపణ అడగాలి ఏదో తెలియక అరిచాను అని దగ్గరకు తీసుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండడం చూసి వేద ఎంతో ఆనందపడుతుంది. అక్కడికి వచ్చి నేను కూడా సారీ ఇందాక నా ఖుషి అన్నాను కాదు మన ఖుషి అని అంటుంది వేద. అప్పుడు ఖుషి డాడీ వెళ్లి పడుకుందాము అని అనగా, మీరు వెళ్ళండి నేను వస్తాను అని అంటాడు యష్. డాడీ నువ్వు లేకపోతే అమ్మ కూడా నిద్ర పట్టదట అని అనగా నేనెప్పుడూ అలా చెప్పాను అని వేద అంటుంది.
ఇందాకే చెప్పావు కదా అమ్మ అని ఖుషి అనగా ముగ్గురు వెళ్లి పడుకుంటారు. పడుకున్నప్పుడు ఖుషి, డాడీ నాకు కథ చెప్పవా అంటే నాకు కథలు రావు మీ అమ్మని చెప్పమను అని అంటాడు యష్. ఖుషి ఎవరిని అడిగితే వాళ్లే చెప్పాలి అని వేద అనగా, అయితే నేను ఒక లిటిల్ ప్రిన్సెస్ గురించి కథ చెప్తాను అని అంటాడు. అప్పుడు యష్ కథ చెప్తూ, ఆ లిటిల్ ప్రిన్సెస్ చాలా మంచిది. బాగా చదువుకుంటాది స్కూల్లో బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా వచ్చింది అని అనగా, అయితే లిటిల్ ప్రిన్సెస్ ని నేనే అని ఖుషి అంటుంది.
అప్పుడు వేద, అవును మా చిన్న యువరాణివి నువ్వే కదా అని అనగా, నేను చాలా లక్కీ తెలుసా మీలాంటి అమ్మ నాన్నలు ఉన్నందుకు అలాగే మీరు కూడా లక్కీ ఎందుకంటే నేను దొరికినందుకు అని ఖుషి అంటుంది. అప్పుడు వేద, నీకు మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టమని అడగగా ఇద్దరు చేతులను పట్టుకుని మీరిద్దరూ నాకు చాలా ఇష్టం. నాతోనే ఎప్పుడూ ఉంటానని మీరు ప్రామిస్ చేయండి అని ఖుషి అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మేము ఎప్పుడు నీతోనే ఉంటాము అని ప్రామిస్ చేస్తారు. తర్వాత వేద, ఖుషిలు పడుకుంటూ ఉండగా యష్ కి వేదా మాటలు గుర్తొచ్చి గదిలో నుంచి బయటకు వస్తాడు.
హాల్లో ఆలోచిస్తూ, అత్తయ్య మావయ్య నన్ను సొంత కొడుకులా చూసుకుంటున్నారు.వేద అయితే నా మీద పూర్తి భరోసాతో ఉన్నది నేను ఇలా చేయడం మంచిది కాదు. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను ఇప్పుడే జరిగిన విషయం వేద కి చెప్పేయడం మంచిదేమో అని అనుకుంటాడు యష్. వేద దగ్గరికి వచ్చి నిద్ర లేపుదాం అనేసరికి మాళవిక యష్ కి ఫోన్ చేస్తుంది. అప్పుడు యష్ హాల్లోకి వచ్చి ఎందుకు ఫోన్ చేశావు అని అడగగా, చాలా థాంక్స్ నీ మీద నమ్మకంతోనే నేను ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను. ఆది అయితే చాలా భయపడిపోయాడు.
ఏవో నచ్చచెప్పి పడుకోపెట్టాను అని అనగా ఇప్పుడైనా నిజం చెప్పు నేను తనకోసం ప్రాణాలైనా ఇస్తానని ఆదికి చెప్పు. అలాగే మరో విషయం నేను వేద దగ్గర ఇంక ఈ నిజాన్ని దాయాలి అనుకోవడం లేదు ఇప్పుడే చెప్పేద్దామనుకుంటున్నాను అని అనగా, నీకు ఏమైనా పిచ్చా యాక్సిడెంట్ జరిగింది వేద వాళ్ల అమ్మకి అని అంటుంది మాళవిక. అందుకే నేను ఇప్పుడు వరకు ఆలోచిస్తున్నాను ఇంక చెప్పేద్దామని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వేద ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!