- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: యష్ కుటుంబాన్ని చంపడానికి వచ్చిన రౌడీలు.. మళ్లీ ఫెయిల్ అయిన అభిమన్యు, మాళవిక ప్లాన్!
Ennenno Janmala Bandham: యష్ కుటుంబాన్ని చంపడానికి వచ్చిన రౌడీలు.. మళ్లీ ఫెయిల్ అయిన అభిమన్యు, మాళవిక ప్లాన్!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 29వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ఖుషి (Khushi) స్కూల్ లో పేరెంట్స్ ఈవెంట్ కు మాళవిక, వేద దంపతులు వచ్చి అక్కడ పక్కన కూర్చుంటారు. ఆ క్రమంలో యష్ (Yash) ను స్కూల్లో టీచర్ ఈ రోజు మొత్తం మీ పాప తో ఎంజాయ్ చేయండి. మీకోసం కూల్ డ్రింక్స్ స్నాక్స్ కూడా అరెంజ్ చేసాము అని అంటారు.
దాంతో యశోదర్ (Yashodhar) కూల్ డ్రింక్ అంట వేస్తావా? అని వేదను ఆట పట్టిస్తాడు. దాంతో వేద చిరాకు పడుతుంది. ఇక మొదటి కాన్సెప్ట్ స్టూడెంట్ తల్లిదండ్రులు వాళ్ల మొదటి ప్రేమ అనుభవం గురించి స్టేజ్ పై చెప్పడం. ఇక మొదటిగా స్టేజ్ పైకి యష్ దంపతులను ఇన్వైట్ చేస్తారు. ఇక స్టేజ్ మీదకి వెళ్ళిన యష్ వేద (Vedha) ను ఫన్నీగా వర్ణిస్తూ ఉంటాడు.
అంతేకాకుండా నా భార్య ఏమీ తెలియని ఉత్తమ అమాయకురాలు అని చెబుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న వేద (Vedha) యష్ పై కోపం పడుతూ ఉంటుంది. ఇక నా కూతుర్ని ఈరోజు ఇలా చూడగలుగుతున్నాను అంటే? దానికి కారణం డాక్టర్ వేద ఖుషి (Khushi) అమ్మ అంటూ ప్రౌడ్ గా చెబుతాడు.
ఇక చివరిలో యష్ (Yash) మాటలు విన్న వేద ఎంతో ఆనంద పడుతుంది. ఇక తర్వాత గేమ్ భార్యలకు భర్తలు నగలు అలంకరించాలి. ఆ గేమ్ వేద (Vedha) దంపతులు ఆడడానికి ఒకరికొకరు చిరాకు పడుతూ ఉంటారు. ఈలోగా అక్కడకు ఖుషి నువ్వు మమ్మీకి నగలు పెడితే చూడాలని ఉంది డాడీ అని అంటుంది.
ఇక యష్ (Yash) వేద ను నగల తో అందంగా అలంకరించుతూ ఉంటాడు. అది చూసిన మాళవిక, అభి ఏమాత్రం జీర్ణించుకోలేక పోతుంటారు. ఇక వేద ఆ సమయంలో ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ క్రమంలో యష్ వేద (Vedha) కు దిష్టి చుక్క కూడా పెడతాడు.
తరువాయి భాగం లో వేద (Vedha) ఫ్యామిలీ ఆనందంగా కారు లో ఇంటికి వెళుతూ ఉండగా అనుకోకుండా కొంతమంది రౌడీలు యష్ (Yash) ను కత్తి తో పొడవటానికి చూస్తారు. కానీ యష్ వాళ్ళ మీద ఫైట్ చేసి వాళ్లని ఒక రేంజ్ లో ఇరగ దీస్తాడు. ఇదంతా అభి కుట్ర అని అర్థమవుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.