- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: పాపం.. యష్ చెంప పగలగొట్టిన వేద.. భార్యను భరించలేకపోతున్న భర్త!
Ennenno Janmala Bandham: పాపం.. యష్ చెంప పగలగొట్టిన వేద.. భార్యను భరించలేకపోతున్న భర్త!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno janmala bandam) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే యష్ (Yash), వేదలు ఒకరికొకరు కౌగిలించుకొని షవర్ లో తడుస్తూ ఉంటారు. ఇక కొంతసేపటికి యష్ వేదను అక్కడే వదిలేసి బయటకు వస్తాడు. ఇక వేద మందు తాగిన విషయాన్ని యష్ తన తమ్ముడు తో డిస్కస్ చేస్తూ ఉండగా ఆ మాటలు వేద (Vedha) వాష్ రూమ్ లో ఉండి వింటుంది.
ఇక తాను చేసిన నిర్వాకం అంతా గుర్తుతెచ్చుకొని వేద యష్ (Yash) ను గట్టిగా చెంప మీద కొడుతుంది. అంతేకాకుండా నువ్వు అస్సలు మనిషివేనా.. సిగ్గుందా నీకు.. అని అంటుంది. అంతేకాకుండా ఐ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్.. అంతమంది ముందు నేను అలా బిహేవ్ చేస్తే అందరూ నన్ను ఏమనుకుంటారు అని వేద (Vedha) ఏడుస్తుంది.
అంతేకాకుండా ఇంకోసారి నా ఆత్మ అభిమానం దెబ్బతినేలా ఏదైనా చేస్తే నేను ఉండలేను.. ఊరుకోను.. అని యష్ (Yash) కు చెప్పేస్తుంది. ఇక ఆ తర్వాత యష్ తను చంప దెబ్బ తిన్నందుకు చాలా అవమానకరంగా ఫీలవుతూ ఉంటాడు. ఈలోపు యష్ దగ్గరకు ఖుషి (Khushi) వచ్చి డాడీ నీకు ఒక గిఫ్ట్ అని చెప్పి ఒక ముద్దు పెడుతుంది.
మరోవైపు మాలిని (Maalini), సులోచనలు.. వేద, యష్ లు మన ఫ్యామిలీ లకు రెండు కళ్ళ లాంటి వారు.. వాళ్లని మనం బాగా చూసుకోవాలని అనుకుంటారు. ఇక వేద బెడ్ పై పడుకొని ఉండగా అక్కడకు యష్ (Yash) వచ్చి భరించే వాడే భర్త అంటారు. మరి ఇలాంటి భార్యను భరించడం ఎలా రా దేవుడా అని అనుకుంటాడు.
అంతేకాకుండా నన్నే కొడతావా అంటూ కోపంతో టెడ్డీబేర్ తో వేద (Vedha) ను గట్టిగా కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో వేద ఉలిక్కిపడి లేస్తుంది. ఇక యష్ (Yash) వేద గదిలోకి మళ్ళీ తిరిగి వచ్చి ఏమీ తెలియనట్టు గా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా నిమ్మరసం తాగు.. తాగింది మొత్తం దిగుతుంది అని అంటాడు.
ఇక తరువాయి భాగం లో యష్ (Yash) స్నానం చేస్తూ వేద (Vedha) ను కింద పడకుండా పట్టుకొని కళ్ళలో కళ్ళు పెట్టి ఒకరికొకరు రొమాంటిక్ గా చూసుకుంటూ ఉంటారు. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.