Ennenno Janmala Bandham: యష్, వేద మధ్య రొమాంటిక్ సీన్.. సంతోషంలో రాజా రాణి?
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 11వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
ఈరోజు ఎపిసోడ్ లో యష్, వేద, రాజా, రాణి అందరూ కలిసి గుడికి వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి గుడి లోపలికి వెళ్ళగా అప్పుడు రాజా ఈ గుడి మన పూర్వీకులు నిర్మించారు అప్పటి నుంచి ఈ గుడి పెద్దగా మన వంశం వాల్లే ఉంటున్నారు అనడంతో చాలా గొప్ప విషయం తాతయ్య అని అంటాడు యష్. ఇప్పుడు పూజారి ఈ గుడిలో జరిగే పూజలు అన్నీ కూడా ఈ దంపతుల తోనే ఇప్పిస్తూ ఉంటాము చెప్పడంతో వెంటనే రాణి ప్రతి ఏడాది జరిపించే ఈ అన్యోన్య దాంపత్య వ్రతం ఈ ఏడాది మా తరఫున మా మనవరాలు,మనవడు చేస్తున్నారు మాకు అంతకంటే సంతోషం ఏముంది అనడంతో అందరూ కలిసి సంతోషంగా లోపలికి వెళ్తారు.
తర్వాత గుడిలోకి వెళ్ళాక వేద ధ్వజస్తంభం ముందు నిలబడడంతో యష్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. అప్పుడు రాజా ఆ సెల్లు నాకు ఇచ్చి నువ్వు కూడా పక్కకు వెళ్లి నిలుచొ మీ ఇద్దరికీ కలిపి ఫోటోలు తీస్తాను అని చెప్పి యష్ వేద లకు ఫోటోలు తీస్తాడు. ఆ తరువాత కలిసి గుడి లోపలికి వెళ్తారు. అప్పుడు దేవుడికి యష్,వేద చేతుల మీదుగా తులసి మాలను అందిస్తారు. అప్పుడు వారిద్దరు ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. తర్వాత పూజారి యష్ వేదలకు అన్యోన్య దాంపత్య పూజ గురించి వివరిస్తూ ఉంటాడు. ఎంతో జాగ్రత్తగా, మనసుపెట్టి పూజ చేయండి మీకు ఏమైనా అంతరాయాలు ఉంటే అవి వెంటనే తొలగిపోతాయి అని అంటాడు.
అప్పుడు రాజా రాణి ఇద్దరూ అన్యోన్య దాంపత్యం గురించి ఆ వ్రతం ఫలితం గురించి వివరిస్తూ ఉంటారు. అప్పుడు యష్,వేద ఇద్దరు రాజారాణి మాటలు విని ఆలోచనలో పడతారు. అప్పుడు అందరూ దేవుడికి మొక్కుకుంటూ ఉండగా అప్పుడు వేద మా ఇద్దరి మధ్య ఈ వ్రతం వల్ల ఉన్న దూరం తొలగిపోవాలి అనే దేవుడిని కోరుకుంటూ ఉంటుంది. ఇప్పుడు యష్ వేద కోసమే నేను ఇదంతా చేస్తున్నాను వేద మనసులో ఏది అనుకుంటే అది నిజం చెయ్యి అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వేద, యష్ ఇద్దరూ ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటారు.
ఆ తర్వాత చేతికి కంకణాలు కట్టుకుంటారు. అప్పుడు వారు ఒకరివైపు ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. తర్వాత పవిత్ర స్నానం కోనేటి స్నానం అనడంతో యష్ ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత అందరూ కలిసి కోనేటి దగ్గరికి వెళ్తారు. అక్కడ దంపతులు కలిసి స్నానం చేస్తూ ఉండగా అది చూసి యష్, వేద ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వేద మీకు ఇబ్బందిగా అనిపిస్తే నేను వాళ్ళని ఆపేస్తాను అనడంతో పర్లేదు వేద నేను ఏది చేసినా నీకోసం నీ సంతోషం కోసం చేస్తాను అనడంతో వేద సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత వేద యష్ ఇద్దరూ కలిసి లోపలికి దిగుతారు.
అప్పుడు ఎవరికి వారు స్నానం చేయాలి అనుకుంటుండగా మీరిద్దరూ అలా స్నానం చేయకూడదు ఒకరినొకరు పట్టుకొని స్నానం చేయాలి అని అంటాడు రాజా. అప్పుడు యష్ వేద ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండగా వీళ్ళిద్దరికీ అయ్యేలా లేదు మనిద్దరం వెళ్లి స్నానం చేద్దాం రా అనడంతో ఊరుకోండి మీకు అసలు హెల్త్ బాగోలేదు ఇప్పుడు అవసరమా అని అంటుంది రాణి. అప్పుడు పనిమనిషి ఆమె భర్త ఇద్దరూ మునగడంతో ఇద్దరు కూడా అలాగే మునగండి అనడంతో యష్ వేద ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ వాళ్ళు చెప్పినట్టుగా మునుగుతూ ఉంటారు.
అలా మూడుసార్లు వేద యష్ లు మునుగుతారు. అప్పుడు రాజా సంతోషపడుతూ వాళ్ళని అలా చూస్తుంటే నాకు కూడా అలాగే చేయాలని ఉంది. మనం కూడా విలేజ్ స్నానం చేద్దాము అనడంతో చాల్లే సంబడం ఊరికే ఉండు రాజా అని అంటుంది రాణి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కోనేటి నుంచి బయటికి రావడంతో పూజారి బట్టలు కట్టుకోమని ఇస్తాడు. వెళ్లి బట్టలు మార్చుకొని రండి మేం పూజ కార్యక్రమాలు చూస్తాము అని రాజారాణి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వేద యష్ ఇద్దరూ పూజారి ఇచ్చిన బట్టలను కట్టుకొని అక్కడికి వస్తారు.
అప్పుడు యష్ ని ఆ బట్టలలో చూసిన వేద ఇప్పుడు చిటపటలాడుతూ సూటు బూట్లు ఉంటే అంతగా గమనించలేదు కానీ ఈ సాంప్రదాయ దుస్తుల్లో ఆయన చాలా బాగున్నారు అని వేదా అనుకుంటూ ఉంటుంది. అప్పుడు యష్ కూడా ఈరోజు వేదాన్ని చూస్తుంటే ఏదో కొత్తగా గమ్మత్తుగా అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి దగ్గరకు ఒకరు వచ్చి ఏంటి అలా చూస్తున్నారు అనగా అప్పుడు యష్ హరిలో ఈరోజు నువ్వు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నావు అనడంతో మీరు కూడా స్పెషల్ గా ఉన్నారు అని వేద అనగా ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వస్తుండగా అది చూసి రాజారాణి ఇద్దరు మురిసిపోతూ ఉంటారు.