Oscars 2022: డ్యూన్ మూవీ ప్రభంజనం... 2022 ఆస్కార్ విజేతలు వీరే!
లాస్ ఏంజెల్స్ నగరంలో అత్యంత వైభవంగా 94వ అకాడమీ అవార్డ్స్ వేడుక ముగిసింది. ప్రపంచ ప్రఖ్యాత చిత్ర ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో ఉత్తమ చిత్రాలు,నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు అవార్డ్స్ కొల్లగొట్టారు. 2022 ఆస్కార్ అవార్డ్స్ దక్కించుకున్నవారు ఎవరో చూద్దాం..

oscars 2022
జీవితంలో ఒక్క ఆస్కార్ అయినా అందుకోవాలి, ప్రపంచ వేదికపై దాన్ని ముద్దాడాలని అందరూ కలలు కంటారు. చాలా కొద్దిమందికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. ఇక 2022 ఆస్కార్ అవార్స్ (Oscars 2022)ప్రతిభ కలిగిన చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులు చేజిక్కించుకున్నారు. ఉత్తమ నటుడి అవార్డు హాలీవుడ్ సీనియర్ హీరో విల్ స్మిత్ గెలుపొందారు. కింగ్ రిచర్డ్ చిత్రంలోని నటనకు గాను ఈ అవార్డు ఆయనను వరించింది. కెరీర్ లో మొదటిసారి విల్ స్మిత్ (Will Smith)ఆస్కార్ గెలుపొందారు.
oscars 2022
ఇక ఉత్తమ నటిగా జెస్సికా చస్టేన్ ఆస్కార్ అవార్డుకు ఎంపికయ్యారు. ద ఐస్ ఆఫ్ టామీ ఫే చిత్రంలోని నటనకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఇక ఉత్తమ చిత్రంగా చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్(CODA) ఎంపికైంది. ఈ మూవీ మూడు విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. మరో సెన్సేషనల్ మూవీ డ్యూన్ ఆస్కార్ అవార్డ్స్ అధిక మొత్తంలో కొల్లగొట్టింది. ఏకంగా ఆరు విభాగాల్లో డ్యూన్ ఆస్కార్స్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్ దక్కించుకున్న చిత్ర్రాలు, ప్రముఖులు వీరే.
oscars 2022
ఉత్తమ చిత్రం - చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్
ఉత్తమ నటుడు - విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)
ఉత్తమ నటి - జెస్సికా చస్టేన్ (ద ఐస్ ఆఫ్ టామీ ఫే)
ఉత్తమ దర్శకురాలు - జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ద డాగ్)
ఉత్తమ సహాయ నటి - అరియానా దిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ)
ఉత్తమ సహాయ నటుడు - ట్రాయ్ కోట్సర్ (చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - గ్రెగ్ ఫ్రెజర్ (డ్యూన్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - నో టైమ్ టు డై
బెస్ట్ డాక్యుమెంటరీ ఫియేచర్ - సమ్మర్ ఆఫ్ సోల్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే- షాన్ హెడర్(చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్) షాన్ హెడర్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే - బెల్‌ఫాస్ట్ (కెన్నత్ బ్రానా)
oscars 2022
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - జెన్నీ బీవన్ (క్రూయెల్లా)
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫియేచర్ - డ్రైవ్ మై కార్ (జపాన్)
బెస్ట్ యానిమేటెడ్ ఫియేచర్ - ఎన్‌కాంటో
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ - హన్స్ జిమ్మర్ (డ్యూన్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - డ్యూన్ (పాల్ లాంబర్ట్, ట్రిస్టన్ మైల్స్, బ్రియన్ కానర్, గెర్డ్ నెఫ్‌జర్)
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ - జో వాకర్ (డ్యూన్)
బెస్ట్ సౌండ్ - డ్యూన్ (మాక్ రుత్, మార్క్ మాంగిని, థియో గ్రీన్, డగ్ హెంఫిల్, రాన్ బార్ట్‌లెట్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - డ్యూన్ (ప్రొడక్షన్ డిజైన్- పాట్రైస్ వెర్మట్, సెట్ డెకరేషన్- జుజానా సిపోస్)
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ - ద ఐస్ ఆఫ్ ది టామీ ఫే (లిండా డౌడ్స్, స్టెఫనీ ఇన్‌గ్రామ్, జస్టిన్ రాలే)
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ది లాంగ్ గుడ్‌బై
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ది విండ్‌షీల్డ్ పైపర్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ద క్వీన్ ఆఫ్ బాస్కెట్‌బాల్
oscars 2022
హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ అమెరికన్ నటుడు క్రిస్ రాక్ పై చేయి చేసుకున్నారు. 94వ అకాడమీ అవార్డ్స్ ప్రెజెంటర్స్ లో ఒకరైన క్రిస్ రాక్ వార్డ్ ప్రకటిస్తూ విల్ స్మిత్ వైఫ్ జడా పికెట్ స్మిత్ పై కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశాడు. దీంతో కోపానికి గురైన విల్ స్మిత్ వేదికపై అందరూ చూస్తుండగానే క్రిష్ రాక్ ని తిట్టారు. నీ దరిద్రపు నోటి నుండి నా భార్య పేరు రానీయకు అంటూ... క్రిస్ రాక్ ముఖంపై పంచ్ విసిరాడు.
ఈ హఠాత్పరిణామానికి ఆస్కార్ వేడుకకు హాజరైన ప్రపంచ ప్రఖ్యాత నటులు, దర్శక నిర్మాతలు షాక్ తిన్నారు. ఈ వేడుకను లైవ్ లో ప్రసారం చేస్తున్న డిస్నీ హాట్ స్టార్ కొంత సమయం పాటు స్ట్రీమింగ్ ఆపివేసింది. సినిమా వేడుకల్లో సెన్సేషన్ కోసం, ఆడియన్స్ కి కొంచెం థ్రిల్ పంచడానికి ఇలాంటి అసాధారణ పరిణామాలు స్క్రిప్ట్ ప్రకారం అమలు చేస్తారు. కాబట్టి విల్ స్మిత్ తోటి నటుడిని ఆస్కార్ వేదికపై కొట్టడం స్క్రిప్టెడా లేక నిజంగానే కొట్టాడా ? అనే అయోమయంలో ప్రముఖులు ఉండిపోయారు. అమెరికన్ నటి అయిన జడా పెంకెట్ ని విల్ స్మిత్ 1997లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కలరు.
ఇక భారత్ నుండి సూర్య నటించిన జై భీమ్, మోహన్ లాల్ నటించిన మరక్కార్ చిత్రాలు 2022 ఆస్కార్ నామినేషన్స్ కి పంపడం జరిగింది. అయితే ఈ రెండు చిత్రాలు ఎంపిక కాలేదు. ప్రతిసారి ఇండియన్ చిత్రాలకు నిరాశ ఎదురవుతుండగా కనీసం జై భీమ్ ఆస్కార్ బరిలో నిలుస్తుందని చాలా మంది భావించారు.