- Home
- Entertainment
- అబ్బనీ తియ్యనీ దెబ్బ... విల్ స్మిత్ నుండి బాలయ్య వరకు పబ్లిక్ లో చేయిచేసుకున్న సూపర్ స్టార్స్
అబ్బనీ తియ్యనీ దెబ్బ... విల్ స్మిత్ నుండి బాలయ్య వరకు పబ్లిక్ లో చేయిచేసుకున్న సూపర్ స్టార్స్
ప్రపంచప్రఖ్యాత ఆస్కార్ వేదికపై హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటుడు క్రిస్ రాక్ చెంపపై కొట్టడం అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. 94వ ఆస్కార్స్ (Oscars 2022)వేడుక మార్చి 27న లాస్ ఏంజెల్స్ ఘనంగా జరిగింది. ఈ ఇంటెర్నేషన్ ఈవెంట్ కి క్రిస్ రాక్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Will Smith
అవార్డుల ప్రధానం జరుగుతుండగా హోస్ట్ క్రిస్ రాక్ (Chris Rock)ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విల్ స్మిత్ వైఫ్ జడా పెంకెట్ స్మిత్ పై ఆయన జోక్స్ వేశారు. దీనితో ఆగ్రహానికి గురైన విల్ స్మిత్ నేరుగా వేదికపైకి వెళ్లి క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించాడు. ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్న విల్ స్మిత్.. అనంతరం వేదికపై అందరికీ క్షమాపణలు చెప్పారు. విల్ స్మిత్ (Will Smith)తోటి నటుడిపై చేయి చేసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. పబ్లిక్ లో ఓ సెలెబ్రిటీ టెంపర్ కోల్పోవడం చాలా అరుదు. అలా సహనం కోల్పోయి ఎవరైన స్టార్ ఇతరులపై చేయి చేసుకుంటే అది సెన్సేషన్ అవుతుంది. ఇండియాలో కూడా కొందరు స్టార్స్ తమ సహనటులు, సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ పై వివిధ సందర్భాల్లో చేయి చేసుకున్నారు. వారెవరో ఆ సందర్భాలు ఏమిటో చూద్దాం...
Balakrishna
ఇక టాలీవుడ్ స్టార్స్ లో బాలయ్య (Balakrishna)ఈ లిస్ట్ లో ముందున్నాడు. బాలయ్యకు టెంపర్ ఎక్కువ. ఆయన పలుమార్లు తన అభిమానులు, అసిస్టెంట్స్ పై చేయిచేసుకున్నారు.బాలయ్యకు కోపం వస్తే పబ్లిక్ లో ఉన్నామనే ఆలోచన కూడా వదిలేసి చేతికి పనిచెబుతాడు. బాలయ్య పబ్లిక్ లో ఇతరులను కొట్టడం పలుమార్లు వివాదాస్పదమైంది.
Salman khan
సల్మాన్ ఖాన్ (Salman Khan)హీరోగా 2019లో విడుదలైన ‘భారత్’ హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఈ చిత్ర ప్రీమీయర్ సందర్భంగా కొంత మంది ఫ్యాన్స్ అతడిని చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో ఓ అభిమాని పట్ల సల్మాన్ బాడీగార్డ్ దురుసుగా వ్యవహరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన భాయ్‌జాన్ సెక్యూరిటీ గార్డు చెంప చెళ్లుమనిపించాడు.
Shahrukh khan
కెరీర్ లో మొదటిసారి షారూఖ్ ఖాన్ (Shahrukh khan)చేసిన సూపర్ హీరో మూవీ రా. వన్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రా వన్ అనుకున్నంత విజయం సాధించలేదు. కాగా ఫరా ఖాన్ భర్త శిరీష్ కుందర్ రా వన్ సినిమాను కించపరుస్తూ ట్వీట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత.. సంజయ్ దత్ 2012లో ఓ పార్టీని హోస్ట్ చేశాడు. ఈ పార్టీలో నా సినిమాకు వ్యతిరేకంగా ఎందుకు ట్వీట్ షారుఖ్ శిరీష్ పై చేయి చేసుకున్నారు.
Nagmaa
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కెరీర్ నెమ్మదించాక రాజకీయ నాయకురాలిగా మారిన సంగతి తెలిసిందే. కాగా ఉత్తర్ ప్రదేశ్, మీరట్‌లో జరిగిన ఓ సమావేశానికి నగ్మా హాజరయ్యారు. ఆ సమయంలో ఓ వ్యక్తి నగ్మాను తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నగ్మా అతడి చెంప పబ్లిక్ లో చెళ్లుమనిపించింది.
Govinda
కామెడీ పాత్రలతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోవిందా. ‘మనీ హై తో హానీ హై’ లో అతడు హీరోగా నటించాడు. ఈ సినిమా సెట్‌కు వచ్చిన ఓ విజిటర్ అక్కడ ఉన్న ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది తెలిసిన గోవిందా అందిరి ముందే అతన్ని కొట్టాడు.
Akshay kumar
వివాదరహితుడిగా పేరున్న అక్షయ్ కుమార్ కూడా ఓ సందర్భంలో సహనం కోల్పోయాడు. హీరోయిన్ ప్రియాంక చోప్రా సెక్రెటరీ ప్రకాష్ జాజును ఖిలాడీ హీరో ఓ సారి కొట్టాడు. తాను ప్రియాంకతో డేటింగ్ చేస్తున్నాననే పుకార్లను ప్రకాష్ ప్రచారం చేస్తున్నడని అక్షయ్ ఆరోపించాడు. దీంతో ఖిలాడీ హీరో ప్రకాష్ చెంపను పగలగొట్టాడు.