Kalki 2898 AD: జపాన్ బాక్సాఫీస్‌పై ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ ప్రభంజనం
ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' జపాన్‌లో విడుదలైంది. RRR రికార్డులను బద్దలు కొడుతుందా అనేది చూడాలి.
prabhas, Kalki, Japan, RRR
ప్రభాస్ మ్యాసీవ్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD' జనవరి 3, 2025న జపాన్‌లో షోగాట్సు ఫెస్టివల్ కి విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. అక్కడి పరిశ్రమ దిగ్గజం కబాటా కైజో ఆధ్వర్యంలో ట్విన్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్న 'కల్కి 2898 AD' గ్లోబల్ జర్నీలో మరో అధ్యాయాన్ని నాంది పలికింది.
ఈ నేపధ్యంలో కల్కి చిత్రం అక్కడ ప్రేక్షకులను ఏ స్దాయిలో ఆకట్టుకుంటోంది...ఎంత కలెక్షన్స్ సాధిస్తోందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్.ఆర్ ఆర్ మ్యాజిక్ ని భాక్సాఫీస్ దగ్గర క్రేయేట్ చేస్తోందా అనే విషయాలు ట్రేడ్ డిస్కస్ చేస్తోంది.
వైజయంతీ మూవీస్ నిర్మించిన 'కల్కి 2898 AD" ఇప్పటికే కలెక్షన్స్ వైజ్ నెంబర్ వన్ స్థానాన్ని పొందింది, ప్రపంచవ్యాప్తంగా ₹ 1200 కోట్లకు పైగా, హిందీ బాక్సాఫీస్ వద్ద ₹ 300 కోట్లకు పైగా వసూలు చేసి, 2024లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది.
డిస్టోపియన్ యూనివర్స్ నుంచి వారియర్ గా భైరవ( ప్రభాస్ ) భారతీయ ఇతిహాసం'మహాభారతం' నుండి అమరుడైన అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్రలో విజువల్ వండర్ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. పౌరాణిక వైభవాన్ని భవిష్యత్ తో బ్లెండ్ చేసిన కథనంలో సుమతిగా దీపికా పదుకొణె నటించారు. కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్‌గా కల్కి తో ఫేస్ అఫ్ చేసారు.
Prabhas, Hanu Raghavapudi, KALKI
గత కొంతకాలంగా జపాన్ బాక్సాఫీస్ కొన్ని తెలుగు చిత్రాలకు బంగారు బాతులా మారింది. ముఖ్యంగా పాన్-ఇండియా చిత్రాల మొదలవ్వటం, రాజమౌళి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన తరువాత, జపనీస్ బాక్సాఫీస్ తెలుగు సినిమాలు డబ్బింగ్ వెర్షన్స్ కు సై అంటోంది. జపాన్‌లో బాగా సక్సెస్ అయిన చివరి భారతీయ చిత్రం RRR. ఇప్పుడు, కల్కి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి దేశంలోని తెరపైకి వచ్చింది.
కల్కి 2898 AD ప్రస్తుతం జపాన్ లో భారీ స్క్రీన్స్ లో విడుదలైంది. టీమ్ గట్టిగానే సినిమాను ప్రమోట్ చేసింది. అలాగే టిక్కెట్ విండోల వద్ద పెద్ద సంఖ్యలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అంతకుముందు, RRR సక్సెస్ ఫుల్ గా 200 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేయటమే అందుకు కారణం. అక్కడ ఆర్ ఆర్ ఆర్ చిత్రం 410 మిలియన్ యెన్ కంటే ఎక్కువ ఆదాయం తెచ్చుకుంది.
ఈ చిత్రం జపాన్‌లోని 44 సిటీలలో 209 స్క్రీన్‌లు మరియు 31 ఐమాక్స్ స్క్రీన్‌లలో విడుదలైంది. RRR అక్కడ దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు, కల్కి RRR సంఖ్యలను దాటి అతిపెద్ద చిత్రంగా అవతరించే అవకాశం ఉందని ట్రేడ్ లెక్కలు వేస్తోంది.
#Baahubali2 , Kalki, Devara, Game Changer
ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ స్టార్‌డమ్ ఉంది . అందుకు బాహుబలి ఫ్రాంచైజీ సక్సెస్ కారణం. అప్పటి నుంచి ప్రభాస్ కు జపాన్‌లో పర్మెనెంట్ గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ప్రభాస్ జపాన్‌లో కల్కిని ప్రమోట్ చేయాల్సి ఉంది, కానీ గాయం కారణంగా అతను చేయలేకపోయాడు. అయితే, జపాన్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ సేల్స్ సంతృప్తికరంగా ఉన్నాయి. కల్కి RRRని సులభంగా అధిగమిస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు.