Karthika deepam: ప్రేమ్ వీడియో చూసి షాకైన హిమ.. రాత్రంతా గదిలోనే శౌర్య, నిరుపమ్!
Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 3వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ప్రేమ్, నిరుపమ్ శౌర్యలకు కలిపి ఒక ప్లేట్ మాత్రమే భోజనం ఇస్తాడు.కానీ శౌర్య మాత్రం నిరుపమ్ కి ఇవ్వకుండా తింటుంది. మరోవైపు ప్రేమ్ హిమలు కూడా ఒక ప్లేట్ భోజనాన్ని పంచుకుంటారు. ఇటువైపు సౌర్య నిరూపమని నోరూరిస్తూ ఉంటాది. చివరికి భోజనం నిరూపమ్ తో పంచుకుంటుంది.
బయట ప్రేమ్ హిమలు చల్లగాటిలో భోజనం ఆస్వాదిస్తూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిరూపమ్ శౌర్యని చూసి "నేను అనుకుంటున్నాంత చెడ్డ పిల్ల కాదు శౌర్య" అనుకుంటాడు. అదే సమయంలో శౌర్య నిరుపమ్ ని చూస్తూ "మనిద్దరం ఒకే గదిలో కలిసి భోజనం పంచుకుంటున్నాను కాని,మీతో మా జీవితం పంచుకోలేకపోయాను" అని మనసు లో బాధపడుతుంది.
మరొకవైపు ప్రేమ్ హిమని పడగొట్టడానికి తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంటాడు. ప్రేమ్ ఆ రాత్రి పూట చలిమంట పెడతాడు. చలిమంట ఎందుకు పెట్టావు అనగా వాతావరణం చాలా బాగుంది అని పెట్టాను అని ప్రేమ అంటాడు.అప్పుడు హిమ "నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ చాలా అదృష్టవంతురాలు" అని అంటుంది.
నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని ప్రేమ్ చెప్పగా ఎవరది అని హిమ ఉత్సాహంతో అడుగుతుంది. త్వరలోనే చెప్తాను అని అంటాడు ప్రేమ. ఈలోగా నిరూపం శౌర్యలు లోపల ఏం చేస్తున్నారో అని ప్రేమ్ చూడడానికి వెళ్తాడు. కానీ ఫోన్ మాత్రం అక్కడే వదిలేస్తాడు. ప్రేమ్ తనకి ప్రపోజ్ చేస్తున్న వీడియో హిమ చూస్తుంది. ప్రేమ్ తనని ప్రేమిస్తున్నాడు అని ఆశ్చర్యపోతుంది.
ఈ లోగ ప్రేమ్ అక్కడికి వచ్చి నాకేమైనా ఫోన్లు వచ్చాయా? అని హిమని అడగక వీడియో చూపిస్తుంది. అప్పుడు ప్రేమ్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఇక జరిగిందంతా చెప్పేస్తాడు.నేను నీకు ఆ వీడియో ఎప్పుడో పంపాలి అనుకున్నాను. పంపాను కానీ అప్పుడే నీ ఫోన్ రిపేర్ కి వచ్చింది. అప్పుడు హిమ అక్కడ్నుంచి వెళ్తున్నప్పుడు ప్రేమ్ ఆపి సమాధానం చెప్పవేంటి అని అదుగుతాడు.
అప్పుడు హిమ, "జీవితంలో మనం అనుకున్నవన్నీ అవ్వవు అదే జీవితం" అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నిరూపమ్ సౌర్యలు లోపల ఏం చేస్తున్నారు అని చూడగా అప్పుడే శౌర్యకు చలి పుడుతుందని చెప్పి నిరూపం తన దుప్పటికి ఇస్తాడు. అది చూసి బయటనుంచి హిమ ప్రేమ్ లు ఆనందపడతారు. ఈలోగా శౌర్య లెగిసి ఆ దుప్పటిని తిరిగి నిరూపమ్ కి ఇచేస్తుంది.
మేము పేదవాళ్ళం ఇవన్నీ మాకు అలవాటే కానీ మీకు ఇవన్నీ అలవాటు అవ్వదు కనుక ఇది ఇప్పటిని మీరే తీసుకోండి అని సౌర్య అనగా నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? ఇదే సమయంలో హిమ ఉంటే ఇంతకన్నా దారుణమైన ప్రదేశంలో కూడా నేను సద్దు. మనం ఎక్కడ ఉన్నామనేది ముఖ్యం కాదు, మనం ఎవరితో ఉన్నామనేది ముఖ్యం అని నిరుపమ్ అంటాడు.
శౌర్య బాధపడి పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ఈ లోగ నిరుపమ్, హిమ గురించి ఆలోచించుకుంటూ ఇదే ప్లేస్ లో హిమ ఉంటే రాత్రంతా మాట్లాడుకుంటూ సమయం గడిపే వాళ్ళం కదా అనుకోని పడుకుండిపోతాడు. దాని తర్వాత రోజు నిరూపం లేచి ప్రేమ్ ని, రాయితో కొట్టి తాళం తీయమని అడుగుతాడు. ఈలోగా ప్రేమ్ రాయి తీసి ఆ తాళం కొడుతున్నట్టు నటిస్తాడు. అంతట్లో సౌర్య లెగుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.