బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్స్ చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ వస్తున్నట్టా లేదా..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫైనల్ కు చేరింది. రెండు మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. మరి ఈ ఫినాలేకు చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా కొనసాగింది. 15 వారాలు బిగ్ బాస్ షో ను చాలా డిఫరెంట్ గా రన్ చేశారు నిర్వాహకులు. గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నడిచింది. అయితే చివరివారం మాత్రం చాలా చప్పగా టేస్ట్ లెస్ గా తయారయ్యింది.
అంతే కాదు చివరివారం హోరాహోరిగా టాస్క్ లు ఉంటాయి అనుకుంటే.. ఏదో జరగలేదు అన్నట్టుగా జరిపేస్తున్నాడు బిగ్ బాస్. సీజన్ అంతా లిమిట్ లెస్ ట్విస్ట్ లు.. అద్భుతమైన టాస్క్ లు, ఎన్నో జ్ఞాపకాలతో కొనసాగగా.. ఫైనల్ ఫ్రోగ్రామ్ ను చాలా గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేశారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 పూర్తయ్యింది. ఊహించని విధంగా వైల్డ్ కార్డు ఎంట్రీలతో, సీజన్ అంతా అన్‌లిమిటెడ్ ట్విస్టులు, అన్‌లిమిటెడ్ ఫన్ తో సాగింది. ఇక గత సీజన్ల కంటే అద్భుతంగా నడించింది బిగ్ బాస్. చివరి స్టేజ్ కు వచ్చేసింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం అద్భుతంగా చేయబోతున్నారు. అయితే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి ఐకాన్ సార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
అల్లు అర్జున్ చేతుల మీదగా బిగ్ బాస్ తెలగు సీజన్ 8 విన్నర్ కు ట్రోఫీ అందించనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
రెండు మూడు రోజులుగా ఈ వార్త వినిపిస్తుంది. కాని తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం.. బెయిల్ పై తిరిగిరావడం లాంటి పరిణామాల నేపథ్యంలో ఇది ఎంత వరకూ సాధ్యం అవుతుందనేదిచెప్పలేం.
ఒక వేళ అల్లు అర్జున్ గతంలో బిగ్ బాస్ ఫైనల్స్ కు వస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కాని...ఇప్పుడు మారిన పరిణామల నేపథ్యంలో బన్నీ వచ్చే అవకాశాలు లేవనే తెలుస్తోంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరు అనేవిషయంపై మాత్రం బిగ్ బాస్ నిర్వాహకులు అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరి పుష్ప 2 సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్ ఈ షోకి చీఫ్ గెస్ట్ గా వస్తాడా లేదా తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటికే గత సీజన్స్ విన్నర్స్ కి ట్రోఫీ అందించడానికి పలువురు సినీ సెలబ్రిటీస్ వచ్చారు. కాని రెండు మూడు సీజన్లు మాత్రం నాగార్జున మాత్రమే విన్నర్ కుట్రోఫీ ఇచ్చారు. గత సీజన్ అంటే 7 సీజన్ కి మాత్రం చీఫ్ గెస్ట్ రాలేదు. నాగార్జుననే విన్నర్ కి ట్రోఫీ అందించారు.
అంతకు ముందు రెండు సీజన్లకు మెగాస్టార్ చిరంజీవి వచ్చి విన్నర్ కు ట్రోఫీ అందించారు. ఇక ఈ సీజన్ కు పెద్ద గెస్ట్ ను పిలవాలి అని ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ టీమ్. మరి బన్నీ వస్తాడా..? మరేవరైనా వస్తారా అనేది చూడాలి.